ప్రధాన మంత్రి కార్యాలయం

కర్నాటకలోని కలబురుగిలో కొత్తగా ప్రకటించిన రెవెన్యూ గ్రామాలలో 50 వేలమంది లబ్ధిదారులకు హకు పత్రాలు పంపిణీ చేసిన ప్రధాని


3000 తండాలు రెవెన్యూ గ్రామాలుగా మారిన సందర్భంగా బంజారాలకు ప్రధాని అభినందనలు

“భగవాన్ బసవేశ్వర ఆదర్శాల స్ఫూర్తితో అందరి సంక్షేమానికి కృషి చేస్తున్నాం”

“దళితులు, బడుగు బలహీన వర్గాలు, గిరిజనులు, దివ్యాంగులు, పిల్లలు, మహిళలు మొదటిసారిగా వేగంగా కనీస సౌకర్యాలు పొందుతున్నారు”

“ప్రజల సాధికారతకు స్పష్టమైన వ్యూహంతో పనిచేస్తున్నాం”

“కనీస సౌకర్యాలు అంది, గౌరవాన్ని పునరుద్ధరిస్తే కొత్త ఆకాంక్షలు పుట్టుకొచ్చి రోజువారీ అవసరాలనుంచి ప్రజలు బైటికొస్తారు “

“జన్ ధన్ యోజన ఆర్థిక సమ్మిళితిని విప్లవాత్మకం చేసింది”

“డబుల్ ఇంజన్ ప్రభుత్వం దేశంలో ప్రతి సమాజపు సంప్రదాయం, సంస్కృతి, ఆహారం, దుస్తులను బలంగా పరిగణనలోకి తీసుకుంటుంది”

Posted On: 19 JAN 2023 4:22PM by PIB Hyderabad

కర్ణాటకలో కొత్తగా ప్రకటించిన రెవెన్యూ గ్రామాలలో అర్హులైన లబ్ధిదారులకు ప్రధాని నరేంద్ర మోదీ హక్కు పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సభ నుద్దేశించి ప్రసంగిస్తూ, జనవరిలో రాజ్యాంగం అమలులోకి వచ్చిందని, అదే పవిత్రమైన జనవరిలో కర్ణాటక ప్రభుత్వం సామాజిక న్యాయం కోసం కీలకమైన అడుగు ముందుకేసిందని ప్రధాని అన్నారు. ఇది బంజారాలకు చాలా ఆనందం కలిగించే సమయమని, 50 వేల కుటుంబాలకు భూమి హక్కు పత్రాలు లభించాయని గుర్తు చేశారు. దీనివలన కలబురుగి, యాదగీర్, రాయచూర్, బీదర్, విజయపురా జిల్లాల్లోని తండాలలో నివసించే వారి పిల్లలకు ఉజ్జ్వల భవిష్యత్తు ఉంటుందంటూ బంజారాలకు అభినందనలు తెలియజేశారు.

 

మూడు వేలకు పైగా తండాలను రెవెన్యూ గ్రామాలుగా ప్రకటించాలన్న కర్ణాటక ప్రభుత్వ కీలక నిర్ణయాన్ని మెచ్చుకుంటూ, ముఖ్యమంత్రి శ్రీ బసవరాజ్ బొమ్మైని, ఆయన బృందాన్ని ప్రధాని అభినందించారు. ఈ ప్రాంతంతోనూ, బంజారాలతోనూ తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, వీరు దేశాభివృద్దికి ఎంతగానో కృషి చేశారన్నారు. 1994 శాసన సభ ఎన్నికల సందర్భంగా తన కార్యక్రమానికి లక్షలాది మంది బంజారాలు రాలీగా వచ్చిన సందర్భం మరువలేనిదన్నారు. తల్లులూ, అక్క చెల్లెళ్ళూ తమ సంప్రదాయ దుస్తుల్లో వచ్చి ఆశీస్సులు అందించారన్నారు.

