హోం మంత్రిత్వ శాఖ
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోనిఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనేది 75 సంవత్సరాల స్వాతంత్య్రాన్ని, భారతదేశ ప్రజల సుసంపన్నమైనచరిత్రను, సంస్కృlతిని, విజయాలను ఉత్సవంగాజరుపుకోవడానికి , స్మరించుకోవడానికి భారత ప్రభుత్వం తీసుకున్న ఒక చొరవ.
కేంద్ర హోం, సహకార శాఖలమంత్రి శ్రీ అమిత్ షామార్గదర్శకత్వంలో హోం మంత్రిత్వ శాఖ భారతదేశానికి 75 సంవత్సరాల స్వాతంత్ర్యం , నేతాజీసుభాష్ చంద్రబోస్ 126 వ జయంతిని పురస్కరించుకుని 2023 జనవరి 17 నుండి 23 వరకు ఆజాదీకా అమృత్ మహోత్సవ్ ఐకానిక్ ఈవెంట్స్ వీక్ ను నిర్వహిస్తుంది.
2023 జనవరి 23న అండమాన్ నికోబార్ దీవుల్లోనిపోర్ట్ బ్లెయిర్ లో జరిగే భారీ ముగింపు కార్యక్రమానికి శ్రీ అమిత్ షా ముఖ్య అతిథిగాహాజరవుతారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 75వ స్వాతంత్ర్యదినోత్స వం సందర్భంగా చేసిన ప్రసంగంలో భారతీయులందరూ తమసంస్కృతి, , వారసత్వం గురించి గర్వించాలనిపిలుపునిచ్చారు.
అపూర్వ ధైర్యసాహసాలు, పరాక్రమం, త్యాగం, తపస్సు,యుద్ధాలు, మన వీరుల విజయాల కథలతో నిండిన ఘనమైన, మహిమాన్వితమైన చరిత్ర భారతదేశానికిఉంది.
భారతమాత గొప్ప పుత్రులలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ఒకరు, స్వాతంత్ర్యోద్యమంలో ఆయన చేసిన కృషి తరతరాలుగా భారతీయులకు స్ఫూర్తినిచ్చి, దేశప్రజల్లోగర్వించదగ్గ భావాన్ని పెంపొందించింది.
మణిపూర్, నాగాలాండ్, గుజరాత్, ఒడిశా, పశ్చిమబెంగాల్,అండమాన్ నికోబార్ దీవుల్లోని నేతాజీ జీవితం, కృషికి సంబంధించిన ప్రాంతాల్లో ఐకా
Posted On:
16 JAN 2023 6:39PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనేది 75 సంవత్సరాల స్వాతంత్య్రాన్ని, భారతదేశ ప్రజల సుసంపన్నమైన చరిత్రను, సంస్కృlతిని, విజయాలను ఉత్సవంగా జరుపుకోవడానికి , స్మరించుకోవడానికి భారత ప్రభుత్వం తీసుకున్న ఒక చొరవ.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 75వ స్వాతంత్ర్య దినోత్స వం సందర్భంగా చేసిన ప్రసంగంలో భారతీయులందరూ
తమసంస్కృతి, , వారసత్వం గురించి గర్వించాలని పిలుపునిచ్చారు.
అపూర్వ ధైర్యసాహసాలు, పరాక్రమం, త్యాగం, తపస్సు, యుద్ధాలు, మన వీరుల విజయాల కథలతో నిండిన ఘనమైన, మహిమాన్వితమైన చరిత్ర భారతదేశానికి ఉంది. భారతమాత గొప్ప పుత్రుల్లో ఒకరైన నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వాతంత్ర్యోద్యమంలో తరతరాలుగా భారతీయులకు స్ఫూర్తినిచ్చి దేశప్రజల్లో ఆత్మ విశ్వాస భావాన్ని పెంపొందించారు.
కేంద్ర హోం, సహకార శాఖలమంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో హోం మంత్రిత్వ శాఖ భారతదేశానికి 75 సంవత్సరాల స్వాతంత్ర్యం , నేతాజీ సుభాష్ చంద్రబోస్ 126 వ జయంతిని పురస్కరించుకుని 2023 జనవరి 17 నుండి 23 వరకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఐకానిక్ ఈవెంట్స్ వీక్ ను
నిర్వహిస్తోంది.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితం, స్వాతంత్య్ర ఉద్యమంలో ఆయన చేసిన కృషి ఇతివృత్తంగా ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అండమాన్ నికోబార్ దీవుల్లోని పోర్ట్ బ్లెయిర్ లో 2023 జనవరి 23న జరిగే భారీ ముగింపు కార్యక్రమానికి కేంద్రహోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, కేంద్ర పోలీసు సంస్థలు, అండమాన్ నికోబార్ దీవుల పాలనాయంత్రాంగాలు , మణిపూర్, నాగాలాండ్, గుజరాత్, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నేతాజీ జీవితం, పనికి సంబంధించిన ప్రదేశాల్లో ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
మణిపూర్ లో జనవరి 17న మంత్రిపుఖ్రి, కీతల్మన్బీ, కంగ్వాయి, మొయిరంగ్, నాంబోల్ లో, 18న నాగాలాండ్ లోని రుజాజో, చెసెజు గ్రామాల్లో, జనవరి 19న గుజరాత్ లోని హరిపురా, బార్డోలీ, సూరత్ లలో, జనవరి 20న ఒడిశా లోని కటక్ లో, 21న పశ్చిమబెంగాల్ లోని
కోల్ కతాలో పోటీలు జరగనున్నాయి.
భారత స్వాతంత్ర్య సంగ్రామంలో నేతాజీ చేసిన ఎనలేని కృషిని స్మరించుకునే కార్యక్రమాలను ఈ ప్రాంతాల్లో మొత్తం వారమంతా నిర్వహించేలా ప్రణాళికరూపొందించారు. .
జన్ భాగీదారీ స్ఫూర్తితో అన్ని కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించేలా, పౌరులు మన జాతీయ వీరుల నుంచి స్ఫూర్తి పొంది, వారు నిలబడిన గొప్ప ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లేలా కార్యక్రమాలను రూపొందించారు.
అండమాన్ నికోబార్ దీవుల్లోని పోర్ట్ బ్లెయిర్ లో భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందే 31.12.1943న నేతాజీ తొలిసారి భారత గడ్డపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
భారత స్వాతంత్ర్య పోరాటంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితం, చేసిన కృషిని తెలియజేసే కార్యక్రమం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చేపట్టిన ఐకానిక్ ఈవెంట్స్ వీక్. ఇది ఆయన ఉన్నత ఆదర్శాల స్మృతి, మన స్వాతంత్ర్య సమరయోధుల జీవితాల నుండి దేశం మొత్తం ప్రేరణ పొందాల్సిన క్షణం.
*****
(Release ID: 1891758)
Visitor Counter : 222