రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్ ఆఫీసర్ ట్రైనీస్ రాష్ట్రపతితో భేటీ


మీ భవిష్యత్ ప్రాజెక్ట్‌లలో మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అత్యాధునిక సాంకేతికతలను ఉపయోగించుకోండి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Posted On: 05 JAN 2023 12:56PM by PIB Hyderabad
మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్ (ఎంఈఎస్)లో శిక్షణ పొందుతున్న అధికారులు ఈరోజు (జనవరి 5) రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముని కలిశారు.
 

ఆఫీసర్ ట్రైనీలను ఉద్దేశించి మాట్లాడుతూ, భారతదేశం ఇప్పుడే అమృత్ కాల్‌లోకి ప్రవేశించి, జి 20 ప్రెసిడెన్సీని కూడా స్వీకరించిన తరుణంలో అధికారులు ఈ సర్వీసెస్ లో  చేరారని రాష్ట్రపతి అన్నారు. కొత్త ఆవిష్కరణలు, పరిష్కారాల కోసం ప్రపంచం భారతదేశం వైపు చూస్తున్న సమయం ఇది. మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్ అధికారులుగా, మీరు అన్ని రక్షణ ఆయుధాలకు, అంటే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, కోస్ట్ గార్డ్, ఇతర సంస్థలకు వెనుక లైన్ ఇంజనీరింగ్ మద్దతును అందించడంలో కీలక పాత్ర పోషిస్తారు. సాయుధ దళాలకు మీరు అందించే అంకితమైన ఇంజినీరింగ్ మద్దతు వారి మొత్తం పనితీరును మెరుగుపరుస్తుంది, ఏవైనా అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి వారిని సిద్ధంగా ఉంచుతుంది... అని రాష్ట్రపతి తన ప్రసంగంలో తెలిపారు. 

భవన నిర్మాణ రంగంలో యువ అధికారులుగా పర్యావరణ పరిరక్షణకు కూడా పాటుపడటం ఎంఈఎస్ అధికారుల ప్రధాన కర్తవ్యమని రాష్ట్రపతి అన్నారు. సుస్థిర అభివృద్ధి కోసం పునరుత్పాదక శక్తిని పెంచే దిశగా మనం ముందుకు సాగాలి, పెద్ద సంఖ్యలో సోలార్ ఫోటోవోల్టాయిక్ ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడం ద్వారా జాతీయ కార్బన్ పాదముద్రను తగ్గించడంలో ఎంఈఎస్  గొప్పగా దోహదపడుతుందని ఆమె పేర్కొన్నారు. ప్రమాదకర రసాయనాల నుండి నివాసితులను రక్షించే కొత్త నిర్మాణ సామగ్రిని వారు ఆవిష్కరించగలరని, ఆమె చెప్పారు. సహజ పదార్థాలతో చుట్టుముట్టబడినప్పుడు మొత్తం మానవ శ్రేయస్సు పెరుగుతుందని రాష్ట్రపతి తెలిపారు. .

నిర్మాణ రంగం చాలా డైనమిక్‌గా ఉందని, సాంకేతికతలు చాలా వేగంగా మారుతున్నాయని రాష్ట్రపతి అన్నారు. ఆర్థిక వృద్ధి, అభివృద్ధిలో ఈ రంగం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ ఆధునిక సాధనాలను ఉపయోగించి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో ఎంఈఎస్ అధికారులు ఎంతో దోహదపడతారని ఆమె అన్నారు. మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అత్యాధునిక సాంకేతికతలను తమ భవిష్యత్ ప్రాజెక్ట్‌లలో ఉపయోగించుకోవాలని ఆమె వారిని కోరారు. ఇది మరింత సమర్థవంతమైన రూపకల్పన, నిర్మాణాన్నీ తక్కువ వ్యవధిలో పూర్తి చేసేలా సహాయపడుతుందని ఆమె అన్నారు.
 

గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఎంఈఎస్ మొట్టమొదటి 3డి ప్రింటెడ్ హౌస్‌లను పూర్తి చేయడం పట్ల రాష్ట్రపతి సంతోషం వ్యక్తం చేశారు. తక్కువ ఖర్చు, వృధాను నివారించడంలో సహాయపడే ఇలాంటి సాంకేతికతలను మరిన్ని ఉపయోగించేందుకు ప్రయత్నించాలని ఆమె  ఎంఈఎస్ అధికారులను కోరారు. సాధ్యమైన చోట పదార్థాల రీసైక్లింగ్‌ను ప్రోత్సహించాలని ఆమె సూచించారు. 

Please click here to see the President's Speech - 

***

(Release ID: 1889007) Visitor Counter : 182