ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

2023 జనవరి 29 వ తేదీనజరిగిన ‘ మన్ కీ బాత్ ’ (‘ మనసు లో మాట ’) కార్యక్రమం 97వ భాగంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

Posted On: 29 JAN 2023 11:43AM by PIB Hyderabad

ప్రియమైన నా దేశవాసులారా, నమస్కారం. ఇది 2023 వ సంవత్సరం లో ఒకటో ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) . మరి దీనితో పాటు, ఈ కార్యక్రమం లోని తొంభై ఏడో ఎపిసోడ్ కూడాను. మీ అందరి తో మరో సారి మాట్లాడుతూ ఉన్నందుకు, నాకు చాలా ఆనందం కలుగుతున్నది. ప్రతి సంవత్సరం జనవరి నెల చాలా సంఘటనల తో కూడి ఉంటుంది. ఈ నెల - జనవరి 14వ తేదీ కి అటూ ఇటూగా ఉత్తరం నుండి దక్షిణం వరకు, తూర్పు నుండి పడమర వరకు దేశ వ్యాప్తం గా పండుగ ల కాంతులు విరజిమ్ముతాయి. వీటి తరువాత దేశం గణతంత్ర ఉత్సవాన్ని కూడా జరుపుకొంటుంది. ఈ సారి కూడా గణతంత్ర దిన వేడుకల లో అనేక అంశాలు ప్రశంసల ను అందుకొంటున్నాయి. జనవరి 26 వ తేదీ నాడు కవాతు సందర్భం లో కర్తవ్య పథ్ ను నిర్మించిన కార్మికుల ను చూసి బలే బాగా అనిపించింది అంటూ జైసల్ మేర్ నుండి పులకిత్ నాకు వ్రాశారు. పరేడ్‌ లో చేర్చిన అంశాల లో భారతీయ సంస్కృతి కి సంబంధించిన విభిన్న కోణాల ను చూడడం తనకు నచ్చిందని కాన్ పుర్‌ కు చెందిన జయ వ్రాశారు. తొలిసారి గా ఈ పరేడ్ లో పాల్గొన్న ఒంటెల ను అధిరోహించిన మహిళా రైడర్ లతో పాటు సిఆర్‌పిఎఫ్‌ లోని మహిళల దళాని కి కూడా ప్రశంసలు అందుతున్నాయి.

 

సహచరులారా, ప్రతి ఏడాది జనవరి 25 వ తేదీ కోసం వేచి ఉంటానని దెహ్ రాదూన్‌ కు చెందిన వత్సల్ గారు నాకు ఉత్తరం వ్రాశారు. ఆ రోజు న ‘పద్మ’ పౌర పురస్కారాల ప్రకటన రావడం తో పాటు 25 వ తేదీ సాయంత్రమే జనవరి 26 వ తేదీ తనలో ఉత్సాహాన్ని అధికం చేసేస్తుందని పేర్కొన్నారు. అట్టడుగు స్థాయి లో తమ అంకితభావం తో, సేవాభావం తో కార్యసాధకులు అయిన వారికి పీపుల్స్‌ పద్మ ను ప్రకటించడం గురించి సైతం పలువురు వారి యొక్క భావాల ను వెల్లడించారు. ఆదివాసి సముదాయం తో, ఆదివాసుల జీవితాల తో ముడి పడి ఉన్న వ్యక్తులకు ఈసారి పద్మ పురస్కారాల లో చక్కని ప్రాతినిధ్యం లభించింది. ఆదివాసుల జీవనం నగరాల సందడి కి భిన్నం గా ఉంటుంది. వారి సవాళ్లు కూడా వేరు. అయినప్పటికీ ఆదివాసి సముదాయం వారి యొక్క సంప్రదాయాల ను కాపాడుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధం గా ఉంటాయి. ఆదివాసి సముదాయాల కు సంబంధించిన విషయాల ను పరిరక్షించడానికి, పరిశోధనల ను నిర్వహించడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదేవిధంగా టోటో, హో, కుయి, కువి, మాండ మొదలైన ఆదివాసి భాషల పై కృషి చేసిన ఎందరో మహానుభావుల కు పద్మ అవార్డులు దక్కాయి. ఇది మన అందరికి గర్వ కారణం. ధానీరామ్ టోటో గారు, జానుమ్ సింహ్ సోయ్ గారు మరియు బి. రామకృష్ణారెడ్డి గారు.. ఈ పేరు లు ఇప్పుడు దేశం మొత్తం సుపరిచితం అయిపోయాయి. సిద్ధి, జార్ వా, ఓంగే వంటి ఆదివాసి సమాజాలతో కలిసి పనిచేస్తున్న వారిని కూడా ఈసారి సత్కరించారు. వారిలో హీరాబాయి లోబీ గారు, రతన్ చంద్ర కార్ గారు, ఈశ్వర్ చంద్ర వర్మ గారు లు ఉన్నారు. గిరిజన సమాజాలు మన నేల, మన వారసత్వం లలో నుండి విడదీయలేనటువంటి భాగం గా ఉన్నాయి. దేశాభివృద్ధి లో, సమాజ అభివృద్ధి లో వారి సహకారం చాలా ముఖ్యమైంది. తమ కోసం పని చేసిన వ్యక్తుల ను సన్మానించడం కొత్త తరాని కి కూడా స్ఫూర్తి ని ఇస్తుంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల లో కూడా ఈ ఏడాది పద్మ అవార్డు ల ప్రతిధ్వనులు వినిపిస్తున్నాయి. నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల లో దారి తప్పిన యువత కు సరి అయినటువంటి మార్గాన్ని చూపిన వారి కృషి కి కూడా పద్మ అవార్డు లు లభించాయి. ఇందుకు గాను కాంకేర్‌ లో కర్ర మీద నక్కాశీ పని ని చేసేటటువంటి అజయ్ కుమార్ మండావి గారు, గఢ్ చిరోలి కి చెందిన ప్రసిద్ధ ఝాడీపట్టీ రంగభూమి తో జతపడ్డ పరశురామ్ కోమాజీ ఖుణే గారు లకు కూడా ఈ గౌరవం అందింది. అదేవిధం గా, ఈశాన్య ప్రాంతం లో సంస్కృతి పరిరక్షణ లో పాలుపంచుకుంటున్న రామ్‌కుయి వాంగ్‌బే నియుమే గారు, బిక్రమ్ బహాదుర్ జమాతియా గారు మరియు కర్ మా వాంగ్ చు లను కూడా సమ్మానించడం జరిగింది.

