హోం మంత్రిత్వ శాఖ

2023 గణతంత్ర దినోత్సవం సందర్భంగా 901 మంది పోలీసు సిబ్బందికి పోలీసు పతకాలు


- 140 మందికి గ్యాలంట్రీ (పీఎంజీ) పోలీసు పతకాలు, 93 మందికి విశిష్ట సేవలకు గుర్తింపుగా రాష్ట్రపతి పోలీసు పతకాలు (పీపీఎం), 668 మందికి మెరిటోరియస్ సర్వీస్ (పీఎం) గుర్తింపుగా పోలీసు పతకం

Posted On: 25 JAN 2023 10:11AM by PIB Hyderabad

2023             గణతంత్ర దినోత్సవం సందర్భంగా మొత్తం 901 మంది పోలీసు సిబ్బందికి పోలీస్  పతకాలు లభించాయి.  140 మందికి గ్యాలంట్రీ (పీఎంజీ) కోసం పోలీసు పతకం, 93 మందికి విశిష్ట సేవలకు గుర్తింపుగా  రాష్ట్రపతి పోలీసు పతకాలు (పీపీఎం),  668 మందికి  మెరిటోరియస్ సర్వీస్ (పీఎం) గుర్తింపుగా పోలీసు పతకాలు లభించాయి.  140 గ్యాలంట్రీ అవార్డులలో ఎక్కువ భాగం, లెఫ్ట్ వింగ్ తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో పని చేస్తున్న 80 మంది సిబ్బందికి మరియు జమ్మూ & కాశ్మీర్ ప్రాంతానికి చెందిన 45 మంది సిబ్బందిని  వారివారి సాహసోపేత చర్యలకు గుర్తింపుగా పతకాలను ప్రదానం చేయనున్నారు.  గ్యాలంట్రీ అవార్డులు అందుకున్న సిబ్బందిలో 48 మంది సీఆర్పీఎఫ్ నుండి, 31 మంది మహారాష్ట్ర నుండి, 25 మంది జే&కే పోలీస్ నుండి, 09 మంది జార్ఖండ్ నుండి, 07 మంది ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్ & బీఎస్ఎఫ్ నుండి మరియు మిగిలిన వారు ఇతర రాష్ట్రాలు/ యుటీలు మరియు సీఏపీఎఫ్ల నుండి ఉన్నారు. పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ (పీఎంజీ) అనేది ప్రజల ప్రాణాలను మరియు ఆస్తిని రక్షించడంలో లేదా నేరాలను నిరోధించడంలో లేదా నేరస్థులను అరెస్టు చేయడంలో ప్రస్ఫుటమైన సేవలకు గుర్తింపు గా ఇవ్వబడుతుంది. ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీస్ (పీపీఎం) అనేది పోలీస్ సర్వీస్‌లో ప్రత్యేక విశిష్ట రికార్డు మరియు పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ (పీఎం) వనరు మరియు విధి పట్ల అంకితభావంతో కూడిన విలువైన సేవ కోసం అందించబడుతుంది.

       అవార్డు గ్రహీతల జాబితాల వివరాలు క్రింది విధంగా జతచేయబడ్డాయి:

క్రమ సంఖ్య 

విషయం

పోలీసుల సంఖ్య

అనుబంధం 

1

పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ  (పీఎంజీ)

140

అనుబంధం -I -I

2

ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీస్

93

అనుబంధం -I  -II

3

పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్

668

అనుబంధం -I -III

4

పోలీసు సిబ్బంది.. రాష్ట్ర వారీగా/ ఫోర్స్ వారీగా పతకాలు గ్రహీతల 

జాబితా ప్రకారం 

అనుబంధం -IV

 

అనుబంధం -I వీక్షించడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అనుబంధం -I I వీక్షించడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అనుబంధం -III వీక్షించడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అనుబంధం - IV వీక్షించడానికి ఇక్కడ క్లిక్ చేయండి

*****(Release ID: 1893629) Visitor Counter : 172