బొగ్గు మంత్రిత్వ శాఖ
2023-24 సంవత్సరానికి మొత్తం ఉత్పత్తి లక్ష్యాలను సమీక్షించిన బొగ్గు మంత్రిత్వ శాఖ
2023-24లో ఒక బిలియన్ టన్నులను ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యం
ఏడాదికి ఒక మిలియన్ టన్నులకు పైగా ఉత్పత్తి చేస్తున్న సిఐఎల్‌కు చెందిన 97 బొగ్గు గనులు
Posted On:
18 JAN 2023 3:48PM by PIB Hyderabad
ప్రస్తుత సంవత్సరమైన 2023-24లో ఒక బిలియన్ టన్నుల (బిటి) బొగ్గును ఉత్పత్తి చేయాలని బొగ్గు మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు, అన్ని బొగ్గు కంపెనీలతో బొగ్గు శాఖ కార్యదర్శి లోతైన సమీక్ష జరిపారు. ఈ క్రమంలో సిఐఎల్‌కు 780 మిలియన్ టన్నులను(ఎంటి) లక్ష్యాన్ని, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌కు 75 ఎంటీలను, కాప్టివ్ (స్వంత వినియోగం కోసం ఉత్పత్తి చేసే), వాణిజ్య గనులకు 162 ఎంటీలను లక్ష్యంగా నిర్ణయించారు. సిఐఎల్‌లో మొత్తం 290 గనులు పని చేస్తుండగా, అందులో 97 గనులు ఏడాదికి ఒక ఎంటీ కన్నా ఎక్కువ ఉత్పత్తి చేస్తాయి.
అటువంటి 97 బొగ్గు గనులకు భూసేకరణ, అటవీ, పర్యావరణ అనుమతులు, రైలు, రోడ్డు అనుసంధానం గురించి చర్చించి, కాలక్రమాన్ని నిర్ధారించారు. బొగ్గు కంపెనీల నిరంతర కృషి వల్ల 97 బొగ్గు గనులలో, 56 గనులకు ఎటువంటి సమస్యలు లేవు. కేవలం 41 గనులకు 61 సమస్యలు ఉన్నాయి. వీటి పరిష్కారం కోసం బొగ్గు కంపెనీల అగ్ర నాయకత్వం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కేంద్ర మంత్రిత్వ శాఖలను కలుపుకొని, పర్యవేక్షణను జరుపుతున్నారు.
సిఐఎల్ 2021-22లో 622 ఎంటీలను ఉత్పత్తి చేయగా, 2022-23కు 16% పెరుగుదలను నమోదు చేసి, ఇప్పటివరకూ 513 ఎంటీలను ఉత్పత్తి చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నిర్ధారించి 700 ఎంటీల లక్ష్యాన్ని సిఐఎల్ దాటి, 2023-24 సంవత్సరంలో 780 ఎంటీలను సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.
***
(Release ID: 1892110)
Visitor Counter : 215