 

సహచరులారా, ఈ సారి పద్మ పురస్కారాల సమ్మానాన్ని అందుకొంటున్న వారి లో సంగీత ప్రపంచాన్ని సుసంపన్నం చేసిన వారు ఎందరో ఉన్నారు. సంగీతం అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు! సంగీతం లో ప్రతి ఒక్కరి ఇష్టాలు భిన్నం గా ఉండవచ్చు. కానీ ప్రతి ఒక్కరి జీవనం లో సంగీతం ఒక భాగం అయి ఉంటుంది. మన సంప్రదాయ సంగీత వాయిద్యాలు అయినటువంటి సంతూర్, బమ్హుమ్, ద్వితారా వంటి వాటి యొక్క ధ్వని ని వ్యాప్తి చేయడం లో నైపుణ్యం గల వారు ఈసారి పద్మ అవార్డు ను పొందుతున్న వారి లో ఉన్నారు. గులామ్ మొహమ్మద్ జాజ్, మోవా సు-పోంగ్, రి-సింహ్ బోర్ కుర్ కా-లాంగ్, ముని-వెంకటప్ప మరియు మంగళ్ కాంతి రాయ్ వంటి ఎంతో మంది ని గురించి నలుదిశ లా చర్చ జరుగుతోంది.

 

సహచరులారా, పద్మ పురస్కారాల ను పొందనున్న వారి లో అనేక మంది, మన మధ్య ను ఉన్న ఎటువంటి స్నేహితులు అంటే వారు ఎల్లప్పుడూ దేశాన్ని సర్వోన్నతం గా నిలిపారు. దేశాని కి ప్రథమ ప్రాధాన్యం అనే సిద్ధాంతం కోసం వారి జీవనాన్ని అంకితం చేసివేశారు. వారు సేవాభావం తో తమ వారి పని లో నిమగ్నం అయ్యారు. మరి దీనికి గాను వారు ఎటువంటి పురస్కారాన్ని ఆశించ లేదు. వారు ఎవరి కోసం అయితే పని చేస్తున్నారో, వారి యొక్క వదనాలలో సంతోషమే వారికి అన్నింటి కంటే పెద్ద అవార్డు అన్నమాట. అటువంటి అంకితభావం గల వ్యక్తుల ను సత్కరించి మన దేశ ప్రజల గౌరవం ఇనుమడించింది. నేను సైతం పద్మ పురస్కార విజేతలు అందరి పేరుల ను ఇప్పటికిప్పుడు చెప్పలేకపోవచ్చు; అయితే, పద్మ పురస్కారాల ను పొందుతున్న ఈ మహానుభావుల యొక్క ప్రేరణప్రదాయకం అయిన జీవన విశేషాల ను గురించి మీరు మరిన్ని అంశాల ను తెలుసుకోవలసింది గాను మరి ఆ అంశాల ను గురించి ఇతరుల కు కూడాను తెలియజెప్పవలసింది గాను మిమ్ముల ను నేను కోరుతున్నాను.

 

సహచరులారా, ఈ రోజు ఎప్పుడైతే మనం స్వాతంత్ర్యం తాలూకు అమృత మహోత్సవం కాలం లో గణతంత్ర దినం గురించి చర్చించుకొంటున్నామో అప్పుడు నేను ఒక ఆసక్తికరమైన పుస్తకాన్ని గురించి కూడా ఇక్కడ ప్రస్తావిస్తాను. కొన్ని వారాల క్రితం నాకు లభించిన ఈ పుస్తకం లో చాలా ఆసక్తికరమైన విషయాన్ని చర్చించారు. ఈ పుస్తకం పేరు ‘ఇండియా- ద మదర్ ఆఫ్ డిమాక్రసి’. ఇందులో చాలా చక్కనైనటువంటి వ్యాసాలు ఉన్నాయి. ప్రపంచం లోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం గా భారతదేశం ఉంది. మన దేశాన్ని‘ప్రజాస్వామ్యానికి తల్లి’ గా భావించడం భారతీయులమైన మనం గర్వించే విషయం. ప్రజాస్వామ్యం మన నరనరాలలో ఉంది. మన సంస్కృతి లో ఉంది. శతాబ్దాలు గా మన కార్యకలాపాల లో ఓ అంతర్భాగం గా ఉంది. స్వభావ రీత్యా మనది ప్రజాస్వామిక సమాజం. డాక్టర్ అమ్బేడ్ కర్ బౌద్ధ భిక్షువుల సంఘాన్ని భారతదేశ పార్లమెంటు తో పోల్చారు. ప్రతిపాదన లు, నిర్ణయాలు, సమావేశ నిర్వహణ కు అవసరపడే భ్యుల సంఖ్య, వోటింగ్, వోటు ల లెక్కింపు కోసం అనేక నియమాలు ఉన్న సంస్థ గా ఆయన పేర్కొన్నారు. బుద్ధుడు ఆనాటి రాజకీయ వ్యవస్థ ల నుండి ప్రేరణ ను పొందినట్లు బాబాసాహెబ్ అభిప్రాయపడ్డారు.

