రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
రహదారి భద్రతను మెరుగుపరచేలా
ఇంజినీరింగ్ చర్యలను పెంపొందించేందుకు శిక్షణపై ఎన్.హెచ్.ఎ.ఐ. దృష్టి
Posted On:
16 JAN 2023 4:17PM by PIB Hyderabad
2023 జనవరి 11 నుండి 17 వరకు నిర్వహించబడుతున్న ‘రహదారి భద్రత వారోత్సవం’ కింద.. రోడ్డు భద్రత గురించి అవగాహన కల్పించడంపై భారత జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ (ఎన్.హెచ్.ఎ.ఐ) దృష్టి సారిస్తోంది. రోడ్లపై భద్రతను మెరుగుపరిచేందుకు ఇంజినీరింగ్ చర్యలను మెరుగుపరచడానికి గాను రహదారి భద్రత ఆడిట్‌లో ఎన్.హెచ్.ఎ.ఐ ఇంజనీర్లకు శిక్షణ ఇవ్వడానికి కూడా అధికార యంత్రాంగం చాలా ప్రాధాన్యతనిస్తోంది. ఎన్.హెచ్.ఎ.ఐ సంస్థ తన ఇంజనీర్లకు 15 రోజుల రోడ్ సేఫ్టీ ఆడిట్ శిక్షణను అందిస్తోంది. ఇంజనీర్లను మేనేజర్లు, డిప్యూటీ జనరల్ మేనేజర్ల పోస్టులకు పదోన్నతి ఇచ్చేందుకు ఈ శిక్షణ పూర్తి చేయడాన్ని సంస్థ కీలక ప్రమాణంగా మార్చింది. 2022-23 సంవత్సరంలో సంస్థ దాదాపు 240 మంది ఇంజనీర్లకు ఐఐటీ ఢిల్లీ, సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, ఇండియన్ అకాడమీ ఆఫ్ హైవే ఇంజనీర్స్‌లో శిక్షణ పొందారు. అంతే కాకుండా.. ఎన్.హెచ్.ఎ.ఐ కూడా హైవేలను సురక్షితంగా మలిచేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తరించడానికి ప్రాధాన్యతనిస్తోంది. జాతీయ రహదారులు మరియు ఎక్స్‌ప్రెస్‌వేలలో రోడ్డు ప్రమాదాల సంఘటనల నిర్వహణ మరియు హైవేలపై వేగ పరిమితి మరియు ఇతర నిబంధనల అమలు కోసం అడ్వాన్స్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఏటీఎంఎస్) అమలు చేయబడుతోంది. దాదాపు 3,000 కి.మీ. మేర జాతీయ రహదారులలో ఏటీఎంఎస్నఇప్పటికే అమలు చేయబడింది. ఢిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌వే వంటి అమలులో ఉన్న ప్రాజెక్టులలో కూడా ఏటీఎంఎస్ వ్యవసథ అమర్చబడుతోంది. హైవేలపై భద్రతా సమస్యలను గుర్తించడం కోసం డ్రోన్ వీడియోలు మరియు నెట్‌వర్క్ సర్వే వెహికల్ డేటాను విశ్లేషించడానికి గాను జీఐఎస్ సాంకేతికతను ఉపయోగించడానికి కూడా ఎన్.హెచ్.ఎ.ఐ యోచిస్తోంది. అందరికీ సురక్షితమైన రోడ్లు అనే అంశాన్ని ప్రచారం చేయడానికి, 2023 జనవరి 11 నుండి 17 వరకు 'రోడ్డు భద్రతా వారోత్సవాలు' నిర్వహించబడుతున్నాయి. ఈ వారంలో, సాధారణ ప్రజలకు రోడ్ల భ్రదతపై అవగాహన కల్పించడానికి మరియు అందరికీ భద్రత విషయంలో అవకాశం కల్పించడానికి దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. రోడ్డు భద్రత కోసం వాటాదారులు సహకరించాలి అని వివరించేలా దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఇందులో భాగంగా రోడ్డు ప్రమాదాల కారణాలు , వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించిన వివిధ అవగాహనకల్పన కార్యక్రమాలు ఉన్నాయి.
********
(Release ID: 1891715)
Visitor Counter : 460