ప్రధాన మంత్రి కార్యాలయం

అగ్నవీరుల ఒకటో దళాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి


మార్గదర్శకమైనటువంటి అగ్నిపథ్ పథకం లో అగ్రగాములు గా నిలచినందుకుఅగ్నివీరుల కు అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి

ఈ పరివర్తనకారి విధానం మన సాయుధ దళాల ను పటిష్ట పరచడం లోను, వారి ని రాబోయే కాలాని కై సన్నద్ధం చేయడం లోను ఒక ‘గేమ్చేంజర్’ గా నిరూపణ కాగలదు అని ప్రముఖం గా ప్రకటించిన ప్రధాన మంత్రి

మన సాయుధ దళాల ను ఆధునికీకరించడం తో పాటుగా ఆత్మనిర్భర్ గా తీర్చిదిద్దేందుకు కృషిజరుగుతున్నది: ప్రధాన మంత్రి

కాంటాక్ట్ లెస్ వార్ ఫేర్ తాలూకు కొత్త రంగాల సవాళ్ళ ను గురించి చర్చిస్తూ, సాంకేతికం గా సమర్ధత కలిగిన సైనికులుమన సాయుధ దళాల లో కీలకమైన పాత్ర ను పోషిస్తారని పేర్కొన్న ప్రధాన మంత్రి

అగ్నిపథ్ పథకం ఏ విధం గా మహిళల ను సైతం సశక్తులను చేయగలదో ప్రస్తావిస్తూ, త్రివిధ దళాల లో మహిళా అగ్నివీర్ ల చేరిక ను చూడాలని తాను ఉత్సుకత తో ఉన్నట్లు తెలిపినప్రధాన మంత్రి

విభిన్న భాషల ను గురించి మరియు సంస్కృతులగురించి మరిన్ని విషయాల ను తెలుసుకోవడాని కి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలంటూఅగ్నివీరుల కు సూచించిన ప్రధాన మంత్రి 

Posted On: 16 JAN 2023 12:37PM by PIB Hyderabad

త్రి విధ దళాల లో మౌలిక శిక్షణ ను మొదలు పెట్టిన అగ్నివీరుల ఒకటో దళాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యం ద్వారా ఈ రోజు న ప్రసంగించారు.

ఈ మార్గదర్శకమైనటువంటి అగ్నిపథ్ పథకం లో వారు అగ్రగాములు గా నిలచారంటూ వారి కి ప్రధాన మంత్రి అభినందనల ను తెలియ జేశారు. మన సాయుధ దళాల ను పటిష్ట పరచి, మునుముందు సవాళ్ళ కోసం వారిని సన్నద్ధుల ను చేయడం లో ఈ పరివర్తనకారి విధానం ఒక గేమ్ చేంజర్ కాగలదంటూ ఆయన ప్రముఖం గా ప్రస్తావించారు. యువ అగ్నివీరులు సాయుధ దళాల ను మరింత యవ్వనభరితం గాను మరియు సాంకేతిక ప్రతిభ కలిగినవారు గాను చేయగలరు అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.

అగ్నివీరుల సత్తా ను ప్రధాన మంత్రి కొనియాడుతూ, వారి యొక్క ఉత్సాహం సాయుధ దళాల వీరత్వాని కి అద్దం పడుతోందని, సాయుధ దళాల ధైర్యం మరియు సాహసాలు దేశ పతాకాన్ని ఎల్లప్పుడూ సమున్నతం గా రెపరెపలాడిస్తున్నాయని ఆయన అన్నారు. ఈ అవకాశం ద్వారా వారు సంపాదించుకొనేటటువంటి అనుభవం జీవన పర్యంతం వారికి ఒక గౌరవభరితమైనటువంటి ఆధారం కాగలుగుతుంది అని ఆయన అన్నారు.

