యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

లయబద్ధపు జిమ్నాస్టిక్స్ లో తనకు తానే పోటీ అవుతున్న మహారాష్ట్ర జిమ్నాస్ట్ సంయుక్త కాలే

Posted On: 29 JAN 2023 2:42PM by PIB Hyderabad

పంచకులలో జరిగిన నాలుగో ఖేలో ఇండియా యువజన క్రీడోత్సవాల్లో లయబద్ధపు జిమ్నాస్టిక్స్ విభాగంలో మొత్తం ఐదు బంగారు పతకాలనూ మహారాష్ట్రకు చెందిన జిమ్నాస్ట్ సంయుక్త కాలే చేజిక్కించుకున్నారు. మళ్లీ గ్వాలియర్ లో లక్ష్మీబాయ్ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వేదికగా జరిగే ఖేలో ఇండియా యువజన క్రీడల్లో తనమీద తానే పోటీ పడే పరిస్థితిలో పతకాల పంటకు సిద్ధమవుతోంది. .

https://ci3.googleusercontent.com/proxy/_T7TB70uKTj9a4ulpwBgJq9aBsqLT6Q9dyZpcNkKPegaU113gwkVFiQ3QQkA5DLeP3AdGlHNope71z5lmRNJ7NI59qL3MUCocziLKcSesbGlBYtAR5mNLN_hLA=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001XQGC.jpg

మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన సంయుక్త ఐదేళ్ళ మధ్యప్రదేశ్వ లో జరిగే 2022 ఖేలో ఇండియా యసులోనే జిమ్నాస్టిక్స్ మొదలుపెట్టింది. పంచకులలో వ్యక్తిగత విభాగంలో నాలుగు స్వర్ణాలు గెలిచింది. దీంతో బాటు హూప్, బాల్, క్లబ్, రిబ్బన్ విభాగాల్లోను ప్రతిభ చాటింది. ఇలా మొత్తం ఐదు స్వర్ణాలు సాధించినట్టయింది. మధ్యప్రదేశ్ ఖేలో ఇండియా పోటీలకు సిద్ధపడుతున్న సంయుక్త ఈ మధ్యనే గుజరాత్ నేషనల్ గేమ్స్ లోను, బెంగళూరు లో జరిగిన 25వ నేషనల్ చాంపియన్ షిప్ పోటీల్లోనూ సత్తా చాటింది.

మధ్యప్రదేశ్ లో జరగబోయే 2022 ఖేలో ఇండియా యువజన క్రీడల్లో విజయావకాశాల గురించి మాట్లాడుతూ, తనశిక్షణ బాగానే ఉందని, మహారాష్ట్రకు చెందిన జిమ్నాస్ట్ లు అందరూ సిద్ధంగా ఉన్నారని సంయుక్త చెప్పారు.తాను ఫీనిక్స్ అకాడెమిలో మానసి సర్వే, పూజ సర్వే పర్యవేక్షణలో శిక్షణ తీసుకుంటున్నానని చెప్పారు. రోజుకు 6 గంటల ప్రాక్టీస్ కు తల్లిదండ్రులు, కోచ్ లు సహకరిస్తారని చెప్పారు. గ్వాలియర్ లో తాను కనబరచే ప్రతిభ తనకు అంతర్జాతీయ గుర్తింపు తెస్తుందని సంయుక్త ఆశాభావంతో ఉంది. ఈసారి తన అకాడెమీకి చెందిన కీమయా కార్లేతో పోటీపడుతునప్పటికీ, నిజమైన పోటీ తనకు తానే అన్నారు.

 

సంయుక్తను అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్ సమాఖ్య గుర్తించి ప్రపంచ అత్యుత్తమ జిమ్నాస్ట్ ల జాబితాలో చేర్చింది. ఆమెకు ఇదొక గొప్ప గుర్తింపు. ఖేలో ఇండియా యువజన క్రీడలు, నేషనల్ గేమ్స్, నేషనల్ చాంపియన్ షిప్ తో బాటు సంయుక్త అనేక అంతర్జాతీయ పోటీలలో పాల్గొంది.

సంయుక్త సాధించిన ఘనతలను ఆమె కోచ్ మానసి సర్వే వివరిస్తున్నారు. ఇప్పటిదాకా సంయుక్త 130 పతకాలు సాధించిందని, అందులో 119 స్వర్ణాలని చెబుతున్నారు. థాయిలాండ్ లో జరిగిన ఏషియాన్ చాంపియన్ షిప్ లో క్వాలిఫయ్ కావటం భారత్ కు గర్వకారణమన్నారు. తన ప్రతిభతో ప్రకంపనలు సృష్టిస్తున్న సంయుక్త ఖేలో ఇండియా తరువాత లక్ష్య సాధన మీద తన ఏకాగ్రత మరింత పెరిగిందన్నారు

మధ్యప్రదేశ్ లో జరిగే 2022 ఖేలో ఇండియా లో మహారాష్ట్ర తరఫున 450 మంది అథ్లెట్లు వివిధ విభాగాలలో పాల్గొంటారు. వారిలో వేదాంత మాధవన్ (ఈత), శ్రద్దా చొప్డే(జూడో ), ఆకాంక్షా వ్యవహారే (వెయిట్ లిఫ్టింగ్ 55కిలోలు ), బిసాల్ చాంగమై (విలువిద్య), విశ్వనాథ్ సురేష్ (బాక్సింగ్ ), దేవిక ఘోర్పడే (బాక్సింగ్ 52కిలోలు ) ఉన్నారు.

దేశం నలుమూలల నుంచి 5000 మందికి పైగా క్రీడాకారులు మధ్యప్రదేశ్ లో మొదటి సారిగా జరుగుతున్న ఈ ఖేలో ఇండియా యువజన క్రీడోత్సవాల్లో పాల్గొంటున్నారు. భోపాల్ లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ చౌహాన్ జనవరి 30న ఈ పోటీలను లాంఛనంగా ప్రారంభిస్తారు. మధ్యప్రదేశ్ లోని ఎనిమిది నగరాలు - భోపాల్, ఇండోర్, గ్వాలియర్, జబల్పూర్, ఉజ్జయిని, బాలాఘాట్, మాండ్లా, ఖర్గోన్ (మహేశ్వర్ ) లో ఈ పోటీలు జరుగుతాయి. ట్రాక్ సైక్లింగ్ మాత్రం ఢిల్లీ లో జరుగుతుంది. 27 అంశాల్లో పోటీలు జరుగుతుండగా మొదటిసారిగా వాటర్ స్పోర్ట్స్ చేర్చారు.

*****

 



(Release ID: 1894548) Visitor Counter : 149