సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2023 జనవరి 27 నుంచి 31 వరకు ముంబైలో ఎస్సిఓ చలన చిత్రోత్సవం

పోటీ మరియు పోటీయేతర విభాగాల కింద 57 చిత్రాల ప్రదర్శన
భారతదేశం నుండి పోటీ విభాగంలో నామినేట్ అయిన మరాఠీ చిత్రం 'గోదావరి' , గుజరాతీ చిత్రం 'ది లాస్ట్ ఫిల్మ్ షో'

Posted On: 23 JAN 2023 5:53PM by PIB Hyderabad

జాతీయ చలన చిత్ర అభివృద్ధి సంస్థ సహకారంతో  ముంబైలో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ 2023 జనవరి 27 నుంచి 31వ తేదీ వరకు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ చలన చిత్రోత్సవాన్ని నిర్వహిస్తోంది.  భారతదేశ అధ్యక్ష పదవికి గుర్తు గా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ చలన చిత్రోత్సవాన్నినిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

చలన చిత్రోత్సవం వివరాలను సమాచార, ప్రసార శాఖ  అదనపు కార్యదర్శి శ్రీమతి నీరజా శేఖర్మీడియాకు వివరించారు.  షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సభ్య దేశాల మధ్య సినిమా రంగ భాగస్వామ్యాలను అభివృద్ధి చేయడం వివిధ దేశాల సంస్కృతుల మధ్య వారధిగా పనిచేయడం లక్ష్యంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సభ్య దేశాల మధ్య సంబంధాలను మెరుగు పరచడంతో పాటు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు బలపడతాయని అన్నారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సభ్య దేశాల్లో నిర్మాణం పూర్తి చేసుకున్న చిత్రాలను కాహళ చిత్రోత్సవంలో ప్రదర్శిస్తారని అన్నారు. బిన్న సంస్కృతులు కలిగి ఉన్న దేశాల్లో నిర్మాణం అయిన చిత్రాలను వీక్షించి ప్రేక్షకులకు విభిన్న సంస్కృతులపై అవగాహన కలుగుతుందన్నారు.సభ్య దేశాల ప్రజలు ఒకరినొకరు  తెలుసుకునేందుకు ఈ చిత్రాలు ఒక వేదికగా ఉంటాయని  ఆమె తెలిపారు.

పోటీ, పోటీయేతర ప్రదర్శనలలో ఎస్సిఓ దేశాల చిత్రాల  ప్రదర్శన ఉంటుందని శ్రీమతి శేఖర్ వివరించారు.చలనచిత్ర ప్రదర్శనలతో పాటు చలన చిత్రోత్సవంలో  మాస్టర్-క్లాస్‌లు,చర్చాగోష్ఠులు, దేశం, రాష్ట్ర పెవిలియన్‌లు, ఫోటో, పోస్టర్ ఎగ్జిబిషన్‌లు, హస్తకళల ప్రదర్శనశాలలు లాంటి కార్యక్రమాలు ఉంటాయి.

అధ్యక్ష హోదాలో భారతదేశం వ్యవహరిస్తున్న సమయంలో నిర్వహిస్తున్న ఎస్సిఓ చలన చిత్రోత్సవం భారతదేశంలో నిర్మించిన ఒక చలనచిత్రం ప్రపంచ ప్రీమియర్‌ షోతో ప్రారంభమవుతుంది. ప్రారంభ వేడుక 2023 జనవరి 27 న ముంబైలోని ఎన్సిపీఏ జంషెడ్ భాభా థియేటర్‌లో జరుగుతుంది

చలన చిత్రోత్సవంలో చిత్రాల ప్రదర్శనలు ముంబైలోని రెండు ప్రదేశాలలో జరుగుతాయి, పెద్దర్ రోడ్‌లోని ఫిల్మ్ డివిజన్ కాంప్లెక్స్‌లోని 4 ఆడిటోరియంలు, వర్లీలోని నెహ్రూ ప్లానిటోరియం బిల్డింగ్‌లోని 1 జాతీయ చలన చిత్ర అభివృద్ధి సంస్ థియేటర్ లో చిత్రాలను ప్రదర్శిస్తారు. .

