గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
ప్రధానమంత్రి స్వనిధి పథకం కింద గత రెండు సంవత్సరాలలో రెండు విడతలుగా 40.07 లక్షల రుణాలకు సంబంధించి
5.32 లక్షల మంది లబ్ధిదారులకు పంపిణీ చేసిన మొత్తం రూ 4,606.36 కోట్ల రూపాయలు : శ్రీ హర్దీప్ ఎస్ .పూరి
–– పి.ఎం స్వనిధి కింద వీధి వ్యాపారులు డిజిటల్ లావాదేవీలు సాగించేలా వారికి ఆర్థిక సమ్మిళితత్వంతో
కూడిన ప్లాట్ఫారంను ప్రభుత్వం కల్పిస్తోంది: శ్రీ హర్దీప్ ఎస్.పూరి
––పిఎం స్వనిధి పథకం, 9,326 మంది వీధివ్యాపారులు స్విగ్గి, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ ప్లాట్ఫారంలపై చేరడానికి వీలు కల్పించింది.
––జాతీయ వీధివ్యాపారుల ఆహార ఉత్సవాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ హర్దీప్ ఎస్.పూరి
Posted On:
13 JAN 2023 5:34PM by PIB Hyderabad
–నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్ట్రీట్ వెండర్స్ ఆఫ్ ఇండియా (ఎన్ ఎ ఎస్ వి ఐ) జాతీయ వీధివ్యాపారుల ఆహార ఉత్సవం12 వ ఎడిషన్ ను నిర్వహిస్తోంది.
–దేశం లోని వివిధ ప్రాంతాలలో ఉండే వీధివ్యాపారులు తమ వంటకాలను ప్రదర్శించేందుకు ఇది అనువైన వేదిక
–“ఈ ప్లాట్ఫారం వీధివ్యాపారుల ఉపాధి అవకాశాలను బలోపేతం చేయగలదదన్న విశ్వాసం నాకు ఉంది ”: శ్రీ హర్దీప్ ఎస్.పూరి
ప్రధానమంత్రి వీధివ్యాపారుల ఆత్మనిర్బర్ నిధి గురించి ఈరోజు ఒక సమావేశంలో కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాలు, సహజవాయు శాఖ మంత్రి
శ్రీ హర్దీప్ ఎస్.పూరి మాట్లాడుతూ, ఈ పథకానికి దేశవ్యాప్తంగా గల వీధివ్యాపారుల నుంచి పెద్ద ఎత్తున సానుకూల స్పందన వచ్చిందని చెప్పారు.
ఇది అత్యంత వేగంగా విస్తరిస్తున్న కేంద్రప్రభుత్వ సూక్ష్మ రుణ పథకాలలో ఒకటిగా నిలిచిందని ఆయన అన్నారు.
గత రెండు సంవత్సరాలలో పిఎం స్వనిధి 40.07 లక్షలకు పైగా రుణాలను రెండు విడతలలో పంపిణీచేసిందని, దీనిక సంబంధించిన లబ్ధిదారులు 45.32 లక్షల మందికి పైగా ఉంటారని అన్నారు. వీరికి 4,606.36 కోట్ల రూపాయలకు పైగా పంపిణీ చేసినట్టు చెప్పారు.
“డిజిటల్ ఇండియా దార్శనికతకు అనుగుణంగా , పిఎం స్వనిధి ఆర్ధిక సమ్మిళితత్వానికి ఒక వేదికను కూడా ఏర్పాటు చేసింది.
ఇది వీధఙవ్యాపారులు డిజిటల్ లావాదేవీలు నిర్వహించుకునేందుకు వీలు కల్పించింది. ఇప్పటివరకు వీధివ్యాపారులు
37.70 కోట్ల డిజిటల్ లావాదేవీలు చేశారని వీటి విలువ 45,000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ లబ్ధిదారులకు 23.02 కోట్ల రూపాయలను క్యాష్ బ్యాక్ కింద ఇచ్చింది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ ఏర్పాటు చేశారు”అని హర్దీప్ పూరి తెలిపారు.
