వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

పీఎం గతిశక్తి పటిష్ట అమలు కోసం సామాజిక రంగ మౌలిక సదుపాయాలకు సంబంధించిన సమాచారం సేకరణ

Posted On: 07 JAN 2023 2:34PM by PIB Hyderabad

 పీఎం గతిశక్తి పధకాన్ని సమర్థంగా అమలు చేసి గరిష్ట ప్రయోజనాలు లభించేలా చూసేందుకు  ఆరోగ్యం, విద్య, సంస్కృతి, పర్యాటకం, గ్రామ పంచాయితీలు, మున్సిపల్ కార్పొరేషన్, సాంఘిక సంక్షేమ గృహాలు మొదలైన వాటికి సంబంధించిన ముఖ్యమైన సమాచార సేకరణ జరుగుతోంది.  భౌతిక మరియు సామాజిక మౌలిక సదుపాయాల ప్రణాళికలో పీఎం  గతిశక్తి ద్వారా లక్ష్యాలు సాధించేలా చూసేందుకు సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి  ధ్రువీకరణ చేయబడుతుంది. న్యూఢిల్లీలోని వాణిజ్య భవన్‌లో డిపిఐఐటి ప్రత్యేక కార్యదర్శి (లాజిస్టిక్స్) అధ్యక్షతన జరిగిన సామాజిక రంగ మంత్రిత్వ శాఖలు/విభాగాల సమీక్షా సమావేశంలో సమాచార వివరాలు అందించారు..

గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ, పాఠశాల విద్య,అక్షరాస్యత శాఖ, ఉన్నత విద్యా శాఖ, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, క్రీడలు, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, పోస్ట్‌ల శాఖ అధికారలు సమావేశానికి హాజరయ్యారు. 12 మంత్రిత్వ శాఖలు/విభాగాలకు సంబంధించిన సమగ్ర సమాచారం సేకరించడం జరిగింది. ఎన్ఎంపి వేదికలో ఈ 12 మంత్రిత్వ శాఖలు/విభాగాలకు చెందిన సమాచారం పొందుపరిచే కార్యక్రమం తుది దశకు చేరుకుంది. పాఠశాలలు, ఆసుపత్రులు మరియు అంగన్‌వాడీ కేంద్రాలు మొదలైన ముఖ్యమైన అంశాలు అనుసంధాన దశల్లో ఉన్నాయి.
నిర్ణయం తీసుకోవడం మరియు ప్రణాళికా సాధనాలపై ఒక ప్రదర్శనను భాస్కరాచార్య ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియోఇన్ఫర్మేటిక్స్ అందించింది.  మోడల్ పాఠశాలల అనుసంధానం  మరియు సామాజిక రంగ మంత్రిత్వ శాఖలు/విభాగాల్లో  ఎన్ఎంపిని అమలు చేసి నిర్ణయాలు తీసుకోవడం వల్ల వివిధ  ప్రయోజనాలు కలగడంతో  పాటు విపత్తు నిర్వహణ ప్రణాళిక రూపొందించడానికి వీలవుతుంది. 
ఎన్ఎంపి వేదికలో పీఎంగతిశక్తి సమాచారాన్ని పొందుపరచడంలో సాధించిన పురోగతిని మంత్రిత్వ శాఖలు/ విభాగాలు వివరించాయి.  ఎన్ఎంపి వేదిక లో పొందుపరుస్తున్న  సమాచార వివరాలను,  మరియు ఏకీకరణ ప్రక్రియలో మంత్రిత్వ శాఖలు/విభాగాలు ఎదుర్కొంటున్న సవాళ్లు సమావేశంలో చర్చకు వచ్చాయి. అందించాయి.


ప్రదర్శనల తర్వాత సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు వివిధ అంశాలపై సమగ్ర చర్చలు జరిపారు.  సామాజిక-ఆర్థికంగా అభివృద్ధి సాధించడానికి అనుసరించాల్సిన విధానాలపై తమ అభిప్రాయాలు అందించారు.   అంగన్‌వాడీ కేంద్రాల అందుబాటు, పరిశ్రమతో అనుబంధాన్ని ప్రోత్సహించడానికి నూతన సాంకేతిక సంస్థను స్థాపించడానికి స్థలాన్ని గుర్తించడం,. పాఠశాలలు పనిచేస్తున్న ప్రాంతాలకు సంబంధించిన అంశాలతో పాటు సంబంధిత  సమస్యలను గుర్తించడం వాటిని పరిష్కరించడానికి అమలు చేయాల్సిన చర్యలపై చర్చలు జరిగాయి. 

 

***



(Release ID: 1889490) Visitor Counter : 124