ఎస్సిఓ సభ్య దేశాలు మాత్రమే పోటీ విభాగంలో పాల్గొంటాయి. ఈ విభాగంలో  ఉత్తమ ఫీచర్ ఫిల్మ్, ఉత్తమ నటుడు (పురుషుడు), ఉత్తమ నటి (మహిళ), ఉత్తమ దర్శకుడు (ఫీచర్ ఫిల్మ్), స్పెషల్ జ్యూరీ అవార్డు వంటి పలు ప్రతిష్టాత్మక అవార్డులు ప్రధానం చేస్తారు..

పోటీయేతర విభాగంలో ఎస్సిఓ సభ్య దేశాలతో సహా పరిశీలక దేశాలు, చర్చల్లో పాల్గొనే దేశాలు ఈ క్రింది విభాగాల్లో పోటీ పడతాయి. 

 

ఏ. ఎస్సిఓ కంట్రీ ఫోకస్: సంబంధిత ఎస్సిఓ దేశానికి చెందిన చిత్రాలను కంట్రీ ఫోకస్ ఫిల్మ్‌ విభాగంలో ప్రదర్శించడానికి ఎంపికచేస్తారు. దీనివల్ల, వివిధ దేశాల మధ్య మార్పిడిని ప్రారంభించడం  షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల మధ్య సంస్కృతిక వారధి నిర్మించడానికి అవకాశం కలుగుతుంది.

 

బి. డైరెక్టర్ ఫోకస్: దేశ వారసత్వ సంపద పరిరక్షణ కోసం తన చిత్రాల ద్వారా కృషి చేసి సంబంధిత దేశ చలన చిత్ర రంగంలో గుర్తింపు, గౌరవం పొందిన దర్శకుడు రూపొందించిన చిత్రాలను ఈ విభాగంలో ప్రదర్శిస్తారు.   ఎస్సిఓ దేశానికి చెందిన ప్రసిద్ధ దర్శకుడు, దేశ వారసత్వానికి దోహదపడే వారి క్రాఫ్ట్ మరియు సినిమా వంశానికి దేశంలో బాగా గౌరవం పొందిన ప్రఖ్యాత అనుభవజ్ఞుడు

సి. చిల్డ్రన్స్ ఫోకస్: ఈ విభాగంలో పిల్లలు సులభంగా అర్థం చేసుకునే విధంగా, యువ ప్రేక్షకులకు అవగాహన కల్పించే చిత్రాలు, వినోదభరితమైన చిత్రాలను ఎంపిక చేసి ప్రదర్శిస్తారు. చిత్రాల ద్వారా చిన్నపిల్లలకు ఆసక్తి పెంపొందించడం, వారి ఆలోచనలకు పదును పెట్టడానికి కృషి చేయడం లక్ష్యంగా ఈ విభాగంలో చిత్రాలు ప్రదర్శిస్తారు.

డి.లఘు చిత్రాలు:  20 నిమిషాలకు మించని లఘు చిత్రాలను ఈ విభాగంలో ప్రదర్శిస్తారు. కళాత్మక విలువలు కలిగి అసలైన ఆలోచనల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా రూపొందించిన చిత్రాలు విభాగంలో ఉంటాయి.

ఈ. భారతీయ కళాత్మక చిత్రాలు: ఈ విభాగంలో 5 చిత్రాలను ప్రదర్శిస్తారు.

ఎస్సిఓ చలన చిత్రోత్సవంలో  ఎస్సిఓ దేశాలకు చెందిన  మొత్తం 57 చిత్రాలను ప్రదర్శిస్తారు. పోటీ విభాగంలో 14 చలనచిత్రాలు పోటీ పడుతున్నాయి. వీటిని ప్రదర్శిస్తారు. పోటీయేతర విభాగంలో 43 చిత్రాలను ప్రదర్శిస్తారు.

పోటీ విభాగంలో మొత్తం 14 చిత్రాలు నామినేట్ అయ్యాయి.

* నిఖిల్ మహాజన్ దర్శకత్వం వహించిన మరాఠీ చిత్రం 'గోదావరి' , పాన్ నలిన్ దర్శకత్వం వహించిన గుజరాతీ చిత్రం 'ది లాస్ట్ ఫిల్మ్ షో' భారతదేశ సభ్య దేశం నుంచి నామినేట్ అయ్యాయి.

