గనుల మంత్రిత్వ శాఖ

సాంకేతిక సహకారం కోసం ధన్‌ బాద్‌ లోని ఐ.ఐ.టి. (ఐ.ఎస్.ఎం) తో అవగాహన ఒప్పందంపై సంతకం చేసిన - హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్


ముడి ఖనిజం ఉత్పత్తిలో మూడు రెట్లు వృద్ధి కోసం కృషి చేస్తున్న - హెచ్.సి.ఎల్.

Posted On: 04 JAN 2023 12:21PM by PIB Hyderabad

హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ మరియు ధన్‌ బాద్‌ లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్) మధ్య సహకారం, ప్రాయోజిత పరిశోధన ప్రాజెక్టుల కోసం కోల్‌కతాలోని హెచ్‌.సి.ఎల్. కార్పొరేట్ కార్యాలయంలో హెచ్.సి.ఎల్. చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ అరుణ్ కుమార్ శుక్లా మరియు ధన్‌ బాద్ లోని ఐ.ఐ.టి. (ఐ.ఎస్.ఎం) డైరెక్టర్ ప్రొఫెసర్ రాజీవ్ శేఖర్ సమక్షంలో అవగాహన ఒప్పందం (ఎం.ఓ.యు) కుదిరింది. 

ధన్‌బాద్‌ లోని ఐ.ఐ.టి. (ఐ.ఎస్.ఎం) తో మొదటి సాంకేతిక సహకారం తీసుకోవడం, దేశంలోని రాగి ఖనిజానికి సంబంధించిన అన్ని నిర్వహణ మైనింగ్ లీజులను కలిగి ఉన్న భారతదేశంలోని ఏకైక రాగి గనులను తవ్వే సంస్థ అయిన హెచ్.సి.ఎల్. కి ఒక ముఖ్యమైన ఘట్టం.  ప్రస్తుతం, ముడి ఖనిజం ఉత్పత్తిలో ఎక్కువ భాగం భూగర్భ విధానం ద్వారా మాత్రమే వస్తోంది.  సంవత్సరానికి సుమారు నాలుగు మిలియన్ టన్నుల వరకు ముడి ఖనిజం ఉత్పత్తి అవుతోంది. 

ఖనిజం సంక్లిష్ట భౌగోళిక లక్షణాలు, గనుల పెరిగిన లోతు కారణంగా, భద్రతా ప్రమాణాలను నిర్వహించడం, అభివృద్ధి చెందుతున్న స్థిరత్వం సమస్యలతో వ్యవహరించడంతో పాటు ఉత్పత్తి ప్రక్రియలో సాంకేతిక / కార్యాచరణ సమస్యలతో పాటు వివిధ భౌగోళిక-సాంకేతిక, భూగర్భ జల సంబంధిత సమస్యలు ఎదురవుతున్నాయి. 

ముడి ఖనిజ ఉత్పత్తి సామర్థ్యాన్ని మూడు రెట్లు పెంచాలన్న దాని విస్తరణ దశలో భాగంగా, హెచ్‌.సి.ఎల్. ప్రాజెక్టులలో అభివృద్ధి కార్యకలాపాలు ప్రకృతిలో కొనసాగుతున్నాయి లేదా ఇప్పటికే దాని గనులలో చాలా వరకు ప్రణాళిక ప్రకారం కొనసాగుతున్నాయి.   ప్రస్తుతం, తవ్విన ముడి ఖనిజాన్ని దాని స్వంత ఖనిజ శుద్ధీకరణ కర్మాగారాల్లో ప్రాసెస్ చేయడం జరుగుతోంది. మెటల్స్-ఇన్-కాన్‌సెంట్రేట్ (ఎం.ఐ.సి) దేశీయ మార్కెట్‌ లో పాక్షికంగా, మిగిలినవి అంతర్జాతీయ మార్కెట్‌ లో విక్రయించడం జరుగుతోంది.

హెచ్.సి.ఎల్. నిర్ణయించుకున్న విస్తరణ కార్యక్రమాన్ని సాధించడంలో భాగంగా జాతీయ ఖ్యాతిని కలిగి ఉన్న ధన్‌బాద్ లోని ఐ.ఐ.టి-ఐ.ఎస్.ఎం. సంస్థ, ముఖ్యంగా ఖనిజాల మైనింగ్, దాని శుద్ధీకరణ తో పాటు భూ విజ్ఞాన శాస్త్ర రంగాల్లో, అభివృద్ధి చెందుతున్న భౌగోళిక, సాంకేతిక, పర్యావరణ, స్థిరమైన, ధాతువు శుద్ధీకరణ సమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించనుంది. 

అత్యాధునిక సాంకేతికతలను ఉపయోగించడం, ఉత్పాదకత, భద్రత మెరుగుదల, పర్యావరణ అనుమతులతో మైనింగ్ పద్ధతులను సవరించడం ద్వారా రాగి ఖనిజ ఉత్పత్తిని మెరుగుపరచడం కోసం ఐ.ఐ.టి-ఐ.ఎస్.ఎం. నుండి సాంకేతిక సహాయం, మార్గదర్శకత్వం, సలహా, సంప్రదింపులతో పాటు, వివిధ జల సంబంధమైన,  జల-భౌగోళిక అధ్యయనాలు, రాగి ఖనిజ అన్వేషణ కోసం జియోఫిజికల్ ఎక్స్‌ప్లోరేషన్, రిమోట్ సెన్సింగ్ మొదలైన సంప్రదాయేతర అన్వేషణ పద్ధతుల్లో హెచ్.సి.ఎల్. అవసరాలను ప్రస్తుత ఎం.ఒ.యు. పరిష్కరిస్తుంది.  భారతీయ రాగి గనుల రంగం మెరుగుదల కోసం పరిశోధన, అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టడంతో పాటు, నైపుణ్యాభివృద్ధి కోసం హెచ్.సి.ఎల్. ఇంజనీర్లు, మేనేజర్లకు శిక్షణ, అభివృద్ధి, అన్వేషణ, ధాతువు శుద్ధీకరణ వంటి అనేక ఇతర చట్టబద్ధమైన రంగాల్లో జ్ఞానాన్ని పెంపొందించడం  / గని నియంత్రణ సవరణలు లేదా సంబంధిత సమస్యల పరిష్కారానికి, ఐ.ఐ.టి-ఐ.ఎస్.ఎం. భాగస్వామి కావాలని కంపెనీ కోరుకుంటోంది. 

 

 

*****



(Release ID: 1888777) Visitor Counter : 111