 

తమిళనాడు లో ఉతిర్ మేరూర్ అనే ఒక ఊరు ఉంది. ఆ ఐనే చిన్నది అయినప్పటికీ చర్చార్హం అయింది. అక్కడ 1100-1200 సంవత్సరాల క్రితం నాటి శిలా శాసనం యావత్తు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నది. ఈ శాసనం మినీ రాజ్యాంగం లాంటిది. గ్రామసభ ను ఎలా నిర్వహించాలి, సభ్యుల ఎంపిక ప్రక్రియ ఎలా ఉండాలో అందులో వివరం గా పేర్కొన్నారు. మన దేశ చరిత్ర లో ప్రజాస్వామ్య విలువల కు మరో ఉదాహరణ 12 వ శతాబ్దపు బసవేశ్వర స్వామి అనుభవ మండపం. ఇక్కడ స్వేచ్చాయుత వాదోపవాదాల ను, చర్చల ను ప్రోత్సహించారు. ఇది మాగ్నా కార్టా కంటే పూర్వమే అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. వరంగల్‌ లోని కాకతీయ వంశ రాజుల గణతంత్ర సంప్రదాయాలు కూడా చాలా ప్రసిద్ధి చెందాయి. భక్తి ఉద్యమం పశ్చిమ భారతదేశం లో ప్రజాస్వామ్య సంస్కృతి ని పెంచింది. సిఖ్ పంథ్ లో ప్రజాస్వామ్య భావన పై ఒక వ్యాసాన్ని కూడా ఈ పుస్తకం లో చేర్చారు. గురు నానక్ దేవ్ జీ ఏకాభిప్రాయం తో తీసుకొన్న నిర్ణయాలను ఈ వ్యాసం తెలియజేస్తుంది. మధ్య భారతదేశం లోని ఉరాఁవ్ మరియు ముండా తెగల లో సమాజ నిర్వహణ పై, ఏకాభిప్రాయం తో కూడిన నిర్ణయాల పే తీసుకోవడం పై ఈ పుస్తకం లో చక్కటి సమాచారం ఉంది. శతాబ్దాలు గా దేశం లోని ప్రతి ప్రాంతం లో ప్రజాస్వామ్య స్ఫూర్తి ఎలా ప్రవహిస్తోందో ఈ గ్రంథాన్ని చదివిన తరువాత మీకు తెలుస్తుంది. ప్రజాస్వామ్యాని కి జనని గా పేర్కొనే భారతదేశ వాసులు గా మనం నిరంతరం ఈ అంశం పై లోతుగా ఆలోచించాలి. చర్చించాలి. ప్రపంచాని కి తెలియ జేయాలి. ఇది దేశం లో ప్రజాస్వామిక స్ఫూర్తి ని మరింత బలోపేతం చేస్తుంది.

 

ప్రియమైన నా దేశప్రజలారా, యోగ దినోత్సవాని కి, వివిధ రకాల చిరు ముతక ధాన్యాలకు మధ్య పోలిక ఏమిటని నేను మిమ్మల్ని అడిగితే, ఈ పోలిక ఏమిటి అని మీరు ఆలోచిస్తారు? ఈ రెండింటికీ చాలా పోలికలు ఉన్నాయని నేను చెబితే మీరు ఆశ్చర్యపోతారు. వాస్తవానికి... భారతదేశ ప్రతిపాదన తర్వాత అంతర్జాతీయ యోగ దినోత్సవం, అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం రెండింటినీ ఐక్య రాజ్య సమితి నిర్ణయించింది. రెండోది- యోగ ఆరోగ్యానికి సంబంధించింది. చిరుధాన్యాలు కూడా ఆరోగ్య రంగం లో ముఖ్యమైన పాత్ర ను పోషిస్తాయి. ఇక మూడో విషయం ఏమిటంటే - రెండు ప్రచారాల లో ప్రజల భాగస్వామ్యం కారణంగా విప్లవాత్మక మార్పు వస్తోంది. ప్రజలు పెద్ద ఎత్తున చురుగ్గా పాల్గొనడం ద్వారా యోగ ను, ఫిట్‌నెస్‌ ను వారి జీవనం లో ఒక భాగం గా చేసుకున్నట్టే పెద్ద ఎత్తున చిరుధాన్యాల ను కూడా దైనందిన జీవితంలో చేర్చుకుంటున్నారు. ప్రజలు ఇప్పుడు చిరుధాన్యాల ను తమ ఆహారం లో భాగం గా చేసుకొంటున్నారు. ఈ మార్పు ప్రభావం పెద్ద ఎత్తు న కనిపిస్తోంది. ఒకవైపు సంప్రదాయబద్ధం గా చిరుధాన్యాలను పండించే చిన్నకారు రైతులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ప్రపంచం ఇప్పుడు చిరుధాన్యాల ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టినందుకు వారు చాలా సంతోషం గా ఉన్నారు. మరో వైపు రైతు ఉత్పత్తి సంఘాల తో పాటు పారిశ్రామికవేత్త లు చిరుధాన్యాల ను మార్కెట్ చేయడానికి, వాటిని ప్రజల కు అందుబాటు లో ఉంచడానికి ప్రయత్నాలను మొదలుపెట్టారు.

 

ఆంధ్ర ప్రదేశ్‌ లోని నంద్యాల జిల్లా కు చెందిన కె.వి. రామ సుబ్బారెడ్డి గారు చిరుధాన్యాల విషయం లో కృషి చేసేందుకు మంచి జీతం వచ్చే ఉద్యోగాన్ని వదలివేశారు. అమ్మ చేతి తో చేసిన చిరుధాన్యాల రుచి ని చూసి ఆయన తన గ్రామం లో మిలిట్ ప్రాసెసింగ్ యూనిట్‌ ను ప్రారంభించారు. సుబ్బారెడ్డి గారు చిరుధాన్యాల ప్రయోజనాల ను ప్రజల కు వివరించడం తో పాటు వాటి ని సులభం గా అందుబాటు లో ఉంచుతారు. మహారాష్ట్ర లోని అలీబాగ్‌ సమీపంలోని కెనాడ్‌ గ్రామానికి చెందిన శర్మిల ఓస్ వాల్‌ గత 20 ఏళ్లు గా చిరుధాన్యాల ఉత్పత్తి లో తనదైన శైలి లో సేవలందిస్తున్నారు. ఆమె రైతుల కు నేర్పు గా వ్యవసాయం చేయడం లో శిక్షణ ను ఇస్తున్నారు. ఆమె కృషి వల్ల చిరుధాన్యాల దిగుబడి పెరగడమే కాకుండా రైతుల ఆదాయం కూడా పెరిగింది.

