యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

షూటింగ్‌ను చేప‌ట్టేందుకు నా సోద‌రుడు స్ఫూర్తినిచ్చాడు, నాకు తోడ్ప‌డేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు - శివ న‌ర్వాల్‌

Posted On: 29 JAN 2023 2:45PM by PIB Hyderabad

 కొత్త ప్ర‌పంచ రికార్డును సృష్టిస్తూ టోక్యో పారా ఒలింపిక్స్‌లో స్వ‌ర్ణ ప‌త‌కాన్ని సాధించి 2021వ సంవ‌త్స‌రంలో మ‌నీష్ న‌ర్వాల్ చ‌రిత్ర సృష్టించారు. టోక్యోపారా ఒలింపిక్స్ స్వ‌ర్ణ ప‌త‌క విజేత అయిన మ‌నీష్ భార‌త్‌కు చెందిన అగ్ర షూట‌ర్ల‌లో ఒక‌రు. 

 


అత‌డి ప్ర‌జ్ఞ అతినిని కేవ‌లం ప్ర‌తిష్ఠాత్మ‌క ఖేలో ర‌త్న అవార్డుగ్ర‌హీత‌ను చేయ‌డ‌మే కాక వంద‌లాది పిల్ల‌లు షూటింగ్ ప‌ట్ల ఆస‌క్తిచెందడ‌మే కాక వారిలో క్రీడా అభిరుచిని ప్రేరేపించింది. 
కాగా, 2021లో విజ‌యాల‌ను సాధించ‌డానికి ముందే మ‌నీష్ త‌న చిన్న త‌మ్ముడు అయిన శివ న‌ర్వాల్  షూటింగ్‌ను చేప‌ట్టేందుకు, త‌న అడుగుజాడ‌ల‌లో న‌డుస్తూ ఈ క్షేత్రంలో త‌న‌దైన ముద్ర‌వేయ‌డానికి స్ఫూర్తినిచ్చాడు. 
ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2020 ఎడిష‌న్‌లో స్వ‌ర్ణాన్ని సాధించిన శివ‌, 2021 ఎడిష‌న్‌లో తిరిగి స్వ‌ర్ణాన్ని సాధించాడు. గ‌త ఏడాది ఈజిప్ట్ ప్ర‌పంచ ఛాంపియ‌న్ షిప్‌ల‌లో ఈ 17 ఏళ్ళ యువ‌కుడు సీనియ‌ర్‌గా రంగ‌ప్ర‌వేశం చేయ‌డ‌మే కాక‌, 10 మీట‌ర్ల ఎయిర్ పిస్ట‌ల్ ఈవెంట్‌లో  ఫైన‌ల్స్‌కు వెళ్ళి, 8వ స్థానంలో ప్యారిస్ ఒలింపిక్ కోటాను సాధించేంత స‌మీపానికి వెళ్ళాడు.
ప్రపంచ ఛాంపియ‌న్‌షిప్ ల ప‌త‌కాన్ని సాధించ‌డంలో వైఫ‌ల్యం వ‌ల్ల క‌లిగిన నిరాశను ఏషియ‌న్ ఎయిర్‌గ‌న్ ఛాంపియ‌న్‌షిప్ ల‌లో పురుషుల ఎయిర్ పిస్ట‌ల్ ఈవెంట్‌లో స్వ‌ర్ణాన్ని గెలుచుకునేలా ప్రేర‌ణ‌ను ఇచ్చుకున్నాడు.  
దేశంలో ఉత్త‌మ పారాషూట‌ర్‌గా త‌న‌ను తాను మ‌నీష్ నిల‌వ‌గా, ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో మ‌రొక ప‌త‌కాన్ని గెలుచుకుని, త‌న స్వ‌ర్ణాల హాట్రిక్‌ను పూర్తి చేయాల‌న్న‌ది శివ ప్ర‌స్తుత ల‌క్ష్యం. 
ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2022కు తిరిగి ఎంపిక చేయ‌డం ప‌ట్ల ఎంతో సంతోషంగా ఉన్నాను. గ‌తంలో జ‌రిగిన కెఐవైజి 2020, కెఐవైజి 2021లో నా ప్ర‌ద‌ర్శ‌న చాలా బాగుంది, ఇదే రాణింపు మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో కూడా కొన‌సాగి, నేను మ‌రొక‌సారి హ‌ర్యానాకు స్వ‌ర్ణాన్ని గెలుచుకోవాల‌ని ఆశిస్తున్నాను.
మ‌నీష్ సోద‌రుడు క‌నుక అద‌నపు ఒత్తిడి ఏమైనా ఉంటుందా అని ప్ర‌శ్నించిన‌ప‌పుడు, అత‌డికి మ‌ద్ద‌తుగా వ‌చ్చి, త‌ను ఎప్పుడూ నాకు స‌హాయం చేసేందుకు ఉంటాడు అని ఆ యువ‌కుడు వెంట‌నే స‌మాధాన‌మిచ్చాడు. 
మా పెద్ద‌న్న‌, అక్క ఇద్ద‌రూ కూడా షూటింగ్ చేస్తారు, మ‌నీష్ ఎయిర్ పిస్ట‌ల్ ఈవెంట్ల‌లో మ‌నీష్ బాగా రాణించ‌డం చూసిన త‌ర్వాత నేను షూటింగ్ సాధ‌న ప్రారంభించాన‌ని, శివ అన్నాడు. 
షూటింగ్ విష‌యంలో నాకు ఏదైనా స‌మ‌స్య వ‌చ్చిన‌ప్పుడు మ‌నీష్ నాకు ఎప్పుడూ మ‌ద్ద‌తుగా నిలవ‌డ‌మే కాదు నాకు సాయ‌ప‌డేందుకు సిద్ధంగా ఉంటాడు అని చెప్పాడు. 
ఇంత‌కు ముందు జ‌రిగిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అర్హ‌త ద‌శ‌లో శివ 588 స్కోర్ సాధించాడ‌డు. ఇది అత‌ని టీంమేట్ స‌మ్రాట్ రాణా క‌న్నా ఐదు పాయింట్లు ఎక్కువ సాధించి, అత‌నిక‌న్నా ముందు నిలిచాడు. అత‌డు త‌ద‌నంత‌రం జ‌రిగిన ఈవెంట్‌లో స్వ‌ర్ణాన్ని సాధించిన‌ స‌మ‌యంలోనే అత‌డి సోద‌రి శిఖా న‌ర్వాల్ గ‌ర్ల్స్ 10 మీట‌ర్ల ఎయిర్ పిస్ట‌ల్ ఈవెంట్లో కాంశ్య ప‌త‌కాన్ని సాధించింది. 

***



(Release ID: 1894523) Visitor Counter : 171