పి.ఎం .స్వనిథి పథకం వీధివ్యాపారులకు తమ పనికి గుర్తింపు లభించేలా చేస్తోంది. వీరికి లెటర్స్ ఆఫ్ రెకమండేషన్ను అందిస్తున్నారు. దీనివల్ల వారు సులభంగా రుణాలు పొందగలుగుతున్నారు. దీనికితోడు, పరిచయ్ బోర్డు ను ఇవ్వడం జరిగింది. ఇది వారికి ఒక రకమైన గుర్తింపును, గౌరవాన్ని ఇస్తోంది. ఈ బోర్డులు వీధివ్యాపారులకు సులభతర వ్యాపారానికి ఉపకరిస్తాయి. అలాగే వారు అనవసర వేధింపులకు గురికాకుండా ఉండేందుకు ఉపకరిస్తాయి. వీధివ్యాపారుల 12 వ జాతీయ ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవం సందర్బంగా మాట్లాడుతూ శ్రీ హర్దీప్ ఎస్ పూరి ఈ విషయాలు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని నేషనల్ అసోసియేషన్ ఆప్ స్ట్రీట్ వెండర్స్ ఆప్ ఇండియా (ఎన్ ఎ ఎస్ వి ఐ) నిర్వహిస్తోంది. వీధివ్యాపారులు దేశం నలుమూలల నుంచి వచ్చి తమ తమ వంటకాలను ప్రదర్శించడానికి ఇది మంచి వేదికగా ఉపయోగపడుతోంది.
“ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు స్థానిక వంటలను రుచిచూడడానికి వీలు కలుగుతుంది. అలాగే వీధివ్యాపారుల కు సంబంధించి వివిధ విజయగాథలను ముందుకు తెచ్చేందుకు ఒక మంచి ఆలోచన కూడా. ’’అని హర్దీప్ ఎస్ పూరి తెలిపారు. ‘‘ఈ వేదిక వీధివ్యాపారులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం దేశంలో పెద్ద సంఖ్యలో వ్యాపార సంస్థలు, స్టార్టప్లు వస్తున్నాయి. స్వయం ఉపాధి గొప్పతనాన్ని గుర్తించడం జరుగుతోంది. సూక్ష్మ ఆర్ధిక వ్యవస్థలోని వెండర్ల ప్రాధాన్యతను అర్ధం చేసుకుని వారిని అభినందించాల్సి ఉంది.”అని ఆయన అన్నారు.
ఫుడ్ డెలివరీ ప్లాట్ఫారంలు అయిన జోమాటో, స్విగ్గీ తదితర సంస్థలతో టై అప్ గురించి ప్రస్తావిస్తూ మంత్రి, పి.ఎం. స్వనిధి 9,326 మంది వీధివ్యాపారులను స్విగ్గి, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ ప్లాట్ఫారంలతో అనుసంధానం చేసినట్టు చెప్పారు. 2023 జనవరి 9 నాటికి ఈ ప్లాట్ ఫారంలపై 21.93 కోట్ల రూపాయల విలువగల అమ్మకాలు జరిగాయని అన్నారు. ఇలాంటి భాగస్వామ్యం ద్వారా అటు వెండర్లకు , వినియోగదారులకు విస్తృత మార్కెట్ అందుబాటులోకి వస్తుందని అన్నారు.
ప్రభుత్వం ఇటీవలి సంవత్సరాలలో తీసుకున్న పలు సంక్షేమ పాలనా చర్యల గురించి వివరిస్తూ మంత్రి, కేంద్రంలోని శ్రీ నరేంద్ర మోదీ ప్రభుత్వం,
రూపొందించే విధానాలలో ప్రజల సంక్షేమం ఎల్లప్పుడూ పునాది గా ఉంటుందని చెప్పారు. పౌర కేంద్రిత పథకకమైన పి.ఎం.స్వనిథి ఇందుకు నిదర్శనమని ఆయన అన్నారు.
“అందరి గౌరవాన్ని పెంపొందింప చేయాలన్నది మా అభిమతం.అలాగే ప్రతి ఒక్కరి పాత్రను, వారి సేవలకు గుర్తింపు లభించాలన్నది మా విధానం.
మన సమాజంలోని పేదలు, అణగారిన వర్గాలు ప్రత్యేకించి పట్టణాలు నగరాలలోని వారు ప్రభుత్వం తీసుకువచ్చిన పలు పథకాల ద్వారా ఎంతో ప్రయోజనం పొందారు.”అని ఆయన అన్నారు.
****
(Release ID: 1891191)
Visitor Counter : 164