*  ఏ.జాయిరోవ్,  ఎం. మమై బెకొవ్ దర్శకత్వం వహించిన మామ్, ఐ యామ్ అలైవ్! ,, బైరాకిమోవ్ ఆల్డియర్ దర్శకత్వం వహించిన పారాలింపియన్ రష్యా చిత్రాలు కజాఖ్స్తాన్  సభ్య దేశం నుంచి నామినేట్ అయ్యాయి. *బకిత్ ముకుల్ దర్శకత్వం వహించిన కిర్గిజ్ చలనచిత్రాలు అకిర్కీ కోచ్ (ది రోడ్ టు ఈడెన్), దస్తాన్ ఝపర్ ఉలు , తలైబెక్ కుల్మెందీవ్ దర్శకత్వం వహించిన ఉయ్ సటిలట్ (హోమ్ ఫర్ సేల్) సభ్య దేశం కిర్గిజ్స్తాన్ నుంచి నామినేట్ అయ్యాయి.

* యీహుయ్ షొ దర్శకత్వం వహించిన  బి ఫర్ బిజీ,  జియావోజీ రావు దర్శకత్వం వహించిన హోమ్ కమింగ్ చిత్రాలు సభ్య దేశం చైనా నుంచి నామినేట్ అయ్యాయి.

* లియుబోవ్ బోరిసోవా సఖా దర్శకత్వం వహించిన   డోంట్ బరీ మీ వితౌట్ ఇవాన్ , ఎవ్జెనీ గ్రిగోరెవ్ దర్శకత్వం వహించిన పోడెల్నికి (ది రైట్) సభ్య దేశం రష్యా నుంచి నామినేట్ అయ్యాయి.

* డి.మసైడోవ్ దర్శకత్వం వహించిన ఏల్ కిస్మతి (ది ఫేట్ ఆఫ్ ఎ ఉమెన్),హిలోల్ నసిమోవ్ దర్శకత్వం వహించిన మెరోస్ (లెగసీ) ఉజ్బెకిస్తాన్ నుంచి నామినేట్ అయ్యాయి.

* ముహిద్దీన్ ముజఫర్ దర్శకత్వం వహించిన  డోవ్ (ఫార్చ్యూన్), మహ్మద్రాబి ఇస్మోయిలోవ్ దర్శకత్వం వహించిన ఓఖిరిన్ సైది సయోద్ (హంటర్స్ ఆఖరి ప్రే) తజికిస్తాన్ సభ్య దేశం నుంచి నామినేట్ అయ్యాయి.

ఎస్సిఓ చలన చిత్రోత్సవంలో భారతీయ చలనచిత్రాలు –

*  ఉత్తమ విదేశీ భాష విభాగంలో ఆస్కార్‌కు భారతదేశం అధికారిక ఎంట్రీగా ప్రవేశించి  ప్రశంసలు పొందిన నిఖిల్ మహాజన్ దర్శకత్వం వహించిన మరాఠీ చిత్రం గోదావరి  , లాస్ట్ ఫిల్మ్ షో అని గుర్తింపు పొందిన గుజరాతీ చిత్రం ఛెలో షో లను పోటీ విభాగంలో ప్రదర్శిస్తారు.వీటితో పాటు  ఎస్సిఓ కంట్రీ ఫోకస్‌లో షూజిత్ సిర్కార్ దర్శకత్వం వహించిన సర్దార్ ఉదమ్, ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ చిత్రాలు ప్రదర్శిస్తారు.

  డైరెక్టర్ ఫోకస్‌ విభాగంలో  సంజయ్ లీలా బన్సాలీ గంగూబాయి కతియావాడి, చిల్డ్రన్ ఫోకస్‌ విభాగంలో మృదుల్ టూల్సీదాస్ టూల్‌సిదాస్ జూనియర్ , చేతన్ భకుని రూపొందించిన షార్ట్ ఫిల్మ్ జుగల్‌బందీ లను ప్రదర్శిస్తారు.అంతేకాకుండా తిరిగి నిర్మించిన కళాత్మక చిత్రాలు శత్రంజ్ కే ఖిలాడి (1977, హిందీ), సువర్ణరేఖ (1965, బెంగాలీ), చంద్రలేఖ (1948, తమిళం), ఇరు కొడ్గుల్ (1969, తమిళం) చిదంబరం (1985, మలయాళం)లను చలన చిత్రోత్సవంలో ప్రదర్శిస్తారు. 

