శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

నాగ్ పూర్ లో రేపు 108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ను ప్రారంభించనున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ;

మహిళలతో సహా సమాజంలోని అన్ని వర్గాల సమ్మిళిత భాగస్వామ్యంతో సుస్థిర అభివృద్ధిపైదృష్టి సారించనున్న సైన్స్ కాంగ్రెస్

ఎంతో ఆలోచనతో ఈ సంవత్సరం సైన్స్ కాంగ్రెస్ కు "మహిళా సాధికారతతో సుస్థిరమైనఅభివృద్ధి కోసం సైన్స్ అండ్ టెక్నాలజీ" అనే ఇతివృత్తం ఖరారు  

ఈ సంవత్సరం ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ప్రత్యేకతగా "చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్"

ప్లీనరీ సెషన్ లలో పాల్గొననున్న నోబెల్ బహుమతి గ్రహీతలు, ప్రముఖ భారతీయ, విదేశీపరిశోధకులు, అంతరిక్షం, రక్షణ, ఐటి, వైద్య పరిశోధనతో సహా వివిధ రంగాలకు చెందిన నిపుణులు,సాంకేతిక నిపుణులు. 

సమాజానికి భారతీయ సైన్స్ , టెక్నాలజీ గణనీయమైన సేవలను ఆవిష్కరించే మెగా ఎక్స్పో "ప్రైడ్ ఆఫ్ ఇండియా" సైన్స్ కాంగ్రెస్ కు ప్రధాన ఆకర్షణ

Posted On: 02 JAN 2023 3:01PM by PIB Hyderabad

108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ను రేపు నాగ్ పూర్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. మహిళలతో సహా సమాజంలోని అన్ని వర్గాల సమ్మిళిత ప్రమేయంతో స్థిరమైన అభివృద్ధిపై ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ దృష్టి పెడుతుంది.

 

కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎర్త్ సైన్సెస్ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) డాక్టర్ జితేంద్ర సింగ్ మీడియాతో మాట్లాడుతూ, ఈ సంవత్సరం సైన్స్ కాంగ్రెస్ కు "మహిళా సాధికారతతో స్థిరమైన అభివృద్ధి కోసం సైన్స్ అండ్ టెక్నాలజీ" అనే ప్రధాన ఇతివృత్తాన్ని చాలా ఆలోచనాత్మకంగా ఖరారు చేసినట్లు చెప్పారు. ఈ సదస్సు సమగ్ర అభవృద్ధి, సమీక్షించిన ఆర్థిక వ్యవస్థలు, సుస్థిర లక్ష్యాలపై చర్చిస్తుందని, అదే సమయంలో సైన్స్ అండ్ టెక్నాలజీలో మహిళల ఎదుగుదలకు అవకాశం ఉన్న అడ్డంకులను కూడా పరిష్కరిస్తుందని ఆయన తెలిపారు.

 

పిల్లలు సైన్స్ పట్ల తమ అభిరుచిని, ప్రతిభను ఉపయోగించుకోవడానికి శాస్త్రీయ ప్రయోగం ద్వారా వారి సృజనాత్మకతను గ్రహించడానికి అవకాశం కల్పించేందుకు ఈ సంవత్సరం ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ కు "చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్" ను జోడించడం ఒక ప్రత్యేకత అని జితేందర్ సింగ్ చెప్పారు.

 

ఈ సంవత్సరం సైన్స్ కాంగ్రెస్ కు "ట్రైబల్ సైన్స్ కాంగ్రెస్" పేరుతో ఒక కొత్త కార్యక్రమాన్ని చేర్చినట్లు కూడా డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఇది గిరిజన మహిళల సాధికారతను ప్రదర్శించడానికి ప్రయత్నిస్తుంది. దేశీయ యాస జ్ఞాన వ్యవస్థ ,అభ్యాసాన్ని ప్రదర్శించడానికి ఒక వేదికను కూడా అందిస్తుంది.

