మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
పరీక్షా పె చర్చ 2023 ఏర్పాట్లను సమీక్షించిన శ్రీ ధర్మేంద్ర ప్రధాన్
Posted On:
09 JAN 2023 3:54PM by PIB Hyderabad
పరీక్షా పె చర్చ 2023కు జరుగుతున్న ఏర్పాట్లను కేంద్ర విద్య, నైపుణ్యాల అభివృద్ధి & వ్యవస్థాపకత మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, విద్యా మంత్రిత్వ శాఖ సహాయ మంత్రులు శ్రీమతి అన్నపూర్ణా దేవి, డాక్టర్ సుభాష్ సర్కార్‌తో కలిసి సమీక్షించారు.
పాఠశాల విద్య& అక్షరాస్యత, డిఒఎస్ఇఎల్ విభాగం కార్యదర్శి శ్రీ సంజయ్ కుమార్, సమాచార& ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అపూర్వ చంద్ర, విద్యా మంత్రిత్వ శాఖ, సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఎన్‌సిఇఆర్‌టి, సిబిఎస్ఇ, ఎన్‌విఎస్, కేంద్రీయ విద్యాలయ సంగఠన్ & మై గవ్ కు చెందిన సీనియర్ అధికారులు సమావేశానికి హాజరయ్యారు.
పిపిసి 2023 సందర్భంగా విద్యార్ధులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సంభాషణలను మరింత విస్త్రతంగా లోతుగా చేయాలని సమావేశంలో మంత్రి పిలుపిచ్చారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహించే పిపిసి 2023 పరీక్షా కాలానికి ముందు విద్యార్ధులకు ప్రేరణను, శక్తిని ఇస్తుందని శ్రీ ప్రధాన్ అన్నారు.
***
(Release ID: 1889898)
Visitor Counter : 185