ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

జీ20 ఇండియా హెల్త్ ట్రాక్


మొదటి హెల్త్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్‌లో మెడికల్ వాల్యూ ట్రావెల్‌పై జరిగిన సైడ్ ఈవెంట్ వాల్యూ-బేస్డ్ హెల్త్‌కేర్ ద్వారా యూనివర్సల్ హెల్త్ కవరేజీని ఇంటిగ్రేటెడ్ హెల్త్‌కేర్ ఎలా సాధించగలదో హైలైట్ చేసింది

ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో అసమానతలను పరిష్కరించడానికి ఆదర్శవంతమైన ఆరోగ్య సంరక్షణ కోసం వైద్య విలువ ప్రయాణం ఒక ముఖ్యమైన భాగం: వైద్య రాజేష్ కోటేచా

"అందుబాటులో సరసమైన మరియు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ కోసం ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించడానికి నాలేడ్జ్‌ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి బహుపాక్షిక సహకారాలు ఉపయోగపడతాయి"

Posted On: 20 JAN 2023 1:41PM by PIB Hyderabad

కేరళలోని తిరువనంతపురంలో  జి20 ఇండియా ప్రెసిడెన్సీ మొదటి హెల్త్ వర్కింగ్ గ్రూప్ మూడో రోజున మెడికల్ వాల్యూ ట్రావెల్‌పై జరిగిన సైడ్ ఈవెంట్‌లో ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కొటేచా  కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన "ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల్లో అసమానతలను పరిష్కరించడానికి మరియు ఆదర్శవంతమైన ఆరోగ్య సంరక్షణకు వైద్య విలువ ప్రయాణం ఒక ముఖ్యమైన భాగం" అని తెలిపారు. కార్యక్రమంలో నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వి కె పాల్ మరియు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్ కూడా పాల్గొన్నారు.

 

image.png


మహమ్మారి చూపిన తీవ్ర ప్రభావంపై వైద్య రాజేష్ కోటేచా మాట్లాడుతూ దేశ  ఆర్థిక భద్రతపై ఆరోగ్యం గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని అందువల్ల ఆధునిక వైద్యంతో పాటు సాంప్రదాయ వైద్య పద్ధతులను ఏకీకృతం చేయడానికి మన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సమగ్ర ఆరోగ్య సంరక్షణ  ప్రాముఖ్యతను ఆయన మరింత హైలైట్ చేశారు "ఇది రోగి కేంద్రీకృత విధానంపై సమగ్రంగా దృష్టి సారించి ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇది విలువ ఆధారిత ఆరోగ్య సంరక్షణ ద్వారా సార్వత్రిక ఆరోగ్య కవరేజీని సాధించాలని ఆకాంక్షిస్తుంది”. అని తెలిపారు.

 

image.png


'ఒకే ప్రపంచం, ఒకే ఆరోగ్యం' అనే భావనపై వైద్య రాజేష్ కోటేచా మాట్లాడుతూ "విజ్ఞానాన్ని పంచుకోవడానికి మరియు అందుబాటులో ఉండే సరసమైన మరియు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ కోసం ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించడానికి బహుపాక్షిక సహకారాలు తప్పనిసరి" అని ఉద్ఘాటించారు. సమగ్ర ఆరోగ్య సంరక్షణపై ఆధారపడిన వైద్య విలువ ప్రయాణం ద్వారా ప్రపంచాన్ని అనుసంధానించడం ప్రస్తుత ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల  అసమానతలను పరిష్కరించడానికి ఉపయోగపడుతుందని ఆయన వివరించారు.

 

image.png


ప్యానెలిస్ట్‌లచే నిర్వహించబడిన కీలకమైన జోక్యాలు మరియు వివరణాత్మక చర్చలు సాంప్రదాయ ఆరోగ్య సేవల యొక్క ప్రోత్సాహక మరియు నివారణ చర్యలు మరియు వైద్యం చేయడంలో దాని శక్తి గురించి చర్చించాయి. సాంప్రదాయ వైద్యం పద్ధతులతో ఆధునిక వైద్యం కలయిక వ్యాధికి చికిత్స చేయడమే కాకుండా శరీరాన్ని సంపూర్ణంగా నయం చేయడంలో విపరీతంగా శక్తివంతమైనదని ఏకగ్రీవంగా అంగీకరించబడింది. సమీకృత ఆరోగ్య సంరక్షణ ప్రస్తుత ఆవశ్యకమని మరియు ఆరోగ్య సంరక్షణ రంగం యొక్క బలమైన, అధిక విలువ కలిగిన అధిక వృద్ధి విభాగంగా మారడానికి సిద్ధంగా ఉందని ప్రతినిధులు సూచించారు. ప్రపంచవ్యాప్తంగా విలువ ఆధారిత ఆరోగ్య సంరక్షణ సేవలకు సమానమైన ప్రాప్యతను ప్రారంభించడం ద్వారా సార్వత్రిక ఆరోగ్య కవరేజీని సాధించడానికి ఇది ఒక మాధ్యమాన్ని అందిస్తుందని అభిప్రాయపడ్డారు. ప్యానెలిస్ట్‌లు ఈ ప్రెసిడెన్సీలో మెడికల్ ట్రావెల్ టూరిజంలో ఊపందుకోవడం కోసం సమిష్టిగా రూపొందించడానికి మరియు నాలెడ్జ్ మరియు ఆస్తులను ఉపయోగించుకోవడానికి ఆసక్తిని కనబరిచారు.

ఈ కార్యక్రమంలో  శ్రీ లవ్ అగర్వాల్, అదనపు కార్యదర్శి (ఎంఒహెచ్‌ఎఫ్‌డబ్ల్యూ), శ్రీ విశాల్ చౌహాన్, జాయింట్ సెక్రటరీ (ఎంఒహెచ్‌ఎఫ్‌డబ్ల్యూ)తో పాటు కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు ఈ  పాల్గొన్నారు. అలాగే అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఇండోనేషియా, జపాన్, మెక్సికో, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, తుర్కియా, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూరోపియన్ యూనియన్‌లు ప్రతినిధులు కార్యక్రమానికి హాజరయ్యారు. బంగ్లాదేశ్, ఈజిప్ట్, మారిషస్, నైజీరియా, సింగపూర్, స్పెయిన్, సుల్తానేట్ ఆఫ్ ఒమన్, నెదర్లాండ్స్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి ప్రత్యేక ఆహ్వానిత దేశాలు పాల్గొన్నాయి. ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్, ఆఫ్రికన్ యూనియన్ -ఏయూ,ఏసియన్, బిఎంజీఎఫ్, సిఈపిఐ, కామన్వెల్త్,ఎఫ్‌ఏఓ, జీ20 ఇన్నోవేషన్ హబ్,గావి, గ్లోబల్ ఏఎంఆర్ ఆర్ అండ్ డి హబ్,ఓఈసిడి, రాక్‌ఫెల్లర్ ఫౌండేషన్,స్టాప్‌ టీబీ-పార్ట్‌నర్‌షిప్, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్, వెల్‌కమ్ ట్రస్ట్, డబ్ల్యూహెచ్‌ఓ, వరల్డ్‌ బ్యాంక్,యూనిసెఫ్, యూఎన్‌ఈపీ మొదలైన అంతర్జాతీయ సంస్థలు కూడా ఈ సెషన్‌లో
పాల్గొన్నాయి.


 

***



(Release ID: 1892490) Visitor Counter : 274