వ్యవసాయ మంత్రిత్వ శాఖ
చిరుధాన్యాల రంగంలో దక్షిణ దేశాల మధ్య సహకారం, సమన్వయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి నేడు నైజీరియా రాజధాని అబుజాకు చేరుకోనున్న వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ అభిలాక్ష్ లిఖి నేతృత్వంలోని ఉన్నత స్థాయి భారతయ ప్రతినిధి బృందం
చిరుధాన్యాల రంగంలో ఆఫ్రికా ఖండంలోని 54 దేశాలలో 2వ అత్యంత అత్యధిక జనాభా కలిగి సంపన్నదేశమైన నైజీరియా దక్షిణ-దక్షిణ సహకారానికి ఒక నమూనాగా ఉంటుంది..శ్రీ లేఖి
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు భారతీయ ప్రవాసుల సహాయంతో వండిన చిరుధాన్యాలతో వండిన వంటకాల ప్రదర్శనలు/పోటీలను నిర్వహించి భారతీయ రుచులు అందించనున్న 140కి పైగా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు.
74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక సంస్థలు, ఆహార ప్రియులు , ఆహార పదార్థాల దిగుమతిదారులు స్థానిక రెస్టారెంట్‌ల భాగస్వామ్యంతో సదస్సులు, చర్చలు, చర్చాగోష్ఠుల నిర్వహణ
ఒకే విధమైన ప్రాధాన్యతా రంగాలు కలిగి ఉన్న భారతదేశం, ఆఫ్రికా దేశాలు అభివృద్ధి చెందుతున్న ప్రపంచ ఆహార మార్కెట్లలో సారూప్య పాత్రలు వ్యవసాయ రంగంలో ముఖ్యంగా “చిరుధాన్యాల ఉత్పత్తి, ప్రోత్సాహక ” రంగాలలో సహకారానికి అనేక అవకాశాలను ఉన్నాయి : శ్రీ లిఖి
Posted On:
26 JAN 2023 2:47PM by PIB Hyderabad
చిరుధాన్యాల రంగంలో దక్షిణ-దక్షిణ దేశాల మధ్య సహకారం, సమన్వయం మరింత అభివృద్ధి చేయడం ప్రధాన లక్ష్యంగా వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ అభిలాక్ష్ లిఖి నేతృత్వంలోని ఉన్నత స్థాయి భారతీయ ప్రతినిధి బృందం నేడు నైజీరియా రాజధాని అబుజాకు చేరుకుంది.
"చిరుధాన్యాల ప్రత్యేక పర్యటన" నాలుగు రోజుల పాటు 2023 జనవరి 26 నుండి జనవరి 29 వరకు జరుగుతుంది.నైజీరియాకు బయలుదేరి వెళ్ళకముందు శ్రీ లేఖి ఒక ప్రకటన విడుదల చేశారు. భారతదేశం పర్యవేక్షణలో అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం 2023 ప్రారంభం కానున్న నేపథ్యంలో చేపట్టిన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది అని శ్రీ లేఖి అన్నారు. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం మొదటి రోజున కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలు,భారత రాయబార కార్యాలయాలు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తాయి.
ఆఫ్రికన్ ఖండంలోని 54 దేశాలలో నైజీరియా 2వ అత్యంత ధనిక , అత్యధిక జనాభా కలిగిన దేశంగా గుర్తింపు పొందింది. ఆఫ్రికన్ ఖండం ఎదుర్కొంటున్న అత్యంత భయంకరమైన సవాళ్లలో ఒకటిగా ఉన్న "ఆహార భద్రత లోపాన్ని" పరిష్కరించడానికి ఈజిప్ట్, దక్షిణాఫ్రికా, అల్జీరియా, మొరాకో, ఇథియోపియా, కెన్యా, అంగోలా,ఘనా, సూడాన్ వంటి దేశాలతో కలిసి భారతదేశం చేస్తున్న నైజీరియా చేరితే చిరుధాన్యాల రంగంలో దక్షిణ-దక్షిణ సహకారానికి ఇది ఒక నమూనాగా మారుతుంది. భారతదేశం, ఆఫ్రికా దేశాలు ఒకే రకమైన ప్రాధాన్యతా రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న ప్రపంచ ఆహార మార్కెట్లలో సారూప్య పాత్రలు పోషిస్తున్నాయి. దీనివల్ల వ్యవసాయ రంగంలో ముఖ్యంగా చిరుధాన్యాల ఉత్పత్తి,ప్రోత్సాహ రంగాలలో రెండు దేశాలు కలిసి పనిచేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి .
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో 2003 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా పాటించాలని ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశంలో భారతదేశం ప్రతిపాదించింది. భారతదేశం చేసిన ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితి ఏకగ్రీవంగా ఆమోదించింది.ఐక్యరాజ్యసమితి ఆమోదించిన తీర్మానంతో అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం అమలులో కీలక పాత్ర పోషించే అవకాశం భారతదేశానికి లభించింది. ప్రజా ఉద్యమంగా అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరాన్ని నిర్వహించాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిర్ణయించారు. ఇదేసమయంలో చిరుధాన్యాల రంగంలో భారతదేశం ప్రపంచంలో అగ్రస్థానం సాధించి అంతర్జాతీయ కేంద్రంగా అభివృద్ధి చెందాలని కూడా శ్రీ నరేంద్ర మోదీ నిర్ణయించారు.
