హోం మంత్రిత్వ శాఖ
సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్) మొబైల్ యాప్ 'ప్రహరి'ను, 13 మాన్యువల్స్ సవరించినవెర్షన్ ను న్యూఢిల్లీలో ఆవిష్కరించిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
ఇది జిపిఎఫ్, బయో డేటా లేదా "సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవియన్స్ రిడ్రెస్అండ్ మానిటరింగ్ సిస్టమ్" (సిపి-జి ఆర్ ఎ ఎమ్ఎస్ ) లేదా వివిధ సంక్షేమ పథకాలకుసంబంధించిన సమాచారం కావచ్చు, ఇప్పుడు జవాన్లు ఈ మొత్తం సమాచారాన్ని యాప్ ద్వారా పొందవచ్చుఈ అనువర్తనం వారిని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పోర్టల్ తో కూడా అనుసంధానిస్తుంది.
దీనికి అదనంగా, 13 మాన్యువల్స్ సవరణ, నవీకరణ వల్ల ఆపరేషన్ లు, అడ్మినిస్ట్రేషన్ , శిక్షణ గురించి మరింత మెరుగ్గా అవగాహన పెరుగుతుంది. ఇంకా పనుల్ని వేగవంతం చేస్తుంది.
దేశ సరిహద్దుల భద్రత స్తంభాలు లేదా కంచె తో సరిపోదు- సరిహద్దులలో నిలబడినసైనికుల ధైర్యం, దేశభక్తి, అప్రమత్తత ద్వారా మాత్రమే సాధ్యం
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కు ఒక మహావీర చక్ర, 4 కీర్తి చక్రలు, 13 వీర చక్రలు,13 శౌర్య చక్రలతో సహా అనేక శౌర్య పురస్కారాలు లభించాయి, బిఎస్ఎఫ్ శౌర్యం తో చాలా పోరాటాలుచేసింది, ప్రతి యుద్ధంపై ఒక పుస్తకం రాయవచ్చు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల వైబ్రెంట్ విలేజ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.వైబ్రెంట్ విలేజ్ కార్యక్రమం ద్వారా గ్రామాలలో పర్యాటకాన్ని పెంచే దిశగా సరిహద్దు భద్రత
Posted On:
29 DEC 2022 6:00PM by PIB Hyderabad
సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్) మొబైల్ యాప్ 'ప్రహరి', మాన్యువల్ ఆఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్ఎఫ్) ను కేంద్ర హోం,సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఈ రోజు న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద్ రాయ్, కేంద్ర హోం శాఖ కార్యదర్శి, బిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు ,హోం మంత్రిత్వ శాఖ, కేంద్ర పాలిత ప్రాంతాలు, బిఎస్ఎఫ్ కు చెందిన పలువురు సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కేంద్ర హోం,సహకార మంత్రి శ్రీ అమిత్ షా తన ప్రసంగంలో, బిఎస్ఎఫ్ 'ప్రహరి' యాప్ క్రియాశీల పాలనకు గొప్ప ఉదాహరణ అని అన్నారు. ఇప్పుడు జవాన్లు సమాచారాన్ని, వసతి, ఆయుష్మాన్-సిఎపిఎఫ్, సెలవులకు సంబంధించిన వ్యక్తిగత తమ మొబైల్స్ లో పొందవచ్చు. జిపిఎఫ్, బయో డేటా ఇంకా "సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవియన్స్ రిడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్" (సిపి-జి ఆర్ ఎ ఎం ఎస్) పై ఫిర్యాదుల పరిష్కారం, వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని ఇప్పుడు జవాన్లు సమాచారాన్ని యాప్ ద్వారా పొందవచ్చు ఇంకా ఈ యాప్ వారిని హోం మంత్రిత్వ శాఖ పోర్టల్ తో కూడా అనుసంధానిస్తుంది. దీనితో పాటు, కార్యకలాపాలు, పరిపాలన ,శిక్షణపై అవగాహన పెంచడానికి , పనిని వేగవంతం చేయడానికి 13 మాన్యువల్స్‌లో ఎదురుచూస్తున్న సవరణ, నవీకరణ కోసం కృషి చేసిన బి ఎస్ ఎఫ్ డైరెక్టర్ జనరల్ శ్రీ పంకజ్ కుమార్ ను, ఆయన బృందాన్ని అమిత్ షా అభినందించారు. ఇది బిఎస్ఎఫ్ జవాన్లు అధికారుల అన్ని ర్యాంకుల పనిని సులభతరం చేస్తుందని తాను ఖచ్చితంగా అనుకుంటున్నానని శ్రీ షా అన్నారు. ఈ కొత్త కార్యక్రమాలు బిఎస్ఎఫ్ పనిలో సౌలభ్యాన్ని తీసుకువస్తాయని ఆయన అన్నారు.
