ప్రధాన మంత్రి కార్యాలయం

ఇరవై ఆరో జాతీయ యువజనోత్సవాన్ని జనవరి 12వ తేదీ నాడు కర్నాటక లోనిహుబ్బళ్ళి లో ప్రారంభించనున్న ప్రధాన మంత్రి


‘వికసిత్ యువా - వికసిత భారత్’ ఈ ఉత్సవం యొక్క ఇతివృత్తం గా ఉంది

అయిదు ఇతివృత్తాల పైన చర్చల కు సాక్షి గా నిలవనున్న యువజన శిఖర సమ్మేళనం; ఆ ఇతివృత్తాల లో పని, పరిశ్రమ మరియు నూతన ఆవిష్కరణ లు; జలవాయు పరివర్తన; ఆరోగ్యం; శాంతి; మరియు ఉమ్మడి భవిష్యత్తు అనేటటువంటివిభిన్న అంశాలు ఉంటాయి

స్థానిక సంప్రదాయాల కు, సంస్కృతుల కు ఉత్తేజాన్ని అందించాలన్న దృష్టికోణం తోస్పర్ధాత్మక కార్యక్రమాల ను నిర్వహించడం జరుగుతుంది

యోగ చేసేందుకు దాదాపు గా 10 లక్షల మంది ని సమీకరించాలనే ధ్యేయం తోనిర్వహించబోతున్నటువంటి ‘యోగథన్’ ఈ ఉత్సవం లో ఒక కీలకమైన ఆకర్షణ కానుంది

దేశవాళీ క్రీడ లు మరియు రణవిద్య లు ఎనిమిదింటి ని సైతం ఆవిష్కరించనున్న జాతీయస్థాయి ప్రదర్శనకారులు

Posted On: 10 JAN 2023 3:34PM by PIB Hyderabad

ఇరవై ఆరో జాతీయ యువజనోత్సవాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కర్నాటక లోని హుబ్బళ్ళి లో 2023 జనవరి 12వ తేదీ నాడు సాయంత్రం 4 గంటల వేళ లో ప్రారంభించనున్నారు. స్వామి వివేకనందుల వారి ఆదర్శాల ను, బోధనల ను మరియు వారి తోడ్పాటుల ను గౌరవించుకోవడం కోసం ఆయన జయంతి నాడు పాటించే జాతీయ యువజన దినంరోజు ననే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైంది.

 

ప్రతిభావంతులైన మన యువత కు జాతీయ స్థాయి లో అవగాహన ను ఏర్పరచడం తో పాటు గా దేశ నిర్మాణం దిశ గా పాటుపడేటట్టు వారిని ఉత్సాహవంతుల ను చేయడం కోసం ప్రతి ఏటా ఈ యువజనోత్సవాన్ని నిర్వహించడం జరుగుతున్నది. దేశం లోని అన్ని ప్రాంతాల విభిన్న సంస్కృతుల ను ఒకే వేదిక మీద కు ఈ కార్యక్రమం తీసుకు రావడమే కాకుండా ఈ ఉత్సవం లో పాలుపంచుకొనే వారి ని ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్భావన తో పెనవేస్తుంది. ఈ సంవత్సరం లో, ఈ ఉత్సవాన్ని జనవరి 12వ తేదీ మొదలుకొని 16వ తేదీ వరకు కర్నాటక లోని హుబ్బళ్ళి-ధారవాడ లలో నిర్వహించనున్నారు. వికసిత్ యువా, వికసిత్ భారత్అనేది ఈ ఉత్సవానికి ఇతివృత్తం గా ఉండబోతోంది.

 

ఈ ఉత్సవం లో భాగం గా యువజన శిఖర సమ్మేళనం కొలువుదీరుతుంది. ఈ సమిట్ జి20, ఇంకా వై20 ల ద్వారా స్ఫూర్తి ని పొందే అయిదు ఇతివృత్తాల పై సర్వసభ్య చర్చల కు సాక్షి గా నిలుస్తుంది. చర్చాంశాల లో పని యొక్క భవిష్యత్తు, పరిశ్రమ, నూతన ఆవిష్కరణ లు మరియు 21వ శతాబ్ది లో నైపుణ్యాలు; జలవాయు పరివర్తన, ఇంకా వైపరీత్యాల తాలూకు నష్ట భయాన్ని తగ్గించడం; శాంతి ని స్థాపించడం మరియు సర్దుబాటు చేయడం; ప్రజాస్వామ్యం లోను, పాలన లోను యువత ప్రధాన పాత్ర ను పోషించే ఉమ్మడి భవిష్యత్తు; ఆరోగ్యం మరియు శ్రేయస్సు వంటివి ఉంటాయి. అరవై మంది కి పైగా నిపుణులు ఈ శిఖర సమ్మేళనం లో పాలుపంచుకొంటారు. ఈ ఉత్సవాల లో స్పర్థాత్మక కార్యక్రమాల తో పాటు పోటీ కి తావు ఉండని అటువంటి కార్యక్రమాల ను అనేకం గా నిర్వహించడం జరుగుతుంది. స్పర్ధాత్మక కార్యక్రమాల లో జానపద నృత్యాలు మరియు లోకగీతాలు ఉంటాయి. స్థానిక సంప్రదాయాల కు ఉత్తేజాన్ని అందించేందుకు ఈ విధమైనటువంటి కార్యక్రమాల ను ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఇక నాన్-కాంపిటీటివ్ ఈవెంట్స్ లో భాగం గా యోగథన్ఉంటుంది. యోగ చేసేందుకు 10 లక్షల మంది ని సమీకరించాలి అనేది దీని ధ్యేయం గా ఉంది. దేశవాళీ క్రీడల ను మరియు రణవిద్యల ను ఎనిమిదింటి ని జాతీయ స్థాయి ప్రదర్శనకారులు ఈ సందర్భం లో ఆవిష్కరించనున్నారు. ఇతర ఆకర్షణల లో మిగతా అంశాల తో పాటు ఆహార ఉత్సవం, యువ చిత్రకారుల శిబిరం, సాహసిక క్రీడా కార్యకలాపాలు, మీ సైన్యాన్ని, నౌకా దళాన్ని మరియు వాయు సేన ను గురించి తెలుసుకోండి అనే సందేశం తో ఏర్పాటు చేసే ప్రత్యేక శిబిరాలు వంటివి ఉంటాయి.

 

***



(Release ID: 1890046) Visitor Counter : 186