ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఆయుష్మాన్ భారత్ పీఎం-జె పథకం కింద పనిచేస్తున్న ఆసుపత్రుల పనితీరు మదింపు చేసి గ్రేడింగ్ ఇవ్వడానికి నూతన విధానం ప్రవేశపెట్టిన జాతీయ ఆరోగ్య సంస్థ (ఎన్ హెచ్ ఏ}


రోగులకు అవసరమైన సేవలు అందించేలా ఆరోగ్య సేవలు అందిస్తున్న సంస్థలను ప్రోత్సహించి ప్రోత్సాహకాలు అందించే లక్ష్యంతో నూతన విధానానికి రూపకల్పన

Posted On: 09 JAN 2023 1:37PM by PIB Hyderabad

  ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (ఎబి పీఎం-జె) పథకం కింద పనిచేస్తున్న ఆసుపత్రుల పనితీరు మదింపు చేసి గ్రేడింగ్ ఇవ్వడానికి జాతీయ ఆరోగ్య సంస్థ (ఎన్ హెచ్ ఏ}  నూతన విధానం ప్రవేశపెట్టింది. ఆసుపత్రులు అందిస్తున్న సేవలను పరిమాణం ప్రాతిపదికన కాకుండా విలువ ఆధారంగా మదింపు వేసి గ్రేడింగ్ ఇచ్చే విధంగా నూతన విధానాన్ని జాతీయ ఆరోగ్య సంస్థ సిద్ధం చేసింది.  

అందించిన సేవలకు చెల్లింపు చేసే విధానం సంప్రదాయంగా వస్తోంది. సాంప్రదాయ చెల్లింపుల విధానంలో సేవలు పొందిన వ్యక్తి తాను పొందిన సేవల పరిమాణం ఆధారంగా చెల్లింపులు చేయడం జరుగుతుంది. అయితే, కొత్తగా ప్రవేశపెట్టిన విధానంలో విలువ ఆధారిత చెల్లింపులు చేయడం జరుగుతుంది. నూతన చెల్లింపుల విధానం కింద నాణ్యత ఆధారంగా   

 ఆరోగ్య సంరక్షణ సేవలకు  విలువ చెల్లిస్తారు. నాణ్యమైన సేవలు అందించిన ఆరోగ్య సంస్థలకు ప్రోత్సాహం అందుతుంది. ప్రోత్సాహకాలు లభిస్తాయి. రోగుల ఆరోగ్యం మెరుగు పడేలా సేవలు అందించిన సంస్థలకు ప్రోత్సాహకాలు అందిస్తారు. దీనివల్ల, దీర్ఘకాలంలో ప్రజలపై  వ్యాధి ప్రభావం గణనీయంగా తగ్గుతుంది. 

నూతన చెల్లింపుల విధానం వల్ల ప్రజల ఆరోగ్య స్థితిగతులు మెరుగుపడతాయి. దీనివల్ల ఆరోగ్య రంగంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ( ప్రజలు, ఆరోగ్య సేవలు అందిస్తున్న సంస్థలు, సరఫరాదారులు) ప్రయోజనం పొందుతారు. ప్రజలకు మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందుతాయి. నాణ్యమైన సేవలు ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా సంతృప్తి కలిగిస్తాయి. ఆరోగ్య సేవలు అందిస్తున్న వారు అందించిన సేవలకు తగిన ప్రతిఫలం పొందుతారు. ప్రజలకు సంబంధించి నూతన విధానం వల్ల వైద్య ఖర్చులు తగ్గడంతో పాటు చెల్లించిన మొత్తానికి తగిన ప్రయోజనాలు అందుతాయి. 

నూతన విధానం వివరాలను జాతీయ ఆరోగ్య సంస్థ సీఈవో డాక్టర్ ఆర్.ఎస్.శర్మ వివరించారు. 

