నౌకారవాణా మంత్రిత్వ శాఖ
ప్రపంచంలో అతి పొడవైన నదీ విహార నౌక గంగా విలాస్, నదీవిహార పర్యాటకాన్ని భారతదేశంలో ప్రారంభించనుంది.
– జనవరి 13న వారణాశి నుంచి ఈ క్రూయిజ్ను ప్రారంభించనున్నప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ
– ఈ నౌక ఉత్తరప్రదేశ్ లోని వారణాశి నుంచి అస్సాంలోని దిబ్రూఘడ్ వరకు 3200 కిలోమీటర్ల దూరం 50 పర్యాటక ప్రాంతాల మీదుగా
27 వివిధ నదీ వ్యవస్థల ద్వారా ఇండో బంగ్లాదేశ్ ప్రొటోకాల్ మార్గంలో ప్రయాణిస్తుంది.
– ఎంవి గంగా విలాస్ ఇండియాను ప్రపంచ నదీ క్రూయిజ్ పటంలో చేరుస్తుంది : శ్రీ సోనోవాల్
Posted On:
08 JAN 2023 1:43PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 జనవరి 13న వారణాశిలో ప్రారంభించే ప్రపంచంలోని అతి పొడవైన రివర్ క్రూయిజ్
ఎంవి గంగా విలాస్, భారతదేశ నదీ క్రూయిజ్ పర్యాటకంలో నవ శకానికి నాంది పలకనుందని కేంద్ర షిప్పింగ్, వాటర్వేస్, ఆయుష్
శాఖ మంత్రి శ్రీ శర్వానంద్ సోనోవాల్ తెలిపారు. ఈ లగ్జరీ క్రూయిజ్ భారత్, బంగ్లాదేశ్లో 5 రాష్ట్రాలు , 27 నదీవ్యవస్థలలో
3200 కిలోమీటర్ల కుపైగా దూరం ప్రయాణిస్తుంది. ఈ సర్వీసు ప్రారంభంతో ఇప్పటివరకు ఈ రంగంలో ఉపయయయోగించుకోలేకపోయిన
భారీ అవకాశాలను దక్కించుకోవడానికి వీలు కలుగుతుందని శ్రీ సోనోవాల్ తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీ సోనోవాల్, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ డైనమిక్ నాయకత్వంలో
మన గొప్ప నదులు మనకు అందించే సంపదను అందిపుచ్చుకోనున్నామని తెలిపారు.
ఈ సుస్థిరాభివృద్ధి అవకాశాలు అంతర్గత జలమార్గాల ద్వారా అద్భుత ప్రోత్సాహాన్ని పొందాయని, కార్గొ ట్రాఫిక్, ప్రయాణికుల పర్యాటకానికి సంబంధించి
ప్రోత్సాహకర ఫలితాలు సాధించాయని ఆయన అన్నారు.
ఎంవి గంగా విలాస్ క్రూయిస్ దేశంలో నదీవిహార పర్యాటకం విషయంలో గల భారీ అవకాశాలను వినియోగించుకోనున్నదని ఆయన తెలిపారు.
మన గొప్ప సంస్కృతి అంతర్జాతీయ స్థాయిలో తెలియజెప్పేందుకు వీలుకలుగుతుందని, పర్యాటకులు ఆథ్యాత్మిక, విద్య
సుసంపన్నత, సంస్కృతి, భారతదేశ జీవవైవిధ్యాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతుందని ఆయన తెలిపారు.
కాశీ నుంచి సారనాథ్, మజులి నుంచి మయాంగ్, సుందర్ బన్ నుంచి కజిరంగా ఈ క్రూయిజ్ జీవితకాలపు అద్భుత అనుభవాన్ని పర్యాటకులకు
అందించనున్నదని అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి అద్భుత చొరవతో, నదీ క్రూయిజ్ పర్యాటకం భారతదేశంలో నవశకంలోకి
అడుగుపెడుతున్నదని ఆయన అన్నారు. ఇది మన ప్రభుత్వ తూర్పు కార్యాచరణకు అటు విధానపరంగా ,ఇటు కార్యాచరణ పరంగా వీలు కల్పిస్తున్నదని అన్నారు.
