యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

త‌మ నూత‌న సంవ‌త్స‌ర‌పు ఫిట్‌నెస్ ప్ర‌ణాళిక‌ను రూపొందించుకోవ‌డానికి పౌరుల‌కు నూత‌న‌ ఫిట్ ఇండియా టాక్ షో ద్వారా తోడ్ప‌డనున్న భార‌త‌దేశ‌పు అగ్ర‌శ్రేణి పౌష్టికాహార‌, పిట్‌నెస్ నిపుణులు

Posted On: 04 JAN 2023 3:33PM by PIB Hyderabad

కీల‌కాంశాలుః
- ఫిట్ ఇండియా ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్ హాండిల్స్‌పై 8 జ‌న‌వ‌రి నుంచి 26 ఫిబ్ర‌వ‌రి 2023 వ‌ర‌కు ప్ర‌తి ఆదివారం ఉద‌యం 11 గంట‌ల‌కు కార్య‌క్ర‌మం ప్రారంభం అవుతుంది

- మొద‌టి సిరీస్‌లోని 8 ఉప‌న్యాసాలకు ఫిట్ ఇండియా హెల్దీ హిందుస్తాన్  అన్న శీర్షిక‌ను ఇచ్చారు.
నూత‌న సంవ‌త్స‌రాన్ని పుర‌స్క‌రించుకొని యువ‌జ‌న వ్య‌వ‌హారాలు, క్రీడ‌ల మంత్రిత్వ శాఖ ప్ర‌తిష్ఠాత్మ‌క కార్య‌క్ర‌మ‌మైన ఫిట్ ఇండియా ఉద్య‌మం ఫిట్ ఇండియా - సండే టాక్స్ (ఉప‌న్యాసాలు) శీర్షిక‌న ప్ర‌త్యేక ఆన్‌లైన్ సిరీస్ ను ప్రారంభించేందుకు స‌న్నాహాలు చేస్తోంది.  ప్ర‌ముఖ ఫిట్‌నెస్ నిపుణులు, ఫిట్ ఇండియా దిగ్గ‌జాల‌తో టాక్‌షో 8 జ‌న‌వ‌రి నుంచి 26 ఫిబ్ర‌వ‌రి 2023 వ‌ర‌కు ఫిట్ ఇండియా అధికారిక ఇన్‌స్టా గ్రాం, యూట్యూబ్ హాండిల్స్‌పై ప్ర‌తి ఆదివారం ఉద‌యం 11 గంట‌ల‌కు ప్రారంభం కానుంది. ఈ కార్య‌క్ర‌మంలో తొలి సిరీస్‌లోని 8 ఉప‌న్యాసాలు ఫిట్ ఇండియా హెల్దీ హిందుస్తాన్ అన్న శీర్షిక‌తో జ‌రుగుతాయి. 
ఆరోగ్య‌వంత‌మైన దేశాన్ని సృష్టించాల‌న్న ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోడీ దార్శ‌నిక‌త‌ను దృష్టిలో ఉంచుకుని, ఫిట్ ఇండియా ఆదివారం ఉప‌న్యాసాలు అన్ని వ‌య‌సుల వారిలో, ముఖ్యంగా సీనియ‌ర్ సిటిజెన్ల‌లో  ఫిట్‌నెస్‌, ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారపు అల‌వాట్లు, మాన‌సిక ఆరోగ్యంవంటి అంశాల ప్రాముఖ్య‌త‌ను ప్రోత్స‌హించే ల‌క్ష్యంతో జ‌రుగనున్నాయి.  
