ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

బయోలాజికల్స్ నాణ్యతపై జాతీయ సదస్సును వర్చువల్ గా ప్రారంభించిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ


నాణ్యమైన జీవ ఉత్పత్తులు మాత్రమే ఆరోగ్య వ్యవస్థకు చేరేలా చూడటంలో ఎన్ఐబి కీలక పాత్ర పోషిస్తోంది, తద్వారా అందరికీ నాణ్యమైన ఆరోగ్యం, శ్రేయస్సును అందించాలన్న మన గౌరవ ప్రధాన మంత్రి లక్ష్యాన్ని బలోపేతం చేస్తుంది: డాక్టర్ మాండవీయ

‘కోవిడ్ 19 మహమ్మారి కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా మెడికల్ ఎమర్జెన్సీ మన బయోఫార్మా ,డయాగ్నొస్టిక్ పరిశ్రమ మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్య అవసరాలను తీర్చడానికి వ్యూహాత్మక ఆస్తులుగా నిరూపించబడ్డాయి.‘

ఎన్ఐబి పరీక్ష , మదింపు పై దృష్టి పెట్టడమే కాకుండా, ఉత్తమ తయారీ పద్ధతులను ప్రోత్సహించడంలో, ప్రతికూల సంఘటనలను పర్యవేక్షించడం, నివేదించడంలో కీలక పాత్ర పోషిస్తోంది: డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్

Posted On: 27 JAN 2023 12:16PM by PIB Hyderabad

"నాణ్యమైన జీవ ఉత్పత్తులు మాత్రమే ఆరోగ్య వ్యవస్థకు చేరేలా చూడటంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్స్ (ఎన్ఐబి)కీలక పాత్ర పోషిస్తోంది, తద్వారా అందరికీ నాణ్యమైన ఆరోగ్యం , శ్రేయస్సును అందించాలన్న మన గౌరవ ప్రధాన మంత్రి లక్ష్యాన్ని బలోపేతం చేస్తోంది.‘‘. 

ఈ రోజు ఢిల్లీ లో నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్స్ (ఎన్ ఐ బీ) నిర్వహించిన నేషనల్ సమ్మిట్ ఆన్ క్వాలిటీ ఆఫ్ బయోలాజికల్స్ లో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ వీడియో ప్రసంగం ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్, నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వీకే పాల్ కూడా వర్చువల్ గా ఈ సదస్సును ఉద్దేశించి ప్రసంగించారు.

 

బయోలాజికల్స్ నాణ్యత హామీ కి సంబంధించిన వివిధ అంశాలపై పరస్పర చర్య కోసం వాటాదారులు, నియంత్రణ అధికారులు ,విద్యావేత్తలను ఏకతాటిపైకి తీసుకురావడానికి ఈ నేషనల్ సమ్మిట్ వేదికగా పనిచేస్తుంది. ప్రభుత్వ ‘ఆరోగ్య భారతం‘ భావనను బలోపేతం చేసేలా ప్రజారోగ్యాన్ని ప్రోత్సహించడానికి ,పరిరక్షించడానికి సామర్థ్య నిర్మాణం, సాంకేతిక పరిజ్ఞానం పెంపు ,కొత్త జీవజాతుల అభివృద్ధికి ఈ పరస్పర చర్చలు దోహదపడతాయి. 

 

డాక్టర్ మాండవీయ మాట్లాడుతూ "సంప్రదాయ రసాయన మందులతో పాటు బయోలాజికల్ డ్రగ్స్ ఒక ఎంపికగా ఆవిర్భవించాయి. కోవిడ్-19 మహమ్మారి కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా మెడికల్ ఎమర్జెన్సీ మన బయోఫార్మా , డయాగ్నోస్టిక్ పరిశ్రమ మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్య అవసరాలను తీర్చడానికి వ్యూహాత్మక ఆస్తులుగా రుజువు చేసింది, ఇది సార్వత్రిక సోదరభావం "వసుధైక కుటుంబం",అనే భావనకు అర్థాన్ని ఇచ్చింది‘‘ అని అన్నారు. 

 

బహుళ భాగస్వాములను ఒకే వేదికపైకి తీసుకువచ్చినందుకు ఎన్ఐబిని అభినందించిన కేంద్ర మంత్రి, "ఈ శిఖరాగ్ర సమావేశం భారతదేశంలో ప్రస్తుతం అమలులో ఉన్న నాణ్యత హామీ విధానాలలో అంతరం విశ్లేషణకు పునాదిని అందిస్తుంది" అని అన్నారు.

‘‘ఇది దేశంలోని బయోఫార్మాస్యూటికల్స్, ఇన్-విట్రో డయాగ్నోస్టిక్ పరిశ్రమ మౌలిక సదుపాయాలు, సాంకేతికతలను అప్ గ్రేడ్ చేయడానికి ,ప్రపంచ స్థాయి ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి, ప్రజారోగ్యాన్ని ప్రోత్సహించడానికి, దాని సామర్థ్యాన్ని పెంచడానికి సహాయపడుతుంది" అని ఆయన పేర్కొన్నారు.

