బొగ్గు మంత్రిత్వ శాఖ
బొగ్గు బ్లాకులకు వాణిజ్య వేలం కోసం బిడ్లను 13 జనవరి 2023 వరకు సమర్పించవచ్చు
प्रविष्टि तिथि:
10 JAN 2023 9:07AM by PIB Hyderabad
బొగ్గు మంత్రిత్వ శాఖ 141 బొగ్గు గనులకు 6వ విడత, 5వ విడత రెండవ ప్రయత్నాన్ని 3 నవంబర్ 2022న ప్రారంభించింది. పెట్టుబడి సమాజంలోని వివిధ డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని ప్రస్తుతం నడుస్తున్న విడత కింద బొగ్గు గనులు ఎంపిక చేశారు; పరిశ్రమ కొన్ని బొగ్గు గనుల ఆకర్షణను మెరుగుపరిచాలంటూ చేసిన సూచన ఆధారంగా వాటి పరిమాణాలను మార్చారు.
కాలక్రమాలకు అనుగుణంగా, బిడ్డర్లు 13 జనవరి 2023 వరకు 12ః00 గంటల దాకా ఎలక్ట్రానిక్ వేదిక ద్వారా ఆన్‌లైన్‌లోను, అదే రోజు 16ః00 గంటల వరకు భౌతికంగా తమ బిడ్లను సమర్పించవచ్చు. బిడ్లను సోమవారం, 16 జనవరి 2023న ఉదయం 10ః00 గంటలకు బిడ్డర్ల ప్రతినిధుల సమక్షంలో ప్రారంభిస్తారు.
***
(रिलीज़ आईडी: 1890202)
आगंतुक पटल : 170