నౌకారవాణా మంత్రిత్వ శాఖ

డిసెంబర్ నెలలో రికార్డు నెలవారీ కార్గో నిర్వహణన జరిపిన పారాదీప్ పోర్ట్

Posted On: 02 JAN 2023 11:01AM by PIB Hyderabad

పారాదీప్ కొత్త సంవత్సరాన్ని మేటి ఘనతతో ప్రారంభించింది. ఈ పోర్ట్‌ డిసెంబరు మాసంలో ఆల్ టైమ్ రికార్డ్ కార్గో హ్యాండ్లింగ్ నిర్వహించింది.  2022 డిసెంబర్, 2022లో పారాదీప్ పోర్టు  12.6 ఎంఎటీల ఆల్ టైమ్ రికార్డ్ కార్గో హ్యాండ్లింగ్ జరిపింది. దేశంలోని అన్ని మేజర్ పోర్ట్‌ల చరిత్రలో ఇది అత్యధిక నెలవారీ కార్గో నిర్వహణ కావడం విశేషం. ఈ ఘనత సాధించేందుకు గాను విశేషంగా కృషి చేసిన పీపీఏ బృందాన్ని సంస్థ చైర్మన్ శ్రీ పి.ఎల్. హరనాధ అభినందించారు. కొత్త సంవత్సరం 2023 జనవరి నెలలోనే 100 ఎంఎంటీల కార్గో హ్యాండ్లింగ్ మార్క్‌ను దాటడానికి సిద్ధంగా ఉండడం పోర్ట్‌కి శుభప్రదం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 125 ఎంఎంటీ కంటే ఎక్కువ కార్గో హ్యాండ్లింగ్‌ను ఆల్ టైమ్ రికార్డ్‌ను సెట్ చేయడానికి పోర్ట్ సిద్ధంగా ఉంది. డిసెంబరుతో ముగిసిన సంవత్సరంలో 96.81 ఎంఎటీల కార్గోను నిర్వహించింది. గత ఆర్థిక సంవత్సరం సంబంధిత కాలంలో ఇది 83.6 ఎంఎటీగా నిలిచింది. ఈ సంవత్సరంలో పోర్ట్ ప్రవేశపెట్టిన వివిధ వ్యవస్థ మెరుగుదల చర్యలు గత సంవత్సరం కంటే 15.5 శాతం వృద్ధికి ఆజ్యం పోశాయి. కోస్టల్ థర్మల్ కోల్ హ్యాండ్లింగ్ గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే చెప్పుకోదగిన రీతిలో 58.11 శాతం వృద్ధిని కనబరిచింది. ఇది ఓడరేవులో నిర్వహించబడుతున్న మొత్తం కార్గో పరిమాణంలో 31.56 శాతంగా ఉంది. పారాదీప్ ఓడరేవు దేశంలోనే ముఖ్య  తీరప్రాంత షిప్పింగ్ హబ్‌గా అభివృద్ధి చెందుతోంది. రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ మరియు హర్యానాలో ఉన్న పవర్ హౌస్‌లకు తీరప్రాంత థర్మల్ బొగ్గును రవాణా చేయడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకు సాగుతోంది. 

 

****



(Release ID: 1888027) Visitor Counter : 184