 

బయోఫార్మా రంగంలో శిక్షణ పొందిన మానవ వనరుల అవసరాన్ని గుర్తించి, జాతీయ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం దిశగా చొరవ చూపినందుకు ఎన్ ఐబీని ఆయన అభినందించారు. ఎన్ ఐ బీ, బ్లడ్ సెల్, ఎన్ హెచ్ ఎం పరిజ్ఞానం సహకారంతో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు 'క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ బయోలాజికల్స్ 'పై శిక్షణ ఇస్తోందని, రక్త సేవలను బలోపేతం చేయడానికి, విశ్లేషణాత్మక నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి బ్లడ్ బ్యాంక్ అధికారులకు సాంకేతిక సహాయం అందిస్తోందని తెలిపారు. ఈ రంగంలో అర్హత కలిగిన మానవ వనరులను తయారు చేయడానికి శిక్షణా కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలని ఆయన ఎన్ఐబిని కోరారు.

 

నవీకరించిన సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన కొత్త జీవశాస్త్రాల కోసం ఫార్మకోపియల్ మోనోగ్రాఫ్ ల అభివృద్ధిని ప్రోత్సహించడానికి అత్యాధునిక విశ్లేషణ వేదికలను ఉపయోగించి అధ్యయనాలను ప్రారంభించాల్సిన అవసరాన్ని డాక్టర్ మాండవీయ వివరించారు. ఇలాంటి ఉత్పత్తులను దేశీయంగా అభివృద్ధి చేస్తే చికిత్సలు సామాన్యులకు మరింత చౌకగా లభిస్తాయని, మన ప్రజారోగ్య వ్యవస్థ కూడా బలోపేతం అవుతుందని ఆయన అన్నారు. ‘‘అరుదైన ,నిర్లక్ష్యం చేయబడిన వ్యాధుల చికిత్స కోసం ఇప్పటికే ఉన్న మందులు, జన్యు చికిత్స, స్టెమ్ సెల్ థెరపీ, వ్యక్తిగతీకరించిన మందులు వంటి కొత్త ఉత్పత్తి వర్గాలపై ఆవిష్కరణతో సహా కొత్త జీవ ఔషధాల స్వదేశీ అభివృద్ధిని ప్రోత్సహించడానికి పరిశ్రమ, విద్యావేత్తలు ఇంకా నియంత్రణ నెట్వర్క్ కలిసి పనిచేయాల్సి ఉంటుంది" అని ఆయన అన్నారు. 

 

బయోలాజికల్స్ నాణ్యతపై సమగ్రమైన, నిష్పక్షపాత మదింపులు జరిపేందుకు ఎన్ ఐ బీ ప్రత్యేక స్థానంలో ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్ పేర్కొన్నారు. "ఎన్ఐబి కేవలం ఆరోగ్య పరీక్ష లు, మదింపు మాత్రమే దృష్టి పెట్టదు, ఉత్తమ తయారీ పద్ధతులను ప్రోత్సహించడంలో, ప్రతికూల సంఘటనలను పర్యవేక్షించడంలో, నివేదించడంలో ఇంకా జీవశాస్త్రం నాణ్యత, భద్రత దిశగా ఇతర నియంత్రణ సంస్థలు ,పరిశ్రమ భాగస్వాములతో కలిసి పనిచేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది" అని ఆమె పేర్కొన్నారు.

 

బయోఫార్మా పరిశ్రమలో డిజిటల్ జోక్యాలను అవలంబించాల్సిన అవసరాన్ని తెలియచేస్తూ, బయోఫార్మా తయారీదారులు "ఈ విచ్ఛిన్నకర మార్పులను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి చెందాలని ,భవిష్యత్తు కోసం బయోప్రాసెస్ నమూనాలను నిర్మించాలని ఆమె కోరారు. రెగ్యులేటర్లు ,టెస్టింగ్ ప్రయోగశాలలు కూడా ఈ అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు ,పద్ధతులకు అనుగుణంగా ఉండాలని, తద్వారా ఈ ప్రాణరక్షక మందులు సాధ్యమైనంత వేగంగా మార్కెట్లోకి వస్తాయని అన్నారు. 

పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం, ఏపీఐలో స్వావలంబన, నాణ్యతా ప్రమాణాలను మెరుగుపరచడం, డిజిటలైజేషన్, రెగ్యులేటరీ సరళీకరణ, ఎగుమతుల వైపు దృష్టి సారించడంపై దృష్టి సారించాలని ఆమె పరిశ్రమ ప్రతినిధులను కోరారు.

 

ఈ కార్యక్రమంలో కాఫీ టేబుల్ బుక్ ను ప్రముఖులు ఆవిష్కరించారు.

 

ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ రాజేశ్ భూషణ్, ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎస్ గోపాలకృష్ణన్, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎఎస్ అండ్ ఎఫ్ఎ శ్రీ జైదీప్ కుమార్ మిశ్రా, , ఆరోగ్య మంత్రిత్వ శాఖ జేఎస్ శ్రీ రాజీవ్ వాధ్వాన్, ఎన్ఐబీ డైరెక్టర్ శ్రీ అనూప్ అన్వికర్, ఎన్ఐబీ డిప్యూటీ డైరెక్టర్ (క్వాలిటీ కంట్రోల్) డాక్టర్ హరీశ్ చందర్, ఇంకా కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు పాల్గొన్నారు. టీ హెచ్ ఎస్ టి ఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ప్రమోద్ కుమార్ గార్గ్, ఎయిమ్స్ భోపాల్ అధ్యక్షుడు ప్రొఫెసర్ వైకే గుప్తా కూడా హాజరయ్యారు.

 

 

****

 



(Release ID: 1894091) Visitor Counter : 171