శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

భారతదేశం @ 1947 సాధన లక్ష్యంగా ' 2023 సైన్స్ విజన్' .. కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


శాస్త్ర సాంకేతిక, ఆవిష్కరణ రంగం 2047 నాటికి ఇండియా @ 100 సాధనకు తోడ్పడుతుంది.. డాక్టర్ జితేంద్ర సింగ్

అమృత కాలంలో పరిశోధన, ఆవిష్కరణ రంగంలో భారతదేశం ప్రపంచ అగ్రగామి దేశంగా నిలబడేందుకు శాస్త్ర సాంకేతిక సంబంధిత పరిశోధనలు స్థానిక స్థాయికి చేరాలి.. డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 01 JAN 2023 2:33PM by PIB Hyderabad

2047 నాటికి భారతదేశ ప్రగతిని ' 2023 సైన్స్ విజన్' నిర్దేశిస్తుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక,భూ శాస్త్ర, సిబ్బంది వ్యవహారాలు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖ సహాయ ( స్వతంత్ర బాధ్యత) మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ ఢిల్లీలో ఈ రోజు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. 

  2047 నాటికి స్వతంత్ర భారతదేశం 100 ఏళ్లు పూర్తి చేసుకుని తన శతాబ్దపు కలలను సాకారం చేసుకోవడానికి సిద్ధంగా ఉందని డాక్టర్  జితేంద్ర సింగ్ అన్నారు. 2023 సంవత్సరం గత 25 ఏళ్లలో మొదటిది లేదా క్యాలెండర్ చివరి త్రైమాసికం అని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.

2023 సంవత్సరంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం జీ 20 అధ్యక్ష హోదాలో ప్రపంచానికి తన శక్తి సామర్ధ్యాలు చూపించడానికి సిద్ధంగా ఉందని అన్నారు. భారతదేశం ప్రతిపాదించిన విధంగా ప్రపంచ దేశాలు 2023 సంవత్సరాన్ని ప్రపంచ చిరుధాన్యాల సంవత్సరంగా పాటిస్తాయని మంత్రి వివరించారు. 

 

 

' “వినూత్న ఆలోచనలు మరియు లక్ష్యాలు సాధించాలి అన్న దృఢ విశ్వాసం, ధైర్యం ఉన్న వారికి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. ఈ లక్ష్యాల సాధనకు అవసరమైన స్ఫూర్తి, విశ్వాసం, ధైర్యం  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలకు అందిస్తున్నారు.సాధారణ ఆలోచనలకు భిన్నంగా ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న శ్రీ నరేంద్ర మోదీ 130 కోట్ల మంది భారతీయులు  ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే స్పూర్తి అందిస్తున్నారు' అని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. 

ఆవిష్కరణ రంగాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుర్తించి ప్రోత్సహిస్తున్నారని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.  స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి చేసిన ప్రసంగాన్ని ఆయన గుర్తు చేశారు. '  "    జై జవాన్ జై కిసాన్ అనే స్ఫూర్తిదాయకమైన పిలుపు ఇచ్చిన గౌరవనీయులైన లాల్ బహదూర్ శాస్త్రి ని ఈ రోజు వరకు మనం స్వరించు కుంటున్నాము. ఆ తర్వాత జై జవాన్ జై కిసాన్ నినాదానికి జై విజ్ఞానం జోడించారు. వీటికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ప్రస్తుత అమృత కాలంలో  'జై జవాన్ జై కిసాన్  జై విజ్ఞానం'  నినాదానికి   జై అనుసంధాన్ ( ఆవిష్కరణ) నినాదాన్నిజోడించాలి' అని ప్రధానమంత్రి చేసిన ప్రసంగాన్ని డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రస్తావించారు. 

