బొగ్గు మంత్రిత్వ శాఖ
గనుల పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఎనిమిది ఇకో పార్కులను నిర్మించిన బొగ్గు రంగం; 2023లో మరో రెండు పార్కులు పూర్తి
Posted On:
30 DEC 2022 1:13PM by PIB Hyderabad
పునరుద్ధరించిన భూమిపై ఇకో పార్క్‌లను అభివృద్ధి చేసేందుకు, గనుల పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దేశంలోని భిన్న ప్రాంతాలలో ఎనిమిది ఇకో పార్క్‌లను నిర్మించగా, 2022-23 నాటికి మరో రెండు అటువంటి పార్కులను నిర్మాణాన్ని పూర్తి చేయనున్నారు.
కేంద్ర బొగ్గు, గనులు & పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి అక్టోబర్ 2022న డబ్ల్యుసిఎల్ కు చెందిన ఝురే/ బాల గంగాధర్ తిలక్ ఇకో పార్క్‌ను ప్రారంభించారు. గనుల పర్యావరణ పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఎన్ఎల్‌సిఐఎల్ ఇటీవల పాండిచ్చేరి టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (పిటిడిసి)తో అవగాహనా ఒప్పందం పై సంతకాలు చేయడమే కాక, గని I & IIలు స్థిరమైన మైనింగ్ కార్యకలాపాలను ప్రదర్శిస్తాయి.
సింగ్రౌలీ ఇకో టూరిజం సర్క్యూట్‌ను ప్రోత్సహించేందుకు ఎన్‌సిఎల్, మధ్య ప్రదేశ్ టూరిజం బోర్డు మధ్య అవగాహనా ఒప్పందం, మహారాష్ట్ర డైరెక్టొరేట్ ఆఫ్ టూరిజంతో విపిఓలతో చేసుకున్న ఒప్పందం బొగ్గు రంగంలో ఇకో టూరిజంను మరింత ప్రోత్సహించనున్నాయి.
సుస్థిర అభివృద్ధి, హరితీకరణ కార్యక్రమాలకు అనుగుణంగా బొగ్గు/ లిగ్నైట్ పిఎస్‌యులుఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ వరకు 2300 హెక్టార్ల భూమిలో సుమారు47 లక్షల మొక్కలను నాటారు.
****
(Release ID: 1887552)