నౌకారవాణా మంత్రిత్వ శాఖ

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జనవరి 13వ తేదీన పాండు వద్ద నౌక మరమ్మత్తు సదుపాయానికి శంకుస్థాపన; పాండు నౌకాశ్రయానికి అనుసంధాన రహదారి, నావికా నైపుణ్య కేంద్రానికి ప్రారంభోత్సవం చేయనున్నారు : శ్రీ సర్బానంద సోనోవాల్


2024-25 వరకు అస్సాంలో అంతర్గత జలమార్గాల పునరుద్ధరణకు 1016 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన ప్రధాన కార్యక్రమాలకు రూపకల్పన చేయడం జరిగింది : శ్రీ సోనోవాల్

ఎన్.డబ్ల్యూ. 2 (బ్రహ్మపుత్ర), ఎం.డబ్ల్యూ 16 (బరాక్) అభివృద్ధి చేయడానికి సమగ్ర ప్యాకేజీ 622 కోట్ల రూపాయలకు పెంచడం జరిగింది : శ్రీ సోనోవాల్


జలమార్గాల నిర్వహణకు అవసరమైన బ్రహ్మపుత్ర, బరాక్, ధనసిరి, కోపిలి డ్రెడ్జింగ్ పనుల కోసం 233 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది


ధుబ్రీ నుండి దిబ్రూఘర్ వరకు మన వారసత్వాన్ని ప్రదర్శిస్తున్నందున అస్సాంలో అంతర్జాతీయ పర్యాటకం కోసం గంగా విలాస్, మయోంగ్ నుండి మజులి వరకు కొత్త విస్తాను తెరవనుంది : శ్రీ సోనోవాల్

Posted On: 09 JAN 2023 6:03PM by PIB Hyderabad

అంతర్గత జలమార్గాల అభివృద్ధి కోసం సంవత్సరం ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ ద్వారా అస్సాం కోసం ప్రణాళిక చేయబడిన ప్రధాన కార్యక్రమాలను కేంద్ర నౌకాశ్రయాలు, సరకు రవాణా, జలమార్గాలు, ఆయుష్ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ రోజు గౌహతిలో ప్రకటించారు. గౌహతిలోని పాండు నౌకాశ్రయ సామర్థ్యాన్ని పెంచేందుకు ఈశాన్య ప్రాంతాలకు నావికా నైపుణ్య కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రెండు ప్రధాన కార్యక్రమాలకు 2013 జనవరి, 13 తేదీన శంకుస్థాపన చేయనున్నారు. ఇతర కార్యక్రమాల్లో భాగంగా పాండు మల్టీ మోడల్ టెర్మినల్ వద్ద షిప్ రిపేర్ ఫెసిలిటీ, గౌహతిలోని జాతీయ రహదారి 27తో పాండు వద్ద మల్టీ మోడల్ టెర్మినల్తో అనుసంధానించే ఎలివేటెడ్ రోడ్డు పనులు కూడా చేపడుతున్నారు. అస్సాం, ఈశాన్య ప్రాంతాల్లో అంతర్గత జలమార్గాలను పునరుద్ధరించడానికి ఓడరేవులు, సరకు రవాణా, జలమార్గాల మంత్రిత్వ శాఖ రూపొందించిన ప్రధాన కార్యక్రమాలలో సౌకర్యాలు భాగంగా ఉన్నాయి.

రాబోయే సంవత్సరాల్లో అస్సాంలో అంతర్గత జలమార్గాల అభివృద్ధికి 1016 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నట్లు కూడా కేంద్ర మంత్రి ప్రకటించారు. బ్రహ్మపుత్ర (ఎన్.డబ్ల్యూ.-2) అభివృద్ధి కోసం ఒక సమగ్ర ప్యాకేజీని, ఇప్పుడు 474 కోట్ల రూపాయలకు పెంచడం జరిగింది. అలాగే ఇటీవల బరాక్ నది (ఎన్.డబ్ల్యూ-16) అభివృద్ధికి కూడా 148 కోట్ల రూపాయలతో ఒక మెరుగైన ప్యాకేజీ ని ప్రకటించారు. ధనసిరి నది (ఎన్.డబ్ల్యూ-31) అదేవిధంగా కోపిలి నది (ఎన్.డబ్ల్యూ-57) అభివృద్ధికి మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. మోదీ ప్రభుత్వ హయాంలో సరకు రవాణాకు ప్రత్యామ్నాయ మార్గంగా పునరుజ్జీవింపబడిన జలమార్గాల విజయం గురించి ఆయన ప్రముఖంగా పేర్కొంటూ, ఇండో బంగ్లాదేశ్ ప్రోటోకాల్ మార్గం (.బి.పి.ఆర్) లో సరకు రవాణా 2014-15 లో 2.00 మెట్రిక్ టన్నులు ఉండగా 2021-22 లో 5.43 మెట్రిక్ టన్నులకు పెరిగిందని శ్రీ సోనోవాల్ వ్యాఖ్యానించారు.