న్యూ ఇండియాఒక సరికొత్త ఉత్సాహం తో తొణికిసలాడుతోందని, మన సాయుధ దళాల ను ఆధునికీకరించడం తో పాటుగా స్వయంసమృద్ధం గా మలచడాని కి కృషి జరుగుతోందని ప్రధాన మంత్రి అన్నారు. 21వ శతాబ్దం లో యుద్ధాల లో పోరాడే పద్ధతులు మార్పుల కు లోనవుతున్నాయని ఆయన అన్నారు. కాంటాక్ట్ లెస్ వార్ ఫేర్ తాలూకు సరికొత్త యుద్ధరంగాలు ఉనికి లోకి వస్తున్న సంగతి ని గురించి మరియు సైబర్ వార్ ఫేర్ యొక్క సవాళ్ళ ను గురించి ఆయన చర్చిస్తూ, సాంకేతికం గా పురోగమన పథం లో నిలబడే జవానులు మన సాయుధ దళాల లో కీలకమైన పాత్ర ను పోషించనున్నారన్నారు. ప్రస్తుత తరాని కి చెందిన యువత లో ఈ విధమైనటువంటి సత్తా ఉందని, ఈ కారణం గా అగ్నివీరులు రాబోయే కాలం లో మన సాయుధ దళాల లో మహత్వపూర్ణ భూమిక ను నిర్వర్తించ గలుగుతారని ఆయన అన్నారు.

మహిళల ను ఈ పథకం మరింత సాధికార యుక్తం గా ఎలా మార్చనుందో అనే విషయాన్ని గురించి కూడా ప్రధాన మంత్రి మాట్లాడారు. మహిళా అగ్నివీరులు నౌకా దళాల యొక్క గౌరవాన్ని ఏ విధం గా ఇనుమడింప చేస్తున్నారో అనే అంశం పట్ల ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. త్రి విధ దళాల లో మహిళా అగ్నివీరులు చేరితే చూడాలని తాను చాలా ఆశాభావం తో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. సియాచిన్ లో విధులు నిర్వహిస్తున్న మహిళా జవానుల గురించిన మరియు ఆధునిక పోరాట విమానాల ను నడుపుతున్న మహిళల ను గురించిన ఉదాహరణ లను ప్రధాన మంత్రి చెప్తూ మహిళ లు ఏ విధం గా వేరు వేరు యుద్ధరంగాల లో సాయుధ దళాల కు నేతృత్వం వహిస్తున్నదీ గుర్తు కు తీసుకు వచ్చారు.

విభిన్న ప్రాంతాల లో కర్తవ్య నిర్వహణ అనేది వారి కి వైవిధ్యభరిత అనుభవాన్ని ఆర్జించేందుకు ఒక అవకాశాన్ని ఇస్తుందని, వారు వేరు వేరు భాషల ను గురించి, వేరు వేరు సంస్కృతుల ను గురించి మరియు జీవనాన్ని జీవించేటటువంటి పద్ధతుల ను గురించి కూడాను తెలుసుకొనే ప్రయత్నం చేయాలి అని ఆయన అన్నారు. జట్టు భావన తో శ్రమించడం తో పాటు నాయకత్వ కౌశలం తాలూకు గౌరవం వారి వ్యక్తిత్వానికి ఒక నవీన పార్శ్వాన్ని జత పరుస్తుంది అని ఆయన అన్నారు. అగ్నివీరులు వారికి నచ్చిన రంగం లో వారి యొక్క నైపుణ్యానికి మెరుగులు దిద్దుకొనేందుకు గాను పని చేస్తూనే కొత్త కొత్త విషయాల ను నేర్చుకోవాలనే తపన ను అట్టిపెట్టుకోవాలి అని ఆయన పిలుపునిచ్చారు.

యువత మరియు అగ్నివీరుల యొక్క సామర్థ్యాన్ని ప్రధాన మంత్రి ప్రశంసించారు. ఆయన తన ప్రసంగాన్ని ముగిస్తూ, 21వ శతాబ్దం లో దేశాని కి మీరే నాయకత్వాన్ని అందించబోయేది అన్నారు.

 

 

***



(Release ID: 1891580) Visitor Counter : 192