మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఐఐటీ మద్రాస్ అభివృద్ధి చేసిన మేడ్ ఇన్ ఇండియా మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ 'భరోస్'ని
విజయవంతంగా పరీక్షించిన కేంద్ర మంత్రులు
భారతదేశంలో బలమైన, స్వదేశీ & స్వావలంబన కలిగిన డిజిటల్ అవస్థాపన గురించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అలోచనలను నెరవేర్చడానికి 'భరోస్' ఒక ముఖ్యమైన చొరవ - శ్రీ ధర్మేంద్ర ప్రధాన్
प्रविष्टि तिथि:
24 JAN 2023 2:32PM by PIB Hyderabad
కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి & వ్యవస్థాపకత మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, రైల్వే, కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ తో కలిసి ఈరోజు ఐఐటీ మద్రాస్ అభివృద్ధి చేసిన మేడ్ ఇన్ ఇండియా మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్'భరోస్'(‘BharOS’) ని విజయవంతంగా పరీక్షించారు. బలమైన, స్వదేశీ, ఆధారపడదగిన & స్వావలంబన కలిగిన డిజిటల్ మౌలిక సదుపాయాల ప్రధాన లబ్ధిదారులుగా దేశంలోని పేద ప్రజలు ఉంటారని శ్రీ ప్రధాన్ అన్నారు. మొత్తం ప్రభుత్వ విధానంతో పాలసీ ఎనేబుల్‌లను ప్రోత్సహించడం అనేది ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ దార్శనికత యొక్క అనువర్తిత ప్రయోగం అని అన్నారు. డేటా గోప్యత దిశగా 'భరోస్'(‘BharOS’) విజయవంతమైన అడుగు అని ఆయన తెలిపారు. భారత దేశంలో బలమైన, స్వదేశీ & స్వావలంబన కలిగిన డిజిటల్ మౌలిక సదుపాయాలపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ దృష్టిని నెరవేర్చే దిశగా 'భరోస్' - మేడ్ ఇన్ ఇండియా మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క విజయవంతమైన పరీక్ష ఒక ముఖ్యమైన చొరవ అని శ్రీ ప్రధాన్ అన్నారు.
*****
(रिलीज़ आईडी: 1893473)
आगंतुक पटल : 256