 సందర్భంగా శ్రీ సోనోవాల్ మాట్లాడుతూ, “ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ దూరదృష్టితో కూడిన నాయకత్వంలో, మా మంత్రిత్వ శాఖ ప్రాంతంలోని జలమార్గాలను ప్రాంతం పెరుగుదల, ఆర్థిక ప్రగతి, అభివృద్ధి మార్గాలుగా మార్చి, వాటిని శక్తివంతం చేయడానికి ప్రధాన కార్యక్రమాలను చేపట్టింది. జలమార్గాల ద్వారా సరకు రవాణా లేదా ప్రయాణీకుల కదలిక ఏదైనా, ప్రాంతంలో సామర్ద్యాన్ని పెంపొందించడానికి అనువైన విధానాల రూపకల్పన చేసి, అమలు చేస్తున్నాము. విషయంలో, గౌహతిలోని పాండు ఓడరేవులో ప్రధాన సామర్థ్య నిర్మాణానికి ప్రధానమంత్రి మోదీ జీ దృశ్యమాధ్యమం ద్వారా శంకుస్థాపన చేయనున్నారు. ప్రాంత అభివృద్ధికి ఇది ఒక పెద్ద అస్త్రంగా ఉపయోగపడుతుందని మేము నమ్ముతున్నాము. దేశ సుసంపన్నమైన నదీ వ్యవస్థ కు చెందిన అద్భుతమైన సామర్థ్యాన్ని ఉపయోగించుకోవాలనే మా నిబద్ధత అపారమైన అవకాశాలను తీస్తుందని మేము నమ్ముతున్నాము. స్థిరమైన, ఆర్థిక, వేగవంతమైన రవాణా మార్గంగా జలమార్గాల సహజ సౌందర్యం మన భవిష్యత్తును సిద్ధంగా ఉంచుతుందని, నూతన భారతదేశ వృద్ధికి చోదక శక్తి గా పనిచేస్తుందని మేము నమ్ముతున్నాము." అని వివరించారు.

వారణాసి నుండి దిబ్రుఘర్ వరకు గంగా విలాస్ పేరుతో ప్రారంభమవుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ క్రూయిజ్ గురించి కేంద్ర మంత్రి వివరిస్తూ, “గంగా విలాస్ దేశంలోని పర్యాటక రంగానికి కొత్త రూపు నిస్తుంది. క్రూయిజ్ అస్సాంలో పది రోజులకు పైగా ఉంటుంది. కాబట్టి, విదేశీ పర్యాటకులు నది తీరం వెంబడి సామాజిక, సాంస్కృతిక వర్ణాల నూతన అనుభవాలను అన్వేషించగలరు. ధుబ్రి నుండి దిబ్రుఘర్ వరకు, అదేవిధంగా మయోంగ్ నుండి మజులి వరకు, క్రూయిజ్ అస్సాం సహజ సౌందర్యాన్ని ఆస్వాదించే ఆసక్తికర ప్రయాణం గా నిలిచిపోతుంది. దీని విజయం అస్సాంలో రివర్ క్రూయిజ్ టూరిజంలో పెట్టుబడికి కొత్త మార్గాన్ని కూడా తెరిచింది. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై అనేక రెట్లు ప్రభావం చూపుతుందని మేము ఆశిస్తున్నాము." అని పేర్కొన్నారు. గంగా విలాస్ రాష్ట్రంలోని దిబ్రుఘర్ (బోగిబీల్) ని చేరుకునే ముందు లోపు ధుబ్రి, గోల్పరా (జోగిఘోపా), గౌహతి (పాండు), పోబిటోరా, తేజ్పూర్, సిల్ఘాట్, నేమతి ఘాట్లలో ఆగుతుంది.

 

 

పాండు టెర్మినల్ వద్ద నౌక మరమ్మత్తు సౌకర్యం సమయాన్ని, ఖర్చును ఆదా చేస్తుంది. సదుపాయం అస్సాం ప్రభుత్వానికి చెందిన .డబ్ల్యూ.టి; భారత నావికా దళానికి .డబ్ల్యూ...తో పాటు, ఎన్.డబ్ల్యూ-2 & 16 లో తిరిగే ఇతర ప్రయివేటు నౌకల మరమ్మతులకు అందుబాటులో ఉంటుంది. పాండు టెర్మినల్ను ఎన్.హెచ్-7 తో అనుసంధానించే ప్రత్యేక రహదారి, సరకు రవాణా చేసే వారికి మంచి వ్యాపార అవకాశంగా 24 గంటల సౌకర్యవంతమైన, వేగవంతమైన కనెక్టివిటీని కలిగిస్తుంది. మనకు అందుబాటులో ఉన్న అపారమైన ప్రతిభా పాటవాలు మెరుగుపరుచుకుని, అభివృద్ధి చెందుతున్న సరకు రవాణా పరిశ్రమలో మెరుగైన ఉపాధి అవకాశాలు పొందడానికి వీలుగా అభ్యర్థులకువిలువైన నైపుణ్య శిక్షణ అందించడానికి, ఈశాన్య ప్రాంతంలో నెలకొల్పిన నావికా నైపుణ్య కేంద్రం కీలక పాత్ర పోషిస్తుంది.

 

 

*****

 



(Release ID: 1890193) Visitor Counter : 127