ఎం.వి గంగా విలాస్ క్రూయిజ్ ప్రపంచానికి భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజెప్పేలా రూపకల్పన చేయడం జరిగింది. 51 రోజుల క్రూయిజ్ ప్రయాణంలో 50 టూరిస్ట్ ప్రదేశాలను దర్శించే సదుపాయం కల్పిస్తారు.
ఇందులో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు, జాతీయ పార్కులు, నదీఘాట్లు, బీహార్ లోని పాట్నా, జార్ఖండ్ లోని సాహిబ్ గంజ్, పశ్చిమబెంగాల్ లోని కోల్కతా, బంగ్లాదేశ్ లోని ఢాకా, అస్సాంలోని గౌహతి ఉన్నాయి. ఎం.వి.గంగా విలాస్ విహార నౌక 62 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది. దీనిలో అత్యంత హాయిగా ప్రయాణం చేయవచ్చు. ఇందులో 3 డెక్లు, 18 సూట్లు ఉంటాయి.36 మంది టూరిస్టుల కెపాసిటీ కలిగి ఉంటుంది . ఇందులో అన్ని సదుపాయాలూ ఉండడంతో ఇదోక మరపురాని విహార యాత్రగా మిగిలిపోతుంది.
ఇందులో కాలుష్యానికి ఏమాత్రం అవకాశం లేకుండా చర్యలు తీసుకున్నారు. శబ్దకాలుష్య నియంత్రణకూ ఏర్పాట్లు చేశారు. ఇది పర్యాటకులకు విలసవంతమైన పర్యటన అనుభూతిని కలిగిస్తుంది. ఎం.వి.గంగా విలాస్ తొలి ప్రయాణం స్విట్జర్లాండుకు చెందిన 32 మంది ప్రయాణికులతో మొదలవుతుంది. ఇది వారణాశి నుంచి దిబ్రూఘడ్ వరకు సాగుతుంది. 2023 మార్చి 1 వ తేదీకి ఇది డిబ్రూఘడ్ కుచేరుకుంటుందని అంచనా.
భారతదేశపు గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని తెలియజెప్పేలా ఎం.వి.గంగా విలాస్ విహార యాత్రకు రూపకల్పన చేశారు.
ఈ ప్రయాణంలో చారిత్రక, సాంస్కృతిక , మతపరమైన ప్రాధాన్యతగల ప్రదేశాలను సందర్శించేలా ఏర్పాటు చేశారు.వారణాశిలో ప్రముఖ గంగా హారతి నుంచి ప్రారంభమై, ప్రముఖ బౌద్ద ప్రదేశమైన సారనాథ్ మీదుగా వివిధ ప్రదేశాలు సందర్శిస్తుంది.ఇది తాంత్రిక్ కళకు పేరున్న మేయాంగ్, పెద్ద నదీ ద్వీపం,అస్సాంలోని వైష్ణవ సంప్రదాయానికి నిలయమైన
మజూలి, వంటి ప్రదేశాలను ఇందులో సందర్శిస్తారు. పర్యాటకులు బీహార్ స్కూల్ ఆఫ్ యోగా, విక్రమశిల యూనివర్సిటీని తిలకిస్తారు. ఇలా భారతీయ విశిష్ఠ సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకుని పర్యాటకులు ఆనందించేలా చేస్తారు. ఈ క్రూయిజ్ ప్రపంచ ప్రసిద్ధి చెందిన జీవవైవిధ్య ప్రదేశాలైన సుందర్ బన్లు, రాయల్ బెంగాల్ టైగర్స్, కజిరంగా జాతీయపార్కు సందర్శన వంటివి ఈ పర్యటనలో ఉన్నాయి.
