హోం మంత్రిత్వ శాఖ
తిరువళ్లువర్ దినోత్సవం సందర్భంగా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా
తిరువళ్లువర్ బోధించిన జ్ఞానం, జీవిత పాఠాలు శతాబ్దాలుగా ధర్మబద్ధమైన జీవితానికి మార్గనిర్దేశం చేశాయన్న అమిత్ షా
తిరువళ్లువర్ దినోత్సవం, ఆయన రచనలు చదవాలనే ఆసక్తిని దేశవ్యాప్తంగా యువతలో రగిలించాలని ఆకాంక్షించిన శ్రీ అమిత్ షా
నాడు పోస్టు చేయడమైనది:
16 JAN 2023 1:34PM by PIB Hyderabad
తిరువళ్లువర్ దినోత్సవం సందర్భంగా, కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తిరువళ్లువర్ బోధించిన జ్ఞానం, జీవిత పాఠాలు శతాబ్దాలుగా ధర్మబద్ధమైన జీవితానికి మార్గనిర్దేశం చేశాయని శ్రీ అమిత్ షా తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఆయన రచనలు చదవాలనే ఆసక్తిని దేశవ్యాప్తంగా యువతలో తిరువళ్లువర్ దినోత్సవం రగిలించాలని అమిత్ షా ఆకాంక్షించారు.
****
(రిలీజ్ ఐడి: 1891718)
సందర్శకుల సూచీ సంఖ్య : : 236