' నమోదు అయిన ప్రతి ఆస్పత్రిలో నగదు రహిత  నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలు పీఎం-జె    లబ్ధిదారులకు అందేలా చూసేందుకు జాతీయ  ఆరోగ్య సంస్థ చర్యలు అమలు చేస్తోంది. పథకం కింద చికిత్స ఖర్చును ప్రామాణీకరించండం, అధునాతన చికిత్స విధానాలు అందుబాటులోకి తేవడం లక్ష్యంగా కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. దీనితో పాటు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందిస్తున్న సంస్థలను గుర్తించి ప్రోత్సహించి, ప్రోత్సాహకాలు అందించడానికి నూతన విధానాన్ని రూపొందించడం జరిగింది' అని డాక్టర్ శర్మ తెలిపారు. 

 విలువ-ఆధారిత ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో, చెల్లింపుదారులు బలమైన వ్యయ నియంత్రణ ను కూడా ఉపయోగించవచ్చు. ఆరోగ్యం తో ఉండే ప్రజల నుంచి తక్కువ క్లెయిమ్‌లు అందుతాయి. దీనివల్ల చెల్లింపులు తగ్గి ప్రజలు పన్నుల రూపంలో  చెల్లించే ఆదాయం ఆదా అవుతుంది.    రోగులకు అవసరమైన ఉత్పత్తులను ఉత్పత్తి చేసి సరఫరా చేసే అవకాశం అందుబాటులోకి రావడంతో సరఫరాదారులు అవసరమైన వాటిని మాత్రమే ఉత్పత్తి చేయడం ద్వారా  ఖర్చు తగ్గించుకుని తగిన రాబడి పొంది  ప్రయోజనం పొందుతారు. మొత్తంగా, రోగి కేంద్రీకృత సేవలను అందించడం పై మరింత దృష్టి కేంద్రీకరించి  ఆరోగ్య సంరక్షణ సేవలు అందిస్తున్న వారిని  ప్రోత్సహించడం మరియు ప్రోత్సాహకాలు  ద్వారా భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో  సమూల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.

విలువ-ఆధారిత సంరక్షణ కింద  ఎబి పీఎం-జె కింద నమోదైన ఆసుపత్రుల పనితీరు ఐదు పనితీరు సూచికల ఆధారంగా కొలవబడుతుంది  : 1. లబ్ధిదారుల సంతృప్తి, 2. ఆసుపత్రిలో తిరిగి చేరుతున్న వారి సంఖ్య  3. రోగి శాంతంగా చేస్తున్న ఖర్చు4. ధృవీకరించబడిన ఫిర్యాదులు మరియు 5. ఇన్-పేషెంట్  ఆరోగ్య-సంబంధిత జీవన నాణ్యత మెరుగుపరచడం.
పైన పేర్కొన్న సూచికల ఆధారంగా ఆసుపత్రుల పనితీరును పబ్లిక్ డ్యాష్‌బోర్డ్‌లో కూడా అందుబాటులో ఉంచాలి.  దీనివల్ల  లబ్ధిదారులకు తగిన  సమాచారం అందుతుంది.  ఆస్పత్రి పనితీరు ఆసుపత్రి  ఆర్థిక ప్రోత్సాహాన్ని నిర్ణయించడమే కాకుండా పీఎం-జె లబ్ధిదారులకు నాణ్యమైన చికిత్స కోసం డిమాండ్‌ను కూడా సృష్టిస్తుంది.
సమిష్టిగా పనితీరు అంచనా మరియు విలువ-ఆధారిత ప్రోత్సాహకాలు, ఆరోగ్య సాంకేతికత అంచనా వినియోగం మరియు సంరక్షణ నాణ్యతను పర్యవేక్షించడానికి డిజిటల్ సాధనాల ఉపయోగం ఎబి పీఎం-జె మరియు భారతీయ ఆరోగ్య వ్యవస్థను పరిమాణం ఆధారిత ఆరోగ్య వ్యవస్థ నుంచి  విలువ-ఆధారిత . ఆరోగ్య సంరక్షణ పంపిణీ వ్యవస్థగా అభివృద్ధి చేయడానికి సహకరిస్తాయి. 

***



(Release ID: 1889774) Visitor Counter : 220