ఎస్సిఓ అధికారిక భాషలుగా గుర్తింపు పొందిన రష్యన్, చైనీస్ భాషలు చలన చిత్రోత్సవం అధికారిక భాషలుగా ఉంటాయి. భారతదేశంలో ఆతిథ్యం ఇస్తున్నందున చిత్రోత్సవంలో క్రియాత్మక భాషగా ఇంగ్లీష్ కూడా చేర్చబడుతుంది. జ్యూరీ మరియు స్థానిక ప్రేక్షకుల ప్రయోజనం కోసం ప్రదర్శించబడే చలనచిత్రాలను ఆంగ్లంలో డబ్ చేయడం లేదా ఉప శీర్షికలు అందించడం అవసరం.

చలన చిత్రోత్సవానికి హాజరయ్యే భారతీయ చలనచిత్ర ప్రముఖులతో పాటు ఎస్సిఓ దేశాలకు చెందిన ప్రముఖ చిత్రనిర్మాతలు, నటీనటులు "మాస్టర్‌క్లాసెస్’ , ‘ఇన్ కన్వర్సేషన్’ కార్యక్రమాల్లో పాల్గొంటారు. యానిమేషన్ రంగం చరిత్రకు సంబంధించి  పరిశ్రమ నిపుణులతో చర్చా గోష్టి కార్యక్రమం ఉంటుంది.   యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్‌ల సహాయంతో 'షాట్‌ని సృష్టించడం' లాంటి అంశాలు చర్చకు వస్తాయి. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల సహాయంతో చలనచిత్ర పంపిణీలు, థియేటర్ భాషా అనువాదాల ముఖచిత్రాన్ని మార్చడంపై కూడా కొన్ని సదస్సులు జరుగుతాయి.

ఎస్సిఓ ఫిల్మ్ ఫెస్టివల్ పోర్టల్‌ : https://sco.nfdcindia.com/, లో  ఆన్‌లైన్ లో ప్రతినిధులు నమోదు చేసుకోవచ్చు.  పెడ్డర్ రోడ్ ముంబైలోని ఫిల్మ్స్ డివిజన్ కాంప్లెక్స్  ప్రధాన ఫెస్టివల్ వేదిక వద్ద  ఫిజికల్ రిజిస్ట్రేషన్ డెస్క్‌లు అందుబాటులో ఉంటాయి. డెలిగేట్ రిజిస్ట్రేషన్ ఫీజుగా 300 రూపాయలు లేదా రోజుకు 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.  విద్యార్థులకు ఉచితంగా ప్రవేశం కల్పిస్తారు.

ఎస్సిఓ చలన చిత్రోత్సవం 2023 జ్యూరీ సభ్యులు

భారతదేశం

రాహుల్ రావైల్

చలన చిత్ర నిర్మాత

లవ్ స్టోరీ, బేతాబ్, అర్జున్, అంజామ్ లాంటి అనేక  చిత్రాలతో రాహుల్ రావైల్   చలనచిత్ర దర్శకుడు, సంపాదకునిగా గుర్తింపు పొందారు. సన్నీ డియోల్, అమృతా సింగ్, పరేష్ రావల్, కాజోల్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ జాన్ అబ్రహం వంటి అనేకమంది నటులను చలన చిత్ర రంగానికి పరిచయం చేశారు.2017,2018లో ఐఎఫ్ఎఫ్ఐ లో ఇండియన్ పనోరమకు అధ్యక్షత వహించిన రాహుల్ రావైల్ 2019లో జాతీయ చలనచిత్ర అవార్డుల  జ్యూరీ అధ్యక్షునిగా వ్యవహరించారు. అనేక అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో రాహుల్ రావైల్ పాల్గొన్నారు. రాహుల్ రావైల్ రచించిన  పుస్తకం 'రాజ్ కపూర్ - ది మాస్టర్ ఎట్ వర్క్'  విద్యార్థులకు పాఠ్య పుస్తకంగా పరిగణించబడుతుంది.