దేశంలో అత్యంత క్లిష్టమైన సరిహద్దును బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కాపాడుతోందని హోం మంత్రి చెప్పారు. అటల్ జీ 'వన్ బోర్డర్ వన్ ఫోర్స్' ను ఆవిష్కరించిన తరువాత, పాకిస్తాన్ ,బంగ్లాదేశ్ లతో మన సరిహద్దుల బాధ్యత బిఎస్ఎఫ్ పరిధి లోకి వచ్చిందని, ధైర్యవంతులైన బిఎస్ఎఫ్ సైనికులు ఈ సరిహద్దులను గొప్ప అప్రమత్తత, శక్తితో సకాలంలో స్థిరమైన ప్రయత్నాలతో నిర్వహిస్తున్నారని
అన్నారు. దేశ సరిహద్దుల భద్రతకు స్తంభాలు లేదా కంచెలు సరిపోవని, ఆ సరిహద్దులో నిలబడి ఉన్న సైనికుల ధైర్యం, దేశభక్తి, అప్రమత్తత ద్వారా మాత్రమే భద్రత సాధ్యమని అని ఆయన అన్నారు. దేశ హోం మంత్రిగా బిఎస్ఎఫ్ జవానుల ధైర్యాన్ని, అప్రమత్తతను ఈ సందర్భంగా అభినందిస్తున్నానని చెప్పారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇటీవల వైబ్రెంట్ విలేజ్ కార్యక్రమాన్ని ప్రారంభించారని శ్రీ అమిత్ షా గుర్తు చేస్తూ, వైబ్రెంట్ విలేజ్ కార్యక్రమం ద్వారా గ్రామంలో పర్యాటకాన్ని పెంపొందించి, పూర్తి సౌకర్యాలతో గ్రామాన్ని స్వయం సమృద్ధి సాధించే దిశగా చర్యలు తీసుకోవాలని సరిహద్దు భద్రతా దళాలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
సరిహద్దుల్లో సైనికులను మోహరించడంతో పాటు సరిహద్దు గ్రామాలు జన సమ్మర్థంగా ఉన్నప్పుడు సరిహద్దుల వద్ద భద్రత
పటిష్టమవుతుందని, గ్రామాల్లో నివసించే దేశభక్త పౌరుల ద్వారా మాత్రమే శాశ్వత భద్రత కల్పించబడుతుందని, అన్ని సరిహద్దు రక్షక దళాలు దానిని బలోపేతం చేయాలని శ్రీ షా అన్నారు.
సరిహద్దు భద్రతా దళానికి సుదీర్ఘ చరిత్ర ఉందని, ఒక మహావీర్ చక్ర, 4 కీర్తి చక్రాలు, 13 వీర చక్రాలు, 13 శౌర్య చక్రాలతో సహా అనేక శౌర్య పురస్కారాలతో గౌరవించబడిందని హోం మంత్రి తెలిపారు. బి.ఎస్.ఎఫ్ ఎంత ధైర్యసాహసాలతో ఎన్నో యుద్ధాలు చేసిందంటే ప్రతి యుద్ధంపై ఒక పుస్తకం రాయవచ్చు అని అన్నారు.
గత మూడేళ్లలో బీఎస్ఎఫ్ ద్వారా 26,000 కిలోల మాదకద్రవ్యాలు, 2,500 ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని హోం మంత్రి తెలిపారు. సరిహద్దులో యాంటీ డ్రోన్ టెక్నాలజీ ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉన్నప్పటికీ, ఇది చాలావరకు విజయవంతమైందని ఆయన అన్నారు.
