రైల్వే మంత్రిత్వ శాఖ
ప్రయాణికుల విభాగంలో 71 శాతం మేర పెరిగిన రైల్వే ఆదాయం
రైల్వే రిజర్వ్‌డ్ ప్యాసింజర్ విభాగంలో 46 శాతం వృద్ధి నమోదు
అన్ రిజర్వ్‌డ్ ప్యాసింజర్ విభాగంలో 381 శాతం మేర వృద్ధి
प्रविष्टि तिथि:
02 JAN 2023 3:42PM by PIB Hyderabad
భారతీయ రైల్వే ప్రయాణీకుల విభాగంలో మెరుగైన వృద్ధిని కనబరిచింది. ఏప్రిల్ నుండి డిసెంబర్ 2022 మధ్య కాలంలో భారతీయ రైల్వే ప్రయాణీకుల విభాగంలో ఆదాయం సుమారుగా రూ. 48913 కోట్లకు చేరుకుంది. అంతకు ముందు ఏడాది ఇదే సమయంలో ఆర్జించిన ఆదాయం రూ.28569 కోట్లతో పోల్చితే ఇది 71 శాతం అధికం. రిజర్వ్ చేసిన ప్రయాణీకుల విభాగంలో 2022 ఏడాది ఏప్రిల్ 1 నుండి డిసెంబర్ 31 మధ్య కాలంలో టిక్కెట్లు బుక్ చేసిన మొత్తం ప్రయాణీకుల సంఖ్య.. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఆరు శాతం మేర పెరిగి 56.05 కోట్ల నుంచి 59.61 కోట్లకు చేరుకుంది. 2022 ఏప్రిల్ 1 నుండి డిసెంబర్ 31 వరకు రిజర్వ్ చేయని ప్రయాణీకుల విభాగం నుండి రూ.38483 కోట్ల ఆదాయం వచ్చింది. గత సంవత్సరం ఇదే కాలంలో ఈ విభాగం నుంచి ఆధాయం రూ.26400 కోట్లుగా ఉంది. అంటే ఈ విభాగంలో 46 శాతం పెరుగుదల చూపింది. అన్‌రిజర్వ్‌డ్ ప్యాసింజర్ సెగ్మెంట్లో 2022 ఏప్రిల్ 1 నుండి డిసెంబర్ 31 వరకు బుక్ చేసిన మొత్తం ప్రయాణీకుల సంఖ్య.. గత సంవత్సరం ఇదే కాలంలో నమోదైన 16,968 లక్షలతో పోలిస్తే 40,197 లక్షలకు పెరిగింది. అంటే దాదాపు 137% పెరుగుదల చోటు చేసుకుంది. 2022 ఏప్రిల్ 1 నుండి డిసెంబర్ 31 వరకు అన్రిజర్వ్డ్ ప్యాసింజర్ సెగ్మెంట్ నుండి ఆదాయం రూ.10430 కోట్లుగా ఉంది, గత ఏడాది ఇదే కాలంలో ఈ తరహా ఆదాయం రూ. 2169 కోట్లుగా ఉంది. అంటే ఈ విభాగం 381 శాతం వృద్ధిని చూపింది.
***
(रिलीज़ आईडी: 1888194)
आगंतुक पटल : 155