చైనా

 

 

 నింగ్ యింగ్

చిత్ర దర్శకురాలు

నింగ్ యింగ్ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన మరియు అవార్డు గెలుచుకున్న చైనీస్ చలనచిత్ర దర్శకుడు. చైనా క ఆరవ తరం చిత్రనిర్మాత కోటరీలో సభ్యురాలిగా గుర్తింపు పొందారు. బీజింగ్ త్రయం గా గుర్తింపు పొందిన  ఫర్ ఫన్, ఆన్ ది బీట్, ఐ లవ్ బీజింగ్‌ వంటి చిత్రాలతో ఆమె గుర్తింపు పొందారు.  ఇటీవలి దశాబ్దాలలో బీజింగ్‌లో వచ్చిన భారీ మార్పులను ఈ చిత్రాల ద్వారా ఆమె విశ్లేషించారు.  చైనా  చౌక కార్మికుల భారీ వలసలు ఆధారంగా రూపొందిన  రైల్‌రోడ్ ఆఫ్ హోప్ (2002) గ్రాండ్ ప్రిక్స్ డు సినిమా డు రీల్ మరియు పర్పెచువల్ మోషన్ (2005) అవార్డు గెలుచుకుంది అనేక అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో చిత్రాన్ని ప్రదర్శించారు. .

 

కజకిస్తాన్

 

దిమాష్ కుడైబెర్గెన్

సంగీతకారుడు

దిన్ముఖమెద్ ‘దిమాష్’ కనాతులీ కుడైబెర్గెన్ పాప్, క్లాసికల్ క్రాస్‌ఓవర్ జానపద  ఒపెరాటిక్ పాప్ సంగీతంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన, ప్రతిభావంతులైన సంగీత కళాకారుడు. దిమాష్ అందించిన  సంగీతం తూర్పు యూరప్ మరియు ఆసియా అంతటా ప్రసిద్ధి చెందింది.  కజాఖ్స్తాన్ ( దిమాష్ మాతృదేశం ), చైనా , రష్యాతో సహా 120కి పైగా దేశాలలో దిమాష్ అభిమానులు ఉన్నారు . ఆరు అష్ట పదులు పలికించగల స్వరం కలిగి ఉన్న  దిమాష్ ప్రేక్షకుల అభిమానానికి కారణమని చెబుతారు. 

 

కిర్గిజ్స్తాన్

గుల్బరా టోలోముషోవా

చిత్ర నిర్మాత, విశ్లేషకురాలు

తన కథనాల ద్వారా అవార్డు గెలుచుకున్న చిత్రనిర్మాత మరియు సినీ విమర్శకురాలు గుల్బరా తోలోముషోవా. అనేక అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో గుల్బరా తోలోముషోవా జ్యూరీ సభ్యురాలుగా వ్యవహరించారు. . ది ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్, నెట్‌వర్క్ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ ఏషియన్ సినిమాలో ఆమె సభ్యురాలుగా ఉన్నారు . ఆమె కిర్గిజ్స్తాన్  సాంస్కృతిక, పర్యాటక మంత్రిత్వ శాఖలో సినిమాటోగ్రఫీ విభాగంలో ప్రముఖ నిపుణునిగా గుర్తింపు పొందారు. సినిమా రంగానికి అందించిన సేవలకు గుర్తింపుగా ఆమె దేశ, విదేశాలలో గౌరవాలను అందుకుంది.

 

రష్యా

 

 ఇవాన్ కుద్రియవ్ట్సేవ్

సినిమా నిర్మాత  జర్నలిస్ట్

ఇవాన్ కుద్రియావ్ట్సేవ్ ఒక ప్రసిద్ధ పాత్రికేయుడు, నిర్మాత. మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్  ఎంపిక కమిటీ ఛైర్మన్గా, ది నేషనల్ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ సభ్యునిగా ఇవాన్ కుద్రియావ్ట్సేవ్ వ్యవహరించారు.ఒక సినిమాటీవీ ఛానెల్‌ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా ఇవాన్ కుద్రియావ్ట్సేవ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు రష్యా క చలనచిత్ర మార్కెట్‌లో నిపుణుడుగా గుర్తింపు పొందిన ఇవాన్ కుద్రియావ్ట్సేవ్ నిపుణుల మండలి అధ్యక్షునిగా పనిచేస్తున్నారు. 2009 నుంచి ఇవాన్ రష్యా  ప్రధాన న్యూస్ టీవీ ఛానెల్ రష్యా 24 లో వారానికోసారి ఫిల్మ్ ఇండస్ట్రీ న్యూస్ షో అయిన ‘ఇండస్ట్రియా కినో’వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