 

నోబెల్ గ్రహీతలు, ప్రముఖ భారతీయ, విదేశీ పరిశోధకులు, అంతరిక్షం, రక్షణ, ఐటి, వైద్య పరిశోధనతో సహా వివిధ రంగాలకు చెందిన నిపుణులు, సాంకేతిక నిపుణులు ఈ ప్లీనరీ సమావేశాల్లో పాల్గొంటారని మంత్రి తెలిపారు. టెక్నికల్ సెషన్ లలో అగ్రికల్చర్ అండ్ ఫారెస్ట్రీ సైన్సెస్, యానిమల్, వెటర్నరీ అండ్ ఫిషరీ సైన్సెస్, ఆంత్రోపోలాజికల్ అండ్ బిహేవియరల్ సైన్సెస్, కెమికల్ సైన్సెస్, ఎర్త్ సిస్టమ్ సైన్సెస్, ఇంజనీరింగ్ సైన్సెస్, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మెటీరియల్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, మెడికల్ సైన్సెస్, న్యూ బయాలజీ, ఫిజికల్ సైన్సెస్, ప్లాంట్ సైన్సెస్ లో అద్భుతమైన, అనువర్తిత పరిశోధనలను ప్రదర్శించనున్నట్టు మంత్రి తెలిపారు.

 

"ప్రైడ్ ఆఫ్ ఇండియా" పేరుతో మెగా ఎక్స్ పో మరో ఆకర్షణ అని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. ప్రభుత్వ, కార్పొరేట్, పి ఎస్ యులు, విద్యా , పరిశోధన -అభివృద్ధి సంస్థలు, ఆవిష్కర్తలు , దేశవ్యాప్తంగా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల సామర్ధ్యాలను, విజయాలను ఈ మెగా ఎక్స్ పో ప్రదర్శిస్తుంది. సైన్స్ లో ముఖ్య పరిణామాలు, ప్రధాన విజయాలు సమాజానికి భారతీయ సైన్స్ అండ్ టెక్నాలజీ సేవలను ఈ ప్రదర్శన ఆవిష్కరిస్తుంది.

 

14 విభాగాలతో పాటు మహిళా సైన్స్ కాంగ్రెస్, రైతు సైన్స్ కాంగ్రెస్, చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్, ట్రైబల్ మీట్, సైన్స్ అండ్ సొసైటీపై ఒక విభాగం, సైన్స్ కమ్యూనికేటర్స్ కాంగ్రెస్ ఉంటాయి.

 

మహారాష్ట్ర గవర్నర్, మహారాష్ట్ర ప్రభుత్వ యూనివర్సిటీల ఛాన్సలర్ భగత్ సింగ్ కోశ్యారి, కేంద్ర మంత్రి,

ఆర్ టి ఎం ఎన్ యు శతాబ్ది ఉత్సవాల సలహా కమిటీ చైర్మన్ నితిన్ గడ్కరీ, కేంద్ర శాస్త్ర, సాంకేతిక, భూ శాస్త్రాల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) డాక్టర్ జితేంద్ర సింగ్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్.

తదితరులు సైన్స్ కాంగ్రెస్ ప్రారంభోత్సవానికి హాజరుకానున్నారు.

 

రాష్ట్రశాంత్ తుక్డోజి మహారాజ్ నాగ పూర్ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ సుభాష్ ఆర్ చౌదరి, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ (ఐ ఎస్ సి ఎ), కోల్ కతా జనరల్ ప్రెసిడెంట్ డాక్టర్ (శ్రీమతి) విజయ్ లక్ష్మీ సక్సేనా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

 

విజ్ఞాన్ జ్యోత్ - జ్ఞాన జ్వాల - ఒలింపిక్ జ్వాల తరహాలో రూపొందించబడింది. ఇది సమాజంలో, ముఖ్యంగా యువతలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి అంకితమైన ఉద్యమం. 108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ముగిసే వరకు యూనివర్శిటీ క్యాంపస్ లో ఏర్పాటు చేసిన ఈ జ్వాల వెలుగుతూనే ఉంటుంది.

 

******



(Release ID: 1888183) Visitor Counter : 479