 

ఛత్తీస్‌ గఢ్‌ లోని రాయ్‌ గఢ్‌ ని సందర్శించే అవకాశం మీకు లభిస్తే మీరు అక్కడి మిలిట్స్ కేఫ్‌ కు తప్పక వెళ్లండి. కొన్ని నెలల క్రితం ప్రారంభమైన ఈ మిలిట్స్ కేఫ్‌ లో చీలా, దోశ, మోమోస్, పీజా, ఇంకా మంచూరియా వంటివి బాగా ప్రసిద్ధి ని పొందుతున్నాయి.

 

నేను మిమ్మల్ని ఇంకో విషయం అడగవచ్చా? మీరు ఆంట్ర ప్రన్యోర్ అనే పదాన్ని విని ఉంటారు, కానీ మీరు మిలిట్ ప్రన్యోర్ అనే పదం విన్నారా ? ఈ రోజుల లో ఒడిశా కు చెందిన మిలిట్ ప్రన్యోర్ లు వెలుగు లోకి వస్తున్నారు. ఆదివాసి జిల్లా సుందర్‌ గఢ్ కు చెందిన సుమారు 1500 మంది మహిళల స్వయం సహాయక బృందానికి ఒడిశా మిల్లెట్స్ మిషన్‌తో అనుబంధం ఉంది. ఇక్కడ మహిళ లు చిరుధాన్యాల నుండి కుకీలు, రసగుల్లా, గులాబ్ జామూన్, కేక్‌ ల వరకు ప్రతిదీ తయారు చేస్తున్నారు. బజారు లో వీరికి విపరీతమైన డిమాండ్ ఉన్న కారణం గా మహిళ ల ఆదాయం కూడా పెరుగుతున్నది.

 

కర్నాటక లోని కలబుర్గి లో అలంద్ భుతాయి మిలిట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ గత సంవత్సరం భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ పర్యవేక్షణ లో పని చేయడం ప్రారంభించింది. ఇక్కడి ఖాక్ రా, బిస్కెట్ మరియు లడ్డూ లు ప్రజల ఆదరణ కు నోచుకొన్నాయి. కర్నాటక లోనే బీదర్ జిల్లా లో హుల్సూర్ మిలిట్ ప్రొడ్యూసర్ కంపెనీ కి చెందిన మహిళ లు చిరుధాన్యాల ను పండించడంతో పాటు వాటి పిండి ని కూడా తయారు చేస్తున్నారు. దీంతో వారి సంపాదన కూడా బాగా పెరిగింది. ప్రాకృతిక వ్యవసాయాన్ని అనుసరిస్తున్న ఛత్తీస్‌ గఢ్‌ కు చెందిన సందీప్ శర్మ గారి కి చెందిన ఎఫ్ పిఒ తో ప్రస్తుతం 12 రాష్ట్రాల కు చెందిన రైతులు జతపడ్డారు. బిలాస్‌ పుర్‌ లోని ఈ ఎఫ్‌పిఒ 8 రకాల చిరుధాన్యాల పిండి ని మరి మిలిట్ తో తినుబండారాల ను చేస్తోంది.

 

సహచరులారా, ప్రస్తుతం భారతదేశం లోని మూల మూల న జి-20 శిఖర సమ్మేళనాలు నిరంతరం గా జరుగుతున్నాయి. దేశం లోని ప్రతి మూల లో, ఎక్కడెక్కడ అయితే జి-20 శిఖర సమ్మేళనం జరుగుతున్నదో, చిరుధాన్యాల తో తయారుచేసిన పుష్టికరమైన మరియు రుచికరమైన వంటకాలు భాగం అవుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను. బజారు లో తయారు చేసిన ఖిచ్ డీ , పోహా, ఖీర్, ఇంకా రోటీ తో పాటు రాగులతో చేసిన పాయసం, పూరీ మరియు దోశ ల వంటి వంటకాలు కూడా లభిస్తున్నాయి. అన్ని జి20 వేదికల లోని చిరుధాన్యాల ప్రదర్శనల లో మిలిట్స్ తో తయారు చేసిన హెల్థ్ డ్రింక్స్ ను, తృణ ధాన్యాల ను మరియు నూడుల్స్ ను ప్రదర్శించడం జరిగింది. ప్రపంచ వ్యాప్తం గా ఉన్న భారతీయ మిశన్ స్ కూడా వీటి ప్రజాదరణ ను పెంచడానికి శక్తి మేరకు ప్రయాస లను చేస్తున్నాయి. దేశం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలు ప్రపంచం లో చిరుధాన్యాల కు పెరుగుతున్న డిమాండు, మన చిన్న రైతుల కు ఎంతటి బలాన్ని ఇస్తాయో మీరు ఊహించవచ్చును. ఈ రోజు న చిరుధాన్యాలతో తయారు చేయడం ప్రారంభించిన వివిధ రకాల కొత్త తినుబండారాలను యువతరం ఇష్టపడుతుండడం కూడా నాకు ఆనందాన్ని కలిగిస్తోంది. చిరుధాన్యాల అంతర్జాతీయ సంవత్సరాన్ని ఇంత అద్భుతం గా మొదలుపెట్టినందుకు మరి దీనిని అదే పని గా ముందుకు తీసుకు పోతున్నందుకు ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) శ్రోతల కు కూడా నేను అభినందనల ను తెలియ జేస్తున్నాను.