ఫిట్ ఇండియా హెల్దీ హిందుస్తాన్ ప్యాన‌లిస్టుల‌లో లూక్ కౌటినో (జీవ‌న‌శైలి నిపుణులు), ర‌యాన్ ఫెర్నాండో, హినా భీమానీ (పౌష్టికాహార నిపుణులు) , సంగ్రామ్ సింగ్ ( కుస్తీ యోధుడు/  మోటివేష‌న‌ల్ స్పీక‌ర్ (ప్రేర‌ణాత్మ‌క వ‌క్త‌) ఉన్నారు. ఈ చొర‌వ గురించి మాట్లాడుతూ, ఫిట్ ఇండియా హెల్దీ హిందుస్తాన్ కార్య‌క్ర‌మం ప్ర‌భుత్వం చేప‌ట్టిన ప్ర‌శంస‌నీయ‌మైన చొర‌వ‌, ప్ర‌తి ఒక్క‌రూ ఈ ప్ర‌చారంలో చేరి, దాని నుంచి ల‌బ్ధి పొందాల‌ని సంగ్రామ్ సింగ్ అన్నారు. నా అభిప్రాయంలో ఆరోగ్య‌వంత‌మైన శ‌రీరం క‌లిగిన వ్య‌క్తే అత్యంత సంప‌న్నుడు , ప‌రిపూర్ణుడు. ఈ ఉప‌న్యాసాల ద్వారా, అన్ని వ‌య‌సుల వారూ అనుస‌రించ‌ద‌గిన  కొన్ని ప్రాథ‌మిక స‌హ‌జ ప‌ద్ధ‌తుల‌ను నేను పంచుకుంటాను, అని ఆయ‌న అన్నారు. 
ఫిట్‌గా ఉండ‌ట‌మ‌న్న‌ది సీనియ‌ర్ సిటిజెన్ల‌కు చాలా ముఖ్యం, అలా ఉన్న‌ప్పుడు వారు వ‌యో సంబంధిత వ్యాధుల‌పై పోరాడ‌గ‌ల‌రు. దీని గురించి మాట్లాడుతూ, వ‌య‌సు పెర‌గ‌డ‌మ‌నేది స‌హ‌జం, దానిని నిరోధించ‌లేమ‌ని హీనా భీమానీ అన్నారు. కానీ, స‌రైన ఆరోగ్య వ్యూహాల‌తో వ్య‌క్తి సుదీర్ఘ‌కాలం, ఆరోగ్యంగా, ఆనందంగా జీవించ‌వ‌చ్చు. ఫిట్ ఇండియా హెల్దీ హిందుస్తాన్ సీనియ‌ర్ సిటిజ‌న్లు గౌర‌వప్ర‌దంగా ఆరోగ్య‌వంత‌మైన జీవితాన్ని సాగించేందుకు కొన్ని చిట్కాల‌ను ఇవ్వాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంది. జీవ‌న శైలిలో చిన్న చిన్న మార్పులు భారీ ప్ర‌భావాన్ని చూప‌గ‌ల‌వు అని ఆమె పేర్కొన్నారు. 
పౌష్టికాహార నిపుణుడు ర‌యాన్ ఫెర్నాండో త‌న సెష‌న్‌లో ఫిట్‌గా వుండేందుకు త‌గినంత నిద్ర ప్రాముఖ్య‌త‌ను గురించి మాట్లాడ‌డంతో పాటుగా, మొత్తం సంక్షేమానికి సంబంధించిన అంశాల‌ను గురించి ప్ర‌సంగిస్తారు. ఫిట్ ఇండియా ఉద్య‌మంతో పౌరుల‌కు వివిధ ఆరోగ్య సంబంధిత వ‌న‌రులు, మార్గ‌ద‌ర్శ‌నం అందుబాటులో ఉన్నాయి, ఇవి ఆరోగ్యం గురించి ఎరుక‌తో కూడిన నిర్ణ‌యాలు తీసుకునేందుకు తోడ్ప‌డుతున్నాయ‌ని ఆయ‌న అన్నారు. ఫిట్ ఇండియా హెల్దీ హిందుస్తాన్ సిరీస్ అన్న‌ది స‌రైన స‌ల‌హాతో పౌరుల‌ను మ‌రింత సాధికారం చేసే ప్ర‌య‌త్నమ‌ని పేర్కొన్నారు. 
అంత‌ర్జాతీయ చిరుధాన్యాల సంవ‌త్స‌రంగా 2023ను జ‌రుపుకునేందుకు చిరుధాన్యాల ప్రాముఖ్య‌త‌ను గురించి నిపుణులు మాట్లాడేందుకు మ‌రొక విభాగం కూడా ఉంటుంది. 


***


(Release ID: 1888714)