మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
2023 జనవరి 27న పరీక్ష పే చర్చ ( పిపిసి) .. ప్రకటించిన శ్రీ ధర్మేంద్ర ప్రధాన్
పిపిసి -2023 కోసం 38.80 లక్షల మంది నమోదు , పిపిసి -2022 లో పాల్గొన్న సుమారు 15.7 లక్షల మంది
పిపిసి-2023 కోసం 150 దేశాలకు చెందిన విద్యార్థులు, 51 దేశాల ఉపాధ్యాయులు, 50 దేశాల తల్లిదండ్రులు నమోదు చేసుకున్నారు
150 దేశాలకు చెందిన విద్యార్థులు, 51 దేశాల ఉపాధ్యాయులు, 50 దేశాల తల్లిదండ్రులు పిపిసి-2023 లో పాల్గొనడానికి నమోదు
Posted On:
03 JAN 2023 7:21PM by PIB Hyderabad
పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులతో "పరీక్షా పే చర్చా 2023" 6 వ ఎడిషన్ ను న్యూ ఢిల్లీ లోని తాల్ కటోరా ఇండోర్ స్టేడియంలో 2023 జనవరి 27న నిర్వహించనున్నట్లు కేంద్ర విద్య మరియు నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఈ రోజు ప్రకటించారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వినూత్నంగా పరీక్షా పే చర్చా ను రూపొందించారు, కార్యక్రమంలో దేశ, విదేశాలకు చెందిన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొని పరీక్షల సమయంలో, జీవితంలో ఎదురవుతున్న సమస్యలు, ఆందోళనలపై ప్రధానమంత్రి తో చర్చలు జరుపుతారు. ఒత్తిడిని అధిగమించి జీవితాన్ని ఉత్సాహంగా గడపడానికి ఈ కార్యక్రమం సహాయపడుతుంది. విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన పాఠశాల విద్య మరియు అక్షరాస్యత విభాగం గత ఐదు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తోంది.
2023 పిపిసి లో పాల్గొనడానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు రాష్ట్ర బోర్డులు, సీబీఎస్ఈ, కెవిఎస్, ఎన్విఎస్ మరియు ఇతర బోర్డులు ఉత్సాహంగా చూపుతున్నారు. 2022 తో పోలిస్తే ఈ ఏడాది రిజిస్ట్రేషన్లు రెట్టింపు అయ్యాయి. 38.80 లక్షల మంది (విద్యార్థులు- 31.24 లక్షలు, ఉపాధ్యాయులు - 5.60 లక్షలు, తల్లిదండ్రులు - 1.95 లక్షలు) పిపిసి -2023 కోసం నమోదు చేసుకున్నారు. 150 దేశాలకు చెందిన విద్యార్థులు, 51 దేశాలకు చెందిన ఉపాధ్యాయులు, 50 దేశాల తల్లిదండ్రులు కూడా పిపిసి -2023 లో పాల్గొనడానికి నమోదు చేసుకున్నారు.
కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ రూపొందించిన కోవిడ్ -19 నిబంధనలు పాటిస్తూ 2022 టౌన్ హాల్ తరహా విధానంలో కార్యక్రమం జరుగుతుంది. 2022 నవంబర్ 25 నుంచి డిసెంబర్ 30 వరకు వివిధ అంశాలపై https://innovateindia.mygov.in/ppc-2023/ లో ఆన్ లైన్ క్రియేటివ్ వ్యాసరచన పోటీ నిర్వహించబడింది, ఈ క్రింద పేర్కొన్న వివిధ అంశాల్లో పాల్గొనడానికి (9 నుంచి 12 తరగతుల పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు) ఎంపిక చేయడం జరిగింది:
విద్యార్థుల కోసం రూపొందించిన అంశాలు:
1. మీ స్వాతంత్ర్య సమరయోధుల గురించి తెలుసుకోండి
2. మన సంస్కృతి మన గర్వకారణం
3. నా పుస్తకం నా ప్రేరణ
4. భవిష్యత్తు తరాల కోసం పర్యావరణాన్ని రక్షించడం
5. నా జీవితం, నా ఆరోగ్యం
6. నా స్టార్టప్ కల
7. స్టెమ్ విద్య/ హద్దులు లేని విద్య
8. పాఠశాలల్లో అభ్యసన కోసం బొమ్మలు మరియు ఆటలు
II. ఉపాధ్యాయుల కోసం అంశాలు
1. మన వారసత్వం
2. అభ్యసన వాతావరణాన్ని అభివృద్ధి చేయడం
3. నైపుణ్యం కోసం విద్య
4. తక్కువ పాఠ్యప్రణాళిక లోడ్ మరియు పరీక్షల పట్ల భయం లేకుండా చేయడం
5. భవిష్యత్ విద్యాపరమైన సవాళ్లు
III. తల్లిదండ్రుల కోసం రూపొందించిన అంశాలు:
1. నా బిడ్డ, నా గురువు
2. వయోజన విద్య - ప్రతి ఒక్కరినీ అక్షరాస్యులను చేయడం
3. నేర్చుకోవడం మరియు కలిసి పెరగడం
మైగవ్ ద్వారా నిర్వహించిన సృజనాత్మక రచన పోటీలో విజేతలుగా నిలిచిన సుమారు 2050 మందికి ప్రత్యేక పరీక్షా పే చర్చా కిట్ తో పాటు హిందీ మరియు ఇంగ్లీష్ లో ప్రధానమంత్రి రాసిన ఎగ్జామ్ వారియర్స్ పుస్తకం సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది. ఎన్ సీఈఆర్ టీ ఎంపిక చేసే కొన్ని ప్రశ్నలు పీపీసీ-2023లో ఉంటాయి.
***
(Release ID: 1888685)
Visitor Counter : 164