 

ప్రియమైన నా దేశ ప్రజలారా, ఎవరైనా టూరిస్ట్ హబ్ గోవా ను గురించి మాట్లాడితే మీ మనసు లో ఏం గుర్తొస్తుంది ? గోవా పేరు వినగానే ముందుగా అందమైన కోస్తాతీర ప్రాంతం, బీచులు, ఇష్టమైన అన్నపానాదుల ఊసు లు గుర్తు కు రావడం సహజం. అయితే ఈ నెల లో గోవా లో ఒక ముఖ్యమైన కార్యక్రమం జరిగింది. ఈరోజు ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) లో నేను ఈ విషయాన్ని మీ అందరి తో పంచుకోవాలనుకుంటున్నాను. గోవా లో జరిగిన ఈ కార్యక్రమం పర్పల్ ఫెస్ట్. ఈ ఫెస్ట్ ను జనవరి 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు పణజీ లో నిర్వహించడమైంది. దివ్యాంగుల సంక్షేమం విషయం లో ఇదొక ప్రత్యేక ప్రయత్నం. పర్పల్ ఫెస్ట్ ఎంత గొప్ప సందర్భం అనే విషయాన్ని అందులో 50 వేల మందికి పైగా సోదర సోదరీమణులు పాల్గొన్నారనే వాస్తవాన్ని బట్టి మీరందరూ ఊహించవచ్చు. ఇక్కడి కి వచ్చిన ప్రజలు ఇప్పుడు 'మీరామార్ బీచ్'లో తిరగడాన్ని పూర్తి స్థాయి లో ఆస్వాదించగలిగినందుకు పులకించిపోయారు. నిజానికి 'మీరామార్ బీచ్' దివ్యాంగ సోదరులు, సోదరీమణులకు గోవాలో అందుబాటులో ఉండే బీచ్‌ల లో ఒకటి గా మారింది. క్రికెట్ టూర్నమెంట్, టేబల్ టెనిస్ టూర్నమెంట్, మారథన్ కాంపిటీశన్ తో పాటు వినికిడి శక్తి, దృష్టి జ్ఞ‌ానం లు లోపించిన వ్యక్తుల సమ్మేళనం కూడా ఇక్కడ జరిగింది. ప్రత్యేకమైన బర్డ్ వాచింగ్ ప్రోగ్రాము తో పాటు ఇక్కడ ఒక చిత్రాన్ని కూడా ప్రదర్శించారు. దివ్యాంగ సోదర సోదరీమణులు, పిల్లలు పూర్తి స్థాయి లో ఆనందించేలా దీని కోసం ప్రత్యేక ఏర్పాటుల ను చేశారు. దేశం లోని ప్రైవేట్ రంగం భాగస్వామ్యం కూడా ఉండడం పర్పల్ ఫెస్ట్ లోని ఒక ప్రత్యేక విషయం. దివ్యాంగులు ఉపయోగించేందుకు వీలుగా ఉండే ఉత్పత్తులను ప్రదర్శించారు. దివ్యాంగుల సంక్షేమం పై అవగాహన ను ఏర్పరచేందుకు ఈ ఫెస్ట్ లో ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. పర్పల్ ఫెస్ట్ ను విజయవంతం చేసినందుకు అందులో పాల్గొన్న వారందరికీ నా అభినందన లు. దీనిని నిర్వహిచేందుకు పగలూ రాత్రీ ఏకం చేసిన వాలంటియర్ లను కూడా నేను అభినందిస్తున్నాను. ఏక్సెసబల్ ఇండియా దృష్టికోణాన్ని సాకారం చేయడం లో ఇటువంటి ప్రచారాలు చాలా ప్రభావవంతం గా ఉంటాయని నాకు పూర్తి నమ్మకం ఉంది.

 

 

 

 

 

 

 

 

ప్రియమైన నా దేశ వాసులారా, ఇప్పుడు ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) లో నేను మీకు ఆనందం కలిగే, మీరు గర్వపడే మరియు బలే బలే అని మనసు పలికేటటువంటి విషయం గురించి మాట్లాడతాను. హృదయం సంతోషంతో ఉప్పొంగిపోయింది. దేశం లోని అతి పాతదైనటువంటి వైజ్ఞానిక సంస్థల లో ఒకటి అయిన బెంగళూరు లోని ఇండియన్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ సైన్స్-అదే. ఐఐఎస్ సి- ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ ను అందిస్తున్నది. ఈ సంస్థ స్థాపన వెనుక ఇద్దరు గొప్ప వ్యక్తులు- జంషెడ్ జీ టాటా, స్వామి వివేకనంద ల ప్రేరణ ఉండడాన్ని గురించి ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) లో ఇంతకు ముందు నేను ప్రస్తావించాను. 2022వ సంవత్సరం లో ఈ సంస్థ పేరు మీద మొత్తం 145 పేటెంట్‌ లు ఉండడం మీకు, నాకు ఆనందాన్ని, గర్వాన్ని కలిగించేటటువంటి అంశం. అంటే దీని అర్థం - ప్రతి ఐదు రోజుల కు రెండు పేటెంట్ లు అన్నమాట. ఈ రికార్డు దానికదే అద్భుతం. ఈ సాఫల్యాన్ని సాధించిన ఐఐఎస్ సి యొక్క జట్టు ను నేను అభినందించాలనుకొంటున్నాను. సహచరులారా, ప్రస్తుతం పేటెంట్ ల సమర్పణ లో భారతదేశం 7 వ స్థానం లో, ట్రేడ్‌మార్క్ లలో 5 వ స్థానం లో ఉంది. పేటెంట్ ల గురించి మాత్రమే మాట్లాడితే గత ఐదేళ్ల లో సుమారు 50 శాతం పెరుగుదల ఉంది. గ్లోబల్ ఇనోవేశన్ ఇండెక్స్ లో కూడా భారతదేశం ర్యాంకింగ్ అద్భుతం గా మెరుగుపడింది. ఇప్పుడు అది 40 వ స్థానాని కి చేరుకొంది. 2015 వ సంవత్సరం లో గ్లోబల్ ఇనోవేశన్ ఇండెక్స్ లో భారతదేశం 80 వ స్థానం లో ఉంది. నేను మీకు మరో ఆసక్తికరమైన విషయాన్ని గురించి చెప్పాలనుకుంటున్నాను. భారతదేశం లో గత 11 సంవత్సరాల లో మొదటి సారి గా దేశీయ పేటెంట్ ఫైలింగ్ సంఖ్య విదేశీ ఫైలింగ్ కంటే ఎక్కువ గా కనిపించింది. ఇది భారతదేశం లో పెరుగుతున్న శాస్త్రీయ సామర్థ్యాన్ని కూడా చూపుతుంది.