ఇటలీలోని రోమ్‌లో అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం -2023 ప్రారంభ కార్యక్రమాన్ని ఐక్యరాజ్యసమితి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ నిర్వహించింది.ప్రారంభ కార్యక్రమంలో శాఖ సహాయ మంత్రి శ్రీమతి సుశ్రీ శోభా కరంద్లాజే నేతృత్వంలో భారత ప్రతినిధి బృందం పాల్గొంది. బృందం సభ్యులుగా వ్యవసాయం రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శుభ ఠాకూర్ ఇతర సీనియర్ అధికారులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అందించిన ఉత్సవ సందేశాన్నిశ్రీమతి సుశ్రీ శోభా కరంద్లాజే వినిపించారు.
అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం -2023లో 140 పైగా దేశాల్లో ఉన్న భారత రాయబార కార్యాలయాలు పాల్గొంటాయి. ఆయా దేశాల్లో నివసిస్తున్న భారతీయులు, వాణిజ్య సంస్థలు, ఆహార ప్రియులు, ఆహార పదార్థాల దిగుమతి దారులు మరియు స్థానిక రెస్టారెంట్లు మొదలైన వారి సహకారంతో ప్రదర్శన, సెమినార్‌లు, చర్చలు నిర్వహించి ప్రవాస భారతీయుల ప్రవాసుల సహాయంతో చిరుధాన్యాలతో వండిన వంటల ప్రదర్శనలు/పోటీలు నిర్వహించి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా చిరుధాన్యాల వంటకాల రుచులు అందిస్తాయి.
తన నైజీరియా పర్యటన గురించి మాట్లాడిన శ్రీ లిఖి అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం ప్రచారంలో భాగంగా అబుజాలోని భారత హైకమిషన్, లాగోస్‌లోని భారత కాన్సులేట్ జనరల్ మిల్లెట్స్ ఫుడ్ ఫెస్టివల్ , చిరుధాన్యాల వంటల పోటీ నిర్వహిస్తాయని అన్నారు. నైజీరియా. మిల్లెట్స్ ఫుడ్ ఫెస్టివల్ హై కమీషన్ ప్రాంగణంలో జరుగుతుంది. నైజీరియా దేశ ప్రముఖులు , భారతీయ ప్రజలతో సహా ఆహ్వానితులకు ప్రత్యేక వంటకాలు అందిస్తారు.
జీ-20 అధ్యక్ష బాధ్యతలను భారతదేశం స్వీకరించిన నేపథ్యంలో అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం జరుగుతున్న అంశాన్ని భోపాల్‌లో జరిగిన ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్‌లో 2023 జనవరి 24న కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్‌తోమర్ ప్రస్తావించారని శ్రీ లేఖి అన్నారు.. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు, మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమలో మాత్రమే కాకుండా భారతదేశ శక్తి సామర్ధ్యాలు ప్రపంచ దేశాలు గుర్తిస్తాయని అన్నారు. “హోల్ ఆఫ్ గవర్నమెంట్”,“హోల్ ఆఫ్ సొసైటీ” విధానం స్ఫూర్తితో అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం 2023 ని నిర్వహిస్తామని శ్రీ లిఖి అన్నారు.
కోఆపరేటివ్ రిపబ్లిక్ ఆఫ్ గయానా అధ్యక్షుడు డాక్టర్ మహమ్మద్ ఇర్ఫాన్ అలీ తన వారం రోజుల భారత పర్యటనలో 2023 జనవరి 12వ తేదీన కేంద్ర వ్యవసాయం రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్‌తోమర్‌తో జరిపిన చర్చల్లో తమ దేశంలో చిరుధాన్యాల సాగుకు 200 ఎకరాల భూమిని అందించారని శ్రీ లేఖి తెలిపారు. 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం (IYM)గా ఐక్యరాజ్యసమితి ప్రకటించినందుకు గౌరవసూచకంగా ప్రైవేట్ రంగానికి వ్యవసాయ భూమిని అందించాలని రిపబ్లిక్ ఆఫ్ గయానా నిర్ణయించింది.
విజన్‌ను ప్రదర్శించడానికి 2023 ఫిబ్రవరిలో జరగనున్న కరీబియన్ కమ్యూనిటీ (CARICOM) ప్రభుత్వాధినేతల సదస్సుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీని డాక్టర్ ఇర్ఫాన్ అలీ ఆహ్వానించారు. వ్యవసాయం,ఆహార భద్రతపై భారతదేశం అనుసరిస్తున్న విధానాలపై ప్రసంగించాలని కోరారు. 17 దేశాల అధినేతలను ఉద్దేశించి వర్చువల్ విధానంలో అయినా ప్రసంగించి కరేబియన్ దేశాలలో చిరుధాన్యాలను ప్రోత్సహించడానికి కృషి చేయాలని అయన కోరారు. భారత వ్యవసాయ శాఖ మంత్రితో చిరుధాన్యాలపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తామని ఆయన అన్నారు.
***
(Release ID: 1893953)
Visitor Counter : 216