 

తజికిస్తాన్

 

 మెహ్మద్‌సైద్ షోహియోన్

సినిమా నిర్మాత, నటుడు, రచయిత

మెహ్మద్‌సైద్ షోహియోన్ ప్రముఖ నటుడు, నిర్మాత మరియు రచయిత.  30 సంవత్సరాలుగా సంస్కృతి, రంగస్థల రంగంలో మెహ్మద్‌సైద్ షోహియోన్ పనిచేస్తున్నారు. వాటర్ బాయ్ (2021), ఫార్చ్యూన్ (2022), బచాయ్ హోబి (2020) వంటి చిత్రాలతో సినిమా, థియేటర్ మరియు నిర్మాణ రంగంలో 25 కంటే ఎక్కువ సినిమాలు, అనేక ప్రచురణలకు గుర్తింపు పొందారు. రిపబ్లిక్ ఆఫ్ తజికిస్తాన్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖలో మొదటి డిప్యూటీ మంత్రిగా పనిచేసిన మెహ్మద్‌సైద్ షోహియోన్ టెలివిజన్ మరియు రేడియో బ్రాడ్‌కాస్టింగ్ కమిటీ ఛైర్మన్ మరియు ప్రస్తుతం స్టేట్ ఎంటర్‌ప్రైజ్, టోజిక్‌ఫిల్మ్ డైరెక్టర్‌గా ఉన్నారు.

ఉజ్బెకిస్తాన్

 

మత్యకుబ్ సదుల్లయేవిచ్ మచ్చనోవ్

నటుడు 'గౌరవనీయ ఆర్టిస్ట్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్' (2001), ఆర్డర్ ఆఫ్ 'ఫ్రెండ్‌షిప్ (డస్ట్లిక్) (2012), 'ఫర్ డిస్టింగ్విష్డ్ లేబర్' (2021) గౌరవ బిరుదు పొందిన విశిష్ట నటుడు మత్యకుబ్ సదుల్లయేవిచ్ మచ్చనోవ్ .  1977లో స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్ అండ్ కల్చర్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్ నుండి  మత్యకుబ్ సదుల్లయేవిచ్ మచ్చనోవ్ పట్టభద్రుడయ్యాడు. డాడీస్ డాటర్, హోలీ సిన్నర్, నైట్ విజిటర్, డెలానీ మైసారా, సాతాన్ ఏంజిల్స్ వంటి నిర్మాణాలలో ప్రధాన పాత్రలు పోషించిన మత్యకుబ్ సదుల్లయేవిచ్ మచ్చనోవ్ నాటక రంగంలో నటుడిగాతన నట జీవితాన్ని ప్రారంభించారు. ది యూత్ ఆఫ్ జీనియస్, ది అవేకనింగ్ వంటి చిత్రాలలో నటించాడు.

ఎస్సిఓ గురించి

  బహుపాక్షిక సంస్థగా   2001 జూన్ 15 న ప్రారంభమయింది. ఎస్సిఓ లో ప్రస్తుతం ఎనిమిది సభ్య దేశాలు (చైనా, ఇండియా, కజకిస్తాన్, కిర్గిజ్స్తాన్, రష్యా, పాకిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్), మూడు పరిశీలక దేశాలు (బెలారస్, ఇరాన్ , మంగోలియా)  పద్నాలుగు చర్చా భాగస్వామ్య దేశాలు (అర్మేనియా, అజర్‌బైజాన్, కంబోడియా, నేపాల్, శ్రీలంక, ఈజిప్ట్, సౌదీ అరేబియా, ఖతార్, బహ్రెయిన్, కువైట్, మాల్దీవులు, మయన్మార్, యూఏఈ, టర్కీ) ఉన్నాయి.




(Release ID: 1893162) Visitor Counter : 241