గత ఆరు నెలల్లో పశ్చిమ సరిహద్దులో 22 డ్రోన్లను బీఎస్ఎఫ్ కూల్చివేసిందని, ఇది గొప్ప విజయమని అన్నారు. దుష్ట ఉద్దేశాలతో మాదకద్రవ్యాలు , ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడానికి ఆయుధాలను మోసుకెళ్లే డ్రోన్లపై కూడా విజయం సాధిస్తున్నట్టు తెలిపారు. నోయిడాలో "బిఎస్ఎఫ్ డ్రోన్ / యుఎవి ,సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్" ను ఏర్పాటు చేశామని, దీని ద్వారా స్వాధీనం చేసుకున్న డ్రోన్లను సరిహద్దు వెంబడి వాటి లింకేజీలు. ప్రదేశాల కోసం క్షుణ్ణంగా మ్యాప్ చేసినట్లు కేంద్ర హోంమంత్రి తెలిపారు.
సరిహద్దులోని కొన్ని ప్రాంతాల్లో స్థలాకృతి క్లిష్టంగా ఉన్నందున ఫెన్సింగ్ చేయలేకపోయామని శ్రీ అమిత్ షా అన్నారు. బిఎస్ఎఫ్ అక్కడ ఎలక్ట్రానిక్ నిఘా కోసం అంతర్గత సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది, దీని ఖర్చు చాలా తక్కువ, సామర్థ్యం చాలా ఎక్కువ అని అన్నారు. నిరంతర నిఘాతో సరిహద్దును బిఎస్ఎఫ్ సిబ్బంది సురక్షితంగా ఉంచగలిగారని శ్రీ షా అన్నారు. క్లిష్ట ప్రాంతాల్లో 140 కిలోమీటర్ల మేర ఫెన్సింగ్, 400 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం పూర్తయింది. వీటితో పాటు 120కి పైగా సరిహద్దు ఔట్ పోస్టులను నిర్మించారు. సరిహద్దు వద్ద బీఎస్ ఎఫ్ జవాన్లు మైనస్ 40 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో నిలబడి దేశాన్ని కాపాడుతున్నట్లే వారి కుటుంబాలను మోదీ ప్రభుత్వం అంతే జాగ్రత్తగా
చూసుకుంటున్నదని చెప్పారు. వారికి
గృహనిర్మాణం కోసం ఒక కొత్త యాప్ ప్రారంభం అయిందని, ప్రారంభించిన రెండు నెలల్లోనే గృహ సంతృప్తి నిష్పత్తి 10% పెరిగిందని, ఇది భారీ విజయం అని శ్రీ షా అన్నారు. క్రియాశీల పాలనకు ఇది ఒక గొప్ప ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు.
సరిహద్దు భారతదేశం అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేసిందని కేంద్ర హోం, సహకార మంత్రి అన్నారు. తొమ్మిది ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ లను అభివృద్ధి చేశారు. మరో 14 నిర్మించే ప్రక్రియలో ఉన్నారు. సరిహద్దు జిల్లాల్లో భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే సంక్షేమ కార్యక్రమాలన్నీ జిల్లా కలెక్టర్ లసహకారంతో 100% అమలు చేయాల్సిన అవసరం ఉందని హోంమంత్రి బిఎస్ఎఫ్ సీనియర్ అధికారులకు సూచించారు. ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ యోజనతో సరిహద్దు గ్రామాలను వదిలి వెళ్తున్న ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తే వారు గ్రామంలో ఉండటానికి ఒక కారణం లభిస్తుందని ఆయన అన్నారు. గ్యాస్, విద్యుత్, త్రాగునీటి సదుపాయాలు వారికి కల్పిస్తే, తమను జాగ్రత్తగా చూసుకునే వారు ఉన్నారనే భరోసా కలిగి వారు గ్రామాల లోనే ఉండిపోతారని ఆయన అన్నారు. దేశ స్వావలంబన కోసం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేపట్టిన కార్యక్రమాలను సరిహద్దు ప్రాంతాల్లో ప్రాధాన్యతతో అమలు చేయాలని, ఇందులో దేశ సరిహద్దులలో మోహరించిన భద్రతా దళాలు, ముఖ్యంగా బిఎస్ఎఫ్ లకు ముఖ్యమైన పాత్ర ఉందని హోం మంత్రి అన్నారు.
****
(Release ID: 1887501)
Visitor Counter : 204