ఈ అమృత కాలంలో  భారతదేశాన్ని పరిశోధన మరియు ఆవిష్కరణల ప్రపంచ కేంద్రంగా అభివృద్ధి చేయడానికి  అనేక రంగాల్లో ఏకకాలంలో పని చేయాల్సి ఉంటుంది అని  డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. దీనికోసం శాస్త్ర సాంకేతిక  సంబంధిత పరిశోధనలను స్థానిక స్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. 

2023 సంవత్సరంలో తమ ప్రాధాన్యతా రంగాలను గుర్తించిన శాస్త్ర సాంకేతిక విభాగాలు లక్ష్య సాధన కోసం ప్రణాళిక రూపొందించాయని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. 

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సూచన మేరకు అంతరిక్ష రంగంలో ప్రైవేటు రంగానికి ఇస్రో స్థానం కల్పించి ప్రగతి పథంలో సాగుతున్నదని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. తక్కువ సమయంలో 100 కి పైగా అంకుర సంస్థలు ఇస్రోతో కలిసి పనిచేస్తున్నాయని అన్నారు. ప్రైవేటు రంగానికి తగిన ప్రోత్సాహం అందిస్తున్న ఇస్రో తన శాస్త్ర సాంకేతిక కార్యక్రమాలు కొనసాగిస్తూ 2024లో మానవ అంతరిక్ష యాత్ర  "గగన్ యాన్ " ప్రయోగానికి సిద్ధం అవుతున్నదని డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. 

 

 

బయోటెక్నాలజీ విభాగం  (DBT)  ఇప్పటికే ఉన్న మరియు అభివృద్ధి చెందుతున్న వ్యాధులకు వ్యాక్సిన్‌లను మెరుగుపరచడంలో పెట్టుబడి పెట్టి తగిన సహకారంతో కోవిడ్ -19 వ్యాక్సిన్ మిషన్ ద్వారా  విజయాలను ముందుకు తీసుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. అంతర్జాతీయ చిరు ధాన్యాల  సంవత్సరంలో చిరు ధాన్యాలు, మొక్కల వైరస్‌ల పాథో-జెనోమిక్స్‌పై  ముఖ్యమైన  మిషన్లు ప్రారంభిస్తామని అన్నారు. 
2023లో CSIR  గ్రీన్ హైడ్రోజన్‌పై దృష్టి సారిస్తుందని చెప్పారు. ఇది ఇప్పటికే స్వచ్ఛమైన శక్తి మిషన్‌లో భాగంగా గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ను   CSIR దేశంలో అమలు చేస్తున్నదని అన్నారు. 
  రాబోయే సంవత్సరాల్లో భారతదేశ ఆర్థిక వ్యవస్థకు విలువ జోడించే డీప్ సీ మిషన్, టెక్నాలజీలపై  భూ శాస్త్ర మంత్రిత్వ శాఖ దృష్టి సారిస్తుందని వివరించిన డాక్టర్ జితేంద్ర సింగ్ . 2023 బ్లూ ఎకానమీ మరింత అభివృద్ధి సాధిస్తుందని అన్నారు.  ప్రధాని మోదీ తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో రెండుసార్లు మొదట 2021లో ఆపై మళ్లీ 2022లో డీప్ ఓషన్ మిషన్‌ను ప్రస్తావించిన అంశాన్నిమంత్రి గుర్తు చేశారు. 

భారతదేశ ఎన్నికల నిర్వహణకు తన సహకారంలో భాగంగా  భారత ఎన్నికల కమిషన్‌కు బ్యాలెట్ యూనిట్లు (బియు), కంట్రోల్ యూనిట్లు (సియు) మరియు ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వివిపిఎటి) కలిపి దాదాపు 21.00 లక్షల పరికరాలను అణు ఇంధన శాఖ అందిస్తుందని మంత్రి తెలిపారు.  సెప్టెంబర్/అక్టోబర్ 2023 నాటికి ఈసీఐఎల్ ఈ కార్యక్రమం పూర్తి చేస్తుందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. .

***



(Release ID: 1887990) Visitor Counter : 490