జల శక్తి మంత్రిత్వ శాఖ

వాటర్ విజన్ @ 2047 పై సమాలోచనలు నిర్వహించనున్న వార్షిక మంత్రుల సమావేశం

Posted On: 04 JAN 2023 2:27PM by PIB Hyderabad
2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా అభివృద్ధి చేయాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, విజన్ డాక్యుమెంట్ ఆఫ్ ఇండియా @ 2047 ని సిద్ధం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం విస్తృత స్థాయి చర్చలు జరుపుతోంది. నీటి కొరత సమస్యను  ఇండియా @ 2047 ప్రణాళికలో ప్రధానమంత్రి '5 పి' లను  ప్రతిపాదించారు.  రాజకీయ సంకల్పం, ప్రజల నుంచి నిధుల సేకరణ, భాగస్వామ్యాలు, ప్రజా భాగస్వామ్యం మరియు సుస్థిరత కోసం కృషి జరగాలని ప్రధానమంత్రి పేర్కొన్నారు. నిర్ణీత భారీ లక్ష్యాన్ని చేరుకోవడానికి భారతదేశం చేస్తున్న కృషిలో జలవనరుల రంగంలో కీలక పాత్ర పోషిస్తుంది. సవాళ్లను ఎదుర్కొని లక్ష్యాన్ని సాధించడానికి అమలు చేయాల్సిన కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన కోసం జల్ శక్తి మంత్రిత్వ శాఖ మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో 2023 జనవరి 5,6 తేదీల్లో రాష్ట్ర మంత్రుల జాతీయ సమావేశాన్ని తొలిసారిగా ఏర్పాటు చేసింది. 'వాటర్ విజన్ @' ఇతివృత్తంతో సదస్సు జరుగుతుంది. ఇండియా @ 2047 రూపకల్పన, ప్రధానమంత్రి ప్రతిపాదించిన '5 పి' లపై రాష్ట్రాలు సంబంధిత వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించడం ప్రధాన లక్ష్యంగా సదస్సు జరుగుతుంది. రాష్ట్ర అంశంగా నీరు ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని లక్ష్య సాధనలో రాష్ట్రాలను భాగస్వామ్యం చేసి,పథకాలు అమలు చేయాలని  జల్ శక్తి మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. 
* మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో జల రంగంపై  2023 జనవరి 5,6 రాష్ట్ర మంత్రుల జాతీయ సమావేశం 
* ప్రధానమంత్రి రూపొందించిన ఇండియా @ 2047 ప్రణాళికలో భాగంగా వాటర్ విజన్ @ 2047 అమలు 
* నీటి భద్రత, జల వనరుల సమర్ధ వినియోగం, జలవనరుల నిర్వహణ, జలవనరుల కోసం మౌలిక సదుపాయాలు, నీటి నాణ్యత అంశాలపై సమాలోచనలు 
* సమావేశంలో పాల్గొనున్నఅన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల జలవనరులు, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగం, నీటిపారుదల శాఖల రాష్ట్ర మంత్రులు 
* వాటర్ విజన్ @ 2047 పై నివేదిక, దేశంలో నీటి సమస్యల పరిష్కారం కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్న సమావేశం 
..
 సమావేశానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ హాజరవుతారు. కేంద్ర జల శక్తి, ఫుడ్ ప్రాసెసింగ్ సహక సహాయ మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవిస్ ల అధ్యక్షతన జల వనరుల యాజమాన్యం అనే అంశంపై చర్చలు జరుగుతాయి. వాటర్ విజన్@2047 యొక్క బ్లూ ప్రింట్‌,  దేశంలోని నీటి సమస్యలను పరిష్కరించడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని  రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన  జలవనరులు, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్ (పిహెచ్‌ఇడి) మరియు నీటిపారుదల శాఖల మంత్రులను జల శక్తి మంత్రిత్వ శాఖ కోరింది. 

వ్యవసాయ ఉత్పత్తి కమీషనర్‌లతో పాటు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన  జలవనరులు, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్ (పిహెచ్‌ఇడి) మరియు నీటిపారుదల శాఖల   సీనియర్ కార్యదర్శులు కూడా సదస్సుకు హాజరవుతారు. నీటి రంగంలో కొత్త ఆవిష్కరణలపై యువ ఆవిష్కర్తలు/స్టార్టప్‌లు ప్రదర్శించే ప్రదర్శన ఉంటుంది.
సదస్సులో వివిధ అంశాలపై సమగ్ర చర్చలు జరిగి సమగ్ర నివేదిక రూపొందించాలన్న లక్ష్యంతో వాటర్ విజన్@2047పై ప్రత్యేక సదస్సు జరుగుతుంది.మొత్తం 5 అంశాలపై సమావేశంలో సదస్సులు నిర్వహిస్తారు. .
i. నీటి కొరత , నీటి మిగులు మరియు కొండ ప్రాంతాల్లో నీటి భద్రత,
ii. వేస్ట్ వాటర్/గ్రే వాటర్  పునర్వినియోగం తో సహా నీటి వినియోగ సామర్థ్యం పెంపుదల
iii. జలవనరుల నిర్వహణ 
iv. వాతావరణ మార్పులు తట్టుకోగల నీటి మౌలిక సదుపాయాల కల్పన
v. నీటి నాణ్యత.
నీటి కొరత , నీటి మిగులు మరియు కొండ ప్రాంతాల్లో నీటి భద్రత  రంగాలకు  వివిధ అంశాలను మొదటి సదస్సులో చర్చిస్తారు. రెండవ సదస్సులో ప్రజల భాగస్వామ్యంతో క్షేత్ర స్థాయిలో వేస్ట్ వాటర్/గ్రే వాటర్  పునర్వినియోగం తో సహా నీటి వినియోగ సామర్థ్యం పెంపుదల అమలు చేయడం అంశాలపై చర్చలు జరుగుతాయి. . "జలవనరుల నిర్వహణ "పై మూడవ సదస్సులో   జల రంగంలో ఎదురవుతున్న సమస్యలు గుర్తించి   వివిధ రాష్ట్రాల సహకారంతో వీటిని పరిష్కరించే మార్గాలను సిద్ధం చేస్తుంది.  4వ సదస్సులో దేశంలో వాతావరణ మార్పుల  ప్రభావం  మరియు వాతావరణ మార్పు ప్రభావాన్ని తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలను చర్చిస్తుంది.  నీటి నాణ్యత పై జరిగే 5వ సదస్సు తాగునీటి నాణ్యత, ఉపరితల జలాలు మరియు భూగర్భ జలాల సమస్యలపై చర్చలు జరుపుతుంది.
2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్య సాధన కోసం ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయడానికి ప్రణాళిక రూపొందించే విధంగా సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. .

***



(Release ID: 1888712) Visitor Counter : 201