 

సహచరులారా, 21 వ శతాబ్దపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లో విజ్ఞానం అత్యంత ప్రధానమైందని మనందరికీ తెలుసు. మన ఆవిష్కర్త లు, వారి పేటెంట్ ల బలం తో భారతదేశం టెకేడ్ కల ఖచ్చితం గా నెరవేరుతుంది అని నేను నమ్ముతున్నాను. దీంతో మనందరం ప్రపంచ స్థాయి సాంకేతికత ను, మన దేశం లో తయారైన ఉత్పత్తుల నుండి పూర్తిగా లాభాన్ని పొందగలం.

 

ప్రియమైన నా దేశప్రజలారా, తెలంగాణ కు చెందిన ఇంజీనియ

ర్ విజయ్ గారి పోస్టు ను నేను NaMoApp (నమో ఏప్) లో చూశాను. ఇందులో విజయ్ గారు ఇ-వేస్ట్ (ఇలెక్ట్రానిక్ వేస్ట్)ను గురించి వ్రాశారు. దీని ని గురించి ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) లో చర్చించండి అంటూ విజయ్ గారు అభ్యర్థించారు. ఇంతకు ముందు కూడా ఈ కార్యక్రమం లో ‘వేస్ట్ టు వెల్థ్’ అంటే 'చెత్త నుండి సంపద’ ను గురించి మాట్లాడుకున్నాం. రండి, ఈ రోజు న, దీనితో ముడిపడ్డ ఇ-వేస్ట్ ను గురించి చర్చించుకొందాం.

 

సహచరులారా, ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్, టాబ్లెట్ వంటి పరికరాలు సర్వసాధారణం గా మారిపోయాయి. దేశవ్యాప్తం గా వారి సంఖ్య బిలియన్ లలో ఉంటుంది. నేటి ఆధునిక ఉపకరణాలు కూడా భవిష్యత్తు లో ఇ-వేస్ట్ గా మారుతాయి. ఎవరైనా కొత్త పరికరాన్ని కొనుగోలు చేసినప్పుడు లేదా పాత పరికరాన్ని మార్పిడి చేసుకున్నప్పుడు దాన్ని సరైన రీతి లో విసర్జించామా లేదా అనేది గుర్తుంచుకోవడం అవసరం. ఇ-వ్యర్థాలను సరిగ్గా పారవేయకపోతే అది మన పర్యావరణాని కి కూడా హాని కలిగిస్తుంది. కానీ జాగ్రత్త గా చేస్తే పునరుపయోగం- రీసైకిల్, రీయూస్ - చక్రీయ ఆర్థిక వ్యవస్థలో గొప్ప శక్తి గా మారుతుంది. ఏటా 50 మిలియన్‌ టన్నుల ఇ-వ్యర్థాలను పారేస్తున్నామని ఐక్య రాజ్య సమితి నివేదిక లో పేర్కొంది. ఈ వ్యర్థాల పరిమాణం ఎంత ఉంటుందో ఊహించగలరా ? మానవ జాతి చరిత్ర లో నిర్మించిన అన్ని వాణిజ్య విమానాల బరువు ను కలిపినా, విడుదలవుతున్న ఇ-వేస్ట్ పరిమాణాని కి సమానం కాదు. ప్రతి సెకను కు 800 ల్యాప్‌టాప్‌ల ను వదలివేయడం జరుగుతోంది. ఇ-వేస్ట్ నుండి వివిధ ప్రక్రియ ల ద్వారా సుమారు 17 రకాల విలువైన లోహాల ను వెలికితీయవచ్చని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇందులో బంగారం, వెండి, రాగి, నికెల్ లు ఉన్నాయి. కాబట్టి ఇ-వేస్ట్ ను ఉపయోగించడం ‘చెత్త నుండి సంపద’ కంటే తక్కువేమీ కాదు. నేడు ఈ దిశ గా వినూత్నమైన పనులను చేస్తున్న స్టార్టప్‌ల కు కొదవలేదు. దాదాపు 500 ఇ-వేస్ట్ రీసైక్లర్ లు ఈ రంగాని కి అనుబంధం గా ఉన్నారు. అనేక మంది కొత్త వ్యవస్థాపకుల ను కూడా దీనితో కలపడం జరుగుతున్నది. ఈ రంగం వేల మందికి ప్రత్యక్ష ఉపాధి ని కూడా కల్పించింది. బెంగళూరు కు చెందిన ఇ-పరిసర ఈ తరహా ప్రయత్నం లోనే తలమునకలు గా ఉంది. ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ స్ నుండి విలువైన లోహాల ను వేరు చేయడానికి ఇది స్వదేశీ సాంకేతికత ను అభివృద్ధి చేసింది. అదేవిధంగా ముంబయి లో పనిచేస్తున్న Ecoreco (ఇకో-రీకో ) మొబైల్ ఏప్ ద్వారా ఇ-వేస్ట్ ను సేకరించే వ్యవస్థ ను అభివృద్ధి పరచింది. ఉత్తరాఖండ్‌ లోని రూడ్ కీ కి చెందిన Attero (అటెరో) రీసైక్లింగ్ ప్రపంచవ్యాప్తం గా ఈ రంగం లో అనేక పేటెంట్ లను పొందింది. ఇది తన సొంత ఇ-వేస్ట్ రీసైక్లింగ్ టెక్నాలజీ ని సిద్ధం చేయడం ద్వారా చాలా పేరు సంపాదించింది. భోపాల్‌ లో మొబైల్ ఏప్, వెబ్‌సైట్ 'కబాడీవాలా' ద్వారా టన్నుల కొద్దీ ఇ-వేస్ట్ ను సేకరిస్తున్నారు. ఇటువంటి ఉదాహరణ లు చాలా ఉన్నాయి. ఇవన్నీ భారతదేశాన్ని గ్లోబల్ రీసైక్లింగ్ హబ్‌ గా మార్చడానికి సహాయపడుతున్నాయి. అయితే అటువంటి కార్యక్రమాలు విజయవంతం అయ్యేందుకు అవసరమైన షరతు కూడా ఉంది. అది ఇ-వేస్ట్ ను పారవేసే సురక్షితమైన ఉపయోగకరమైన పద్ధతుల ను గురించి ప్రజలు తెలుసుకోవడం. ప్రస్తుతం ఏటా 15-17 శాతం ఇ-వేస్ట్ మాత్రమే రీసైకిల్ అవుతున్నాయని ఇ-వేస్ట్ రంగం లో పని చేస్తున్న వ్యక్తులు చెబుతున్నారు.

