యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

మధ్యప్రదేశ్ లో జరగనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో పోటీకి దిగనున్న ' టాప్ ' క్రీడాకారులు

Posted On: 28 JAN 2023 4:49PM by PIB Hyderabad

మధ్యప్రదేశ్ లో జనవరి 30 నుంచి జరగనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం (టాప్స్) కింద శిక్షణ పొందుతున్న క్రీడాకారులు పోటీ పడనున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ విజయాలు సాధించిన క్రీడాకారులు యువ క్రీడాకారులకు స్పూర్తి నింపుతారు. పోటీ వల్ల క్రీడల పరిమాణం కూడా పెరుగుతుంది.

మధ్యప్రదేశ్ లోని భోపాల్, ఇండోర్, ఉజ్జయిని, మాండ్ల, ఖర్గొన్ (మహేశ్వర్), బాలఘాట్, న్యూఢిల్లీ లో జరిగే పోటీల్లో దాదాపు 6000 మంది క్రీడాకారులు పాల్గొంటారు.

మొత్తం 27 విభాగాల్లో పోటీలు జరుగుతాయి. మొట్టమొదటి సారిగా వాటర్ స్పోర్ట్స్ కూడా నిర్వహించనున్నారు సాధారణ, స్వదేశీ క్రీడలతో పాటు కానో స్లాలొమ్, కయాకంగ్, కానోఇంగ్, రోయింగ్ లాంటి జల విభాగాలు, ఫెన్సింగ్ అంశాల్లో పోటీలు జరుగుతాయి.

క్రీడాకారులకు వృత్తి పరమైన సహకారం అందించడానికి 2014 లో క్రీడల మంత్రిత్వ శాఖ టార్గెట్ ఒలంపిక్ పోడియం పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రపంచంలో ఉత్తమ శిక్షకులు క్రీడాకారులకు శిక్షణ అందిస్తారు. అంతర్జాతీయ శిక్షణ సదస్సులు నిర్వహించి విసా పొందడానికి సహకారం అందిస్తారు. ప్రత్యర్థి ప్రదర్శన విశ్లేషించడానికి టాప్ ఆఫ్ లైన్ పరిశోధన సౌకర్యం అందిస్తారు.

ఒలంపిక్స్ తో పాటు అంతర్జాతీయ క్రీడా పోటీల్లో పతకాలు సాధించేలా క్రీడాకారులను సిద్ధం చేయడం లక్ష్యంగా పథకం అమలు జరుగుతోంది. దీనిలో 10 నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న క్రీడాకారులకు ప్రాధాన్యత ఇస్తారు. 2008 ఒలంపిక్స్ లో పతకాలు సాధించడం లక్ష్యంగా పథకం అమలు జరుగుతోంది.

ఖేలో ఇండియా క్రీడల పోటీల్లో 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గల క్రీడాకారులు పాల్గొంటారు. 

పోటీల్లో పాల్గొననున్న క్రీడాకారులు...

విలువిద్య...

బిషాల్ చాంగ్మే (మహారాష్ట్ర)

మంజరి ఒక్కేరే ( మహారాష్ట్ర)

రిధి ( హర్యానా)

టేబుల్ టెన్నిస్

పాయస్ జైన్ ( ఢిల్లీ)

యశస్వని ఘోర్పడే (కర్ణాటక)

ఈత

ఆపేక్ష ఫెర్నాండజ్ ( మహారాష్ట్ర)

రిధిమా వీరేంద్ర కుమార్ ( కర్ణాటక)

ఫెన్సింగ్

శ్రేయా గుప్త ( జమ్మూ కాశ్మీర్)

వెయిట్ లిఫ్టింగ్

ఆకాంక్ష వ్యవహరే ( మహారాష్ట్ర)

మార్కియా టారియో ( అరుణాచల్ ప్రదేశ్)

బోనీ మంఘ్యా ( రాజస్థాన్)

బ్యాడ్మింటన్

ఉన్నతి హుడా ( హర్యానా)

విలువిద్య

శివ నార్వార్ (10 ఎంఏసి) .. హర్యానా

తేజస్విని (25 ఎంఏసీ)... హర్యానా

నిశ్చల్ (50 ఎం 3 పి రైఫిల్.. హర్యానా 

***



(Release ID: 1894385) Visitor Counter : 158