దేశంలో నదీ నౌకావిహార పర్యాటకాన్ని అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత గురించి ప్రస్తావిస్తూ సోనోవాల్, ఈ రంగం అభివృద్ధి ఉపాధి అవకాశాలను పెద్ద ఎత్తున కల్పిస్తుందన్నారు. నదీ నౌకా విహార పర్యాటకాన్ని విజయవంతం చేసేందుకు ప్రభుత్వం
సామర్ధ్యాల పెంపును చేపడుతున్నదని పెట్టుబడి పెడుతున్నదని చెప్పారు. ఇది దేశంలో నదీ నౌకా విహార అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. ప్రస్తుత సమీకృత పర్యాటక సర్కూట్లతో అనుసంధానం చేస్తూ ఈ రంగానికి సంబంధించి దేశంలో విస్తృత అభివృద్ధికి వీలు కల్పిస్తున్నట్టు చెప్పారు.
ఎం.వి. గంగా విలాస్ క్రూయిజ్ ఈ తరహా క్రూయిజ్లలో మొదటిది. ఇన్ లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐడబ్ల్యు ఎఐ) మద్దతుతో షిప్పింగ్, పోర్టులు, వాటర్వేస్ మంత్రిత్వశాఖ కింద చేపడుతున్న దీని విజయం దేశంలోని ఇతర ప్రాంతాలలో రివర్ క్రూయిజ్ల ను నడిపేందుకు పారిశ్రామిక వేత్తలను ఆకర్షించనుంది.
అంతర్జాతీయ రివర్ క్రూయిజ్ మార్కెట్ గత కొద్ది సంవత్సరాలుగా 5 శాతం వంతున పెరుగుతున్నది. ఇది 2027 నాటికి 37 శాతంగా ఉండనుంది. యూరప్ ప్రపంచ రివర్ క్రూయిజ్ మార్కెట్ లో
60 శాతం వాటా కలిగి ఉండి ముందుకు పోతున్నది. ఇండియా లో 8 రివర్ క్రూయిజ్ నౌకలు కోల్కటా, వారణాశి మధ్య నడుస్తున్నాయి. క్రూయిజ్ కార్యకలాపాలు జాతీయ జలమార్కగాలలోనూ ఉంది. రివర్ రాఫ్టిం. క్యాంపింగ్, వివిధ ప్రాంతాల సందర్వన, వంటి ఎన్నొ అనుబంధ కార్యకలాపాలు దేశంలోని పలు ప్రాంతాలలో నిర్వహిస్తుననారు. నేషనల్ వాటర్ వేస్ 2 లో 10 పాసింజర్ టెర్మినళ్ల నిర్మాణం జరుగుతోంది. ఇది రివర్ క్రూయిజ్ పర్యాటకాన్ని మరింత ముందుకు తీసుకెళ్లనుంది.
ప్రస్తుతం నాలుగు రివర్ క్రూయిజ్ వెసల్స్ నేషనల్ వాటర్ వేస్ 2లో తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. నేషనల్ వాటర్ వేస్ 3 (వెస్ట్ కోస్ట్కెనాల్) , ఎన్డబ్ల్యు 8 , ఎన్డబ్ల్యు 4, ఎన్డబ్ల్యు 87, ఎన్ డబ్ల్యు97, ఎన్ .డబ్ల్యు 5 లలో పరిమిత స్థాయిలో తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. అంతర్గత జల మార్గాల సామర్ధ్యాల పెంపునకు పెద్ద ఎత్తున పెట్టుబడి పెడుతున్నందున రివర్ క్రూయిజ్ ఒక పద్ధతి ప్రకారం ఆర్ధిక వ్యవస్థకు బ్యాక్వర్డ్, ఫార్వర్డ్ లింకేజితో ప్రత్యేకించి నదీ తీర ప్రాంతాలలో నదీ నౌకా విహారం పుంజుకోనుంది.
***
(Release ID: 1889899)
Visitor Counter : 242