 

ప్రియమైన నా దేశ ప్రజలారా, నేడు ప్రపంచవ్యాప్తం గా వాతావరణ మార్పులు , జీవవైవిధ్య పరిరక్షణ గురించి చాలా చర్చ లు జరుగుతున్నాయి. ఈ దిశ లో భారతదేశం చేస్తున్న నిర్దిష్ట ప్రయత్నాల ను గురించి మనం నిరంతరం మాట్లాడుతున్నాం. భారతదేశం మాగాణి నేల ల కోసం చేసిన కృషి ని తెలుసుకొంటే మీరు కూడా చాలా సంతోషిస్తారు. మాగాణి నేల లు అంటే ఏమిటని కొంత మంది శ్రోతలు ఆలోచిస్తుండవచ్చు. మాగాణి నేల లు లేదా చిత్తడి నేల లు భూమి లో ఏడాది పొడవునా నీరు పేరుకుపోయే ప్రదేశాలు. కొన్ని రోజుల తరువాత ఫిబ్రవరి 2 వ తేదీ న ప్రపంచ చిత్తడి నేల ల దినోత్సవం. మన భూమి ఉనికి కి చిత్తడి నేల లు చాలా ముఖ్యం. ఎందుకంటే అనేక పక్షులు, జంతువులు వాటిపై ఆధారపడి ఉంటాయి. జీవవైవిధ్యాన్ని సుసంపన్నం చేయడంతో పాటు ఈ నేల లు వరద నియంత్రణ కు, భూగర్భ జలాల రీఛార్జ్‌ కు కూడా ఉపయోగపడతాయి. రామ్‌సర్ సైట్స్ అంటే అంతర్జాతీయ ప్రాముఖ్యం కలిగిన చిత్తడి నేల ల ప్రాంతం అని మీలో చాలా మంది కి తెలిసి ఉండాలి. చిత్తడి నేల లు ఏ దేశంలో ఉన్నా అవి అనేక ప్రమాణాల ను నెరవేర్చినప్పుడు మాత్రమే వాటిని రామ్‌సర్ సైట్‌లు గా ప్రకటిస్తారు. రామ్‌సర్ సైట్‌ల లో 20,000 లేదా అంతకంటే ఎక్కువ నీటి పక్షులు ఉండాలి. స్థానిక చేప జాతులు పెద్ద సంఖ్యలో ఉండడం ముఖ్యం. 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకల అమృత మహోత్సవాల సందర్భం లో రామ్‌సర్ సైట్‌ ల కు సంబంధించిన సమాచారాన్ని మీతో పంచుకోవాలనుకొంటున్నాను. ఇప్పుడు మన దేశం లో మొత్తం రామ్‌సర్ సైట్‌ల సంఖ్య 75 కి పెరిగింది. 2014 కు ముందు దేశం లో కేవలం 26 రామ్‌సర్ సైట్‌ లు ఉండేవి. ఇందుకు గాను ఈ జీవ వైవిధ్యాన్ని కాపాడిన స్థానిక సమాజం అభినందనల కు పాత్రమైంది. ఇది మన ప్రాచీన సంస్కృతి కి, ప్రకృతి కి అనుగుణం గా జీవించే సంప్రదాయాని కి కూడా గౌరవమే. భారతదేశం లోని ఈ చిత్తడి నేలలు మన సహజ సామర్థ్యానికి ఉదాహరణ. ఒడిశాలోని చిల్ కా సరస్సు 40 కంటే ఎక్కువ నీటి పక్షుల జాతుల కు ఆశ్రయాన్ని కల్పిస్తున్నది. కయిబుల్-లమ్ జా, లోక్‌టాక్ చిత్తడి జింకల కు ఒక విధం గా సహజ నివాసం గా పరిగణిస్తారు. తమిళ నాడు లోని వేడంథాంగల్‌ ను 2022 వ సంవత్సరం లో రామ్‌సర్‌ గా ప్రకటించారు. ఇక్కడ పక్షి జనాభా ను సంరక్షించిన ఘనత అంతాను సమీపం లోని రైతులకే చెందుతుంది. కశ్మీర్‌ లోని పంజాథ నాగ్ సముదాయం వార్షిక ఫల వికాస ఉత్సవం సందర్భం లో ఒక రోజు ప్రత్యేకం గా గ్రామం లోని నీటి వనరుల ను శుభ్రపరుస్తుంది. ప్రపంచం లోని చాలా రామ్‌సర్ సైట్‌ లకు ప్రత్యేక సాంస్కృతిక వారసత్వం ఉంది. మణిపుర్ కు చెందిన లోక్‌టాక్ మరియు పవిత్ర సరస్సు ‘రేణుక’ తో అక్కడి సంస్కృతి కి గాఢమైన సంబంధం ఉంది. అదేవిధంగా సంభార్ కూడా దుర్గ మాత అవతారమైన శాకంభరి దేవి కి సంబంధించింది. భారతదేశం లోని ఈ చిత్తడి నేల ల విస్తరణ రామ్‌సర్ సైట్‌ ల చుట్టూ నివసించే ప్రజల వల్ల సాధ్యమైంది. అలాంటి వారందరినీ నేను ఎంతో అభినందిస్తున్నాను. ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) శ్రోత ల తరపున వారి కి శుభాకాంక్షల ను తెలియజేస్తున్నాను.