 

భగవాన్ బసవేశ్వర చూపిన బాటలో డబుల్-ఇంజన్ ప్రభుత్వం సుపరిపాలన మార్గాన్ని అనుసరిస్తున్నదని ప్రధాని చెప్పారు. ఆయన ఆదర్శాలతో స్ఫూర్తి పొంది అందరి సంక్షేమానికి కృషి చేస్తున్నామన్నారు. అనుభవ మండపం లాంటి వేదికల ద్వారా ప్రజాస్వామ్య నమూనాను, సామాజిక న్యాయాన్ని ఎలా అందించారో ప్రదశాని గుర్తు చేసుకున్నారు. అన్నీ రకాల వివక్షను పక్కనబెట్టి అందరి సాధికారతకు ఆయన ఒక మార్గం చూపారని ప్రధాని అన్నారు.

 

బంజారాలు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని, అయితే ఇప్పుడు హాయిగా, గౌరవంతో జీవించే సమయం వచ్చిందని ప్రధాని అన్నారు. బంజారా యువతకు స్కాలర్ షిప్పులు, జీవనోపాధి కల్పించటం, పక్కా ఇళ్ళ నిర్మాణం లాంటి చర్యలను ఆయన ప్రస్తావించారు. సంచార జీవనశైలి వలన వస్తున్న సమస్యలను కూడా పరిష్కరిస్తున్నామన్నారు. ఇప్పుడు తీసుకుంటున్న చర్యలు 1993 నాటి సిఫార్సుల ఫలితమని, వోట్ బ్యాంక్ రాజకీయాలవల్లనే ఆలస్యమైనట్టు ఆరోపించారు. అలాంటి వాతావరణం ఇప్పుడు లేదని ప్రధాని అన్నారు.

 

బంజారా తల్లులకు విజ్ఞప్తి చేస్తూ, “ బాధపడకండి. ఢిల్లీలో ఉన్న మీ కొడుకు మీ సమస్యలు గమనిస్తున్నాడు.” అన్నారు. తండాలకు రెవెన్యూ గ్రామాల స్థాయి రావటం వలన కనీస సౌకర్యాలు మెరుగుపడతాయని, స్వేచ్ఛగా జీవించే అవకాశం ఏర్పడుతుందని, హక్కు పత్రాల వలన బాంకుల నుంచి రుణాలు పొందే వీలు కలుగుతుందని ధైర్యం చెప్పారు. కేంద్ర ప్రభుత్వం స్వామిత్వ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ళకు ఆస్తి కార్డులు పంపిణీ చేస్తోందని, కర్ణాటకలోని బంజారాలు కూడా ఆ పథకం వలన లబ్ధి పొందుతారని చెప్పారు. పిఎం ఆవాస్ యోజన ద్వారా పక్కా ఇళ్ళు, మరుగుదొడ్లు, విద్యుత్ కనెక్షన్లు, కుళాయి నీరు, గ్యాస్ కనెక్షన్లు పొందుతారన్నారు. ఈ పథకాలన్నీటినీ బంజారాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. “మురికివాడల్లో నివసించటమన్నది ఒకప్పటి మాట” అని ప్రధాని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.  

ఆవాసాల ను కొత్త రెవెన్యూ గ్రామాలు గా గుర్తించి ప్రకటించారు. ఇవి కలబురగి, యాద్ గీర్, రాయచూర్, బీదర్, విజయపుర జిల్లాల లో ఉన్నాయి. కలబురగి జిల్లా, సేదం తాలూకా, మాల్ ఖేడ్ గ్రామం లో, కొత్త గా ప్రకటించిన రెవిన్యూ గ్రామాల లో అర్హులైన లబ్ధిదారుల కు హక్కు పత్రాల ను (టైటిల్ డీడ్స్ ) ప్రధాన మంత్రి అందజేశారు. హక్కు పత్రాలు అందుకొన్న యాభై వేల మంది కి పైగా లబ్ధిదారుల లో ఎస్ సి, ఎస్ టి, ఒబిసి లకు చెందిన పేద, బలహీన వర్గాల వారే లో ఎక్కువ గా ఉన్నారు. ఇది వారి భూమికి ఒక విధం గా ప్రభుత్వం వైపు నుండి లాంఛన పూర్వకమైన గుర్తింపు ను అందజేయడం వంటిదే అని చెప్పాలి. దీనివల్ల త్రాగునీరు, విద్యుత్తు, రహదారులు మొదలైన ప్రభుత్వ సేవలను అందుకోవడానికి వారికి అర్హత లభిస్తుంది.

 

 

 

***



(Release ID: 1892344) Visitor Counter : 167