 

ప్రియమైన నా దేశప్రజలారా, ఈ సారి మన దేశం లో- విశేషించి ఉత్తర భారతదేశం లో - తీవ్రమైన చలికాలం ఉంది. ఈ చలికాలంలో పర్వతాల మీద మంచు కురుస్తుంది. అటువంటి కొన్ని చిత్రాలు జమ్ము- కశ్మీర్ నుండి వచ్చాయి. అవి యావత్ దేశ ప్రజలందరి మనస్సుల ను పరవశింపచేశాయి. ప్రపంచం నలు మూలల నుండి ప్రజలు ఈ చిత్రాల ను సోశల్ మీడియా లో ఇష్టపడుతున్నారు. హిమ పాతం కారణం గా మన కశ్మీర్ లోయ ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా చాలా అందం గా మారింది. బనిహాల్ నుండి బడ్ గామ్ వరకు రైలు వెళ్తున్న వీడియో ను కూడా ప్రజలు ప్రత్యేకం గా ఇష్టపడుతున్నారు. అందమైన హిమపాతం. నలు వైపులా తెల్లటి దుప్పటి లాంటి మంచు. ఈ దృశ్యం అద్భుత కథ లా ఉందని అంటున్నారు జనం. ఇవి ఏదో ఒక విదేశాని కి చెందిన చిత్రాలు కావని, మన దేశం లోనే కశ్మీర్‌ కు సంబంధించినవి అని చాలా మంది అంటున్నారు.

 

‘స్వర్గం ఇంతకంటే అందంగా ఉంటుందా?’ అంటూ ఒక వ్యక్తి సోశల్ మీడియా లో పోస్టు చేశారు. ఇది ఖచ్చితం గా సరైంది. అందుకే కశ్మీర్‌ ను భూతల స్వర్గం అని చెబుతారు. ఈ చిత్రాల ను చూస్తుంటే మీకు కూడా కశ్మీర్ పర్యటన కు వెళ్లాలి అని అనిపిస్తుంది. మీరు స్వయంగా వెళ్ళాలని, మీ సహచరులను కూడా తీసుకుపోవాలని నేను కోరుకొంటున్నాను. కశ్మీర్‌ లో మంచు తో కప్పబడిన పర్వతాలు, ప్రకృతి అందాల తో పాటు చూడవలసినవి, తెలుసుకోవలసినవి ఎన్నో ఉన్నాయి. ఉదాహరణ కు కశ్మీర్‌ లోని సయ్యదాబాద్‌ లో శీతకాల క్రీడ లు జరిగాయి. ఈ ఉత్సవాల అంశం మంచు క్రికెట్! స్నో క్రికెట్ మరింత ఉత్తేజకరమైన క్రీడ అని మీరు అనుకుంటూ ఉండవచ్చు. మీ భావన పూర్తి గా వాస్తవమండీ. కశ్మీరీ యువత మంచు మధ్య క్రికెట్‌ ను మరింత అద్భుతం గా ఆడుతుంది. భారత క్రికెట్ బృందం లో ఆడే యువ క్రీడాకారుల కోసం కశ్మీర్‌ లో అన్వేషణ కూడా జరుగుతోంది. ఇది కూడా ఒక విధం గా ఖేలో ఇండియా ఉద్యమాని కి పొడిగింపు. కశ్మీర్‌ లో క్రీడల పట్ల యువతీయువకుల లో ఉత్సాహం పెరుగుతోంది. రాబోయే కాలం లో ఇలాంటి యువకులు ఎందరో దేశానికి పతకాలను సాధించి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తారు. మీరు వచ్చే సారి కశ్మీర్ పర్యటన కు పథక రచన చేసుకొన్నప్పుడు ఇలాంటి ఉత్సవాల ను సందర్శించడానికి సమయం కేటాయించవలసింది గా మీకు నేను సూచిస్తున్నాను. ఈ అనుభవాలు మీ యాత్ర ను మరింత గుర్తుండిపోయేటట్టు చేస్తాయి.

 

ప్రియమైన నా దేశ వాసులారా, గణతంత్రాన్ని బలోపేతం చేసేందుకు మన ప్రయత్నాలు నిరంతరం గా కొనసాగుతూ ఉండాలి. ప్రజల భాగస్వామ్యం తో, ప్రతి ఒక్కరి కృషి తో, దేశం పట్ల కర్తవ్యాన్ని నిర్వర్తించడం ద్వారా గణతంత్రం పటిష్టం గా తయారవుతుంది. అలాంటి కర్తవ్య నిష్ఠా సేనానుల గంభీర స్వరమే మన ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట ’ కార్యక్రమం) కావడం నాకు సంతోషాన్ని కలిగిస్తోంది. అలాంటి కర్తవ్య నిష్ఠా పరాయణత్వం ఉన్న వ్యక్తుల ఆసక్తికరమైన, స్ఫూర్తిదాయకమైన గాథల తో వచ్చే సారి మళ్ళీ కలుస్తాను. చాలా చాలా ధన్యవాదాలు.

 

***


(Release ID: 1894512) Visitor Counter : 352