ప్రధాన మంత్రి కార్యాలయం

డిసెంబర్ 30వ తేదీ న పశ్చిమ బంగాల్ నుసందర్శించనున్న ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి పశ్చిమ బెంగాల్ లో 7,800 కోట్ల రూపాయల కు పైచిలుకు విలువ కలిగినజాతీయ ప్రాజెక్టుల కు శంకుస్థాపన చేయడం తో పాటుగా ఆ ప్రాజెక్టుల ను దేశ ప్రజల కు అంకితంచేస్తారు

ప్రధాన మంత్రి కోల్ కాతా లో జరిగేనేశనల్ గంగా కౌన్సిల్ రెండో సమావేశాని కి అధ్యక్షత వహించనున్నారు

ప్రధాన మంత్రి పశ్చిమ బంగాల్ లో 2,550 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగినటువంటిఅనేక మురికినీటి సంబంధి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కు శంకుస్థాపన చేయడం తో పాటుగా ఆ ప్రాజెక్టుల ను దేశ ప్రజల కు అంకితంచేయనున్నారు

హావ్ డా నుండి న్యూ జల్ పాయిగుడి ని కలుపుతూ సాగే వందే భారత్ ఎక్స్ ప్రెస్కు ప్రారంభ సూచకం గా ఆకుపచ్చటి జెండా ను చూపెట్టనున్న ప్రధాన మంత్రి

ప్రధాన మంత్రి కోల్ కాతా మెట్రో యొక్కపర్పల్ లైన్ లో భాగం అయినటువంటి జోకా- తారాతలా మార్గాన్ని ప్రారంభించనున్నారు

ప్రధాన మంత్రి అనేక రైల్ వేప్రాజెక్టుల కు శంకుస్థాపన చేయడం తో పాటుగా ఆ ప్రాజెక్టుల ను దేశ ప్రజల కు అంకితంచేస్తారు; న్యూ జల్ పాయిగుడి రైల్ వే స్టేశన్  పునరభివృద్ధి పనుల కుశంకుస్థాపన

డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ - నేశనల్ ఇన్స్ టీట్యూట్ఆఫ్ వాటర్ ఎండ్ సేనీటేశన్ ను ప్రారంభించనున్న ప్రధాన మంత్రి

Posted On: 29 DEC 2022 11:28AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం డిసెంబర్ 30వ తేదీ న పశ్చిమ బంగాల్ ను సందర్శించనున్నారు. సుమారు 11 గంటల 15 నిమిషాల వేళ లో ప్రధాన మంత్రి హావ్ డా రైల్ వే స్టేశన్ కు చేరుకొని, హావ్ డా నుండి న్యూ జల్ పాయిగుడి మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు ప్రారంభ సూచకంగా ఆకుపచ్చటి జెండా ను చూపెడతారు. కోల్ కాతా మెట్రో యొక్క పర్పల్ లైన్ లో భాగం గా ఉన్నటువంటి జోకా-తారాతలా మార్గాన్ని కూడా ఆయన ప్రారంభిస్తారు. అంతేకాకుండా, వివిధ రైల్ వే ప్రాజెక్టుల కు ఆయన శంకుస్థాపన చేయడం తో పాటు గా ఆ ప్రాజెక్టుల ను దేశ ప్రజల కు అంకితం కూడా చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటల వేళ లో ప్రధాన మంత్రి ఐఎన్ఎస్ నేతాజీ సుభాష్ కు చేరుకొని నేతాజీ సుభాష్ విగ్రహాని కి పుష్పాంజలి ని సమర్పిస్తారు. దీనితో పాటు గా డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ - నేశనల్ ఇన్స్ టీట్యూట్ ఆఫ్ వాటర్ ఎండ్ సేనీటేశన్ (డిఎస్ పిఎమ్-ఎన్ఐడబ్ల్యుఎఎస్) ను ప్రారంభిస్తారు. స్వచ్ఛ గంగ జాతీయ ఉద్యమం లో భాగం గా పశ్చిమ బంగాల్ కై అనేక మురికినీటి సంబంధి మౌలిక సదుపాయాల పథకాల కు ఆయన శంకుస్థాపన చేయడమే కాకుండా ఆ పథకాల ను దేశ ప్రజల కు అంకితం చేయనున్నారు. ఆయన మధ్యాహ్నం దాదాపు గా 12 గంటల 25 నిమిషాల వేళ లో నేశనల్ గంగ కౌన్సిల్ యొక్క రెండో సమావేశాని కి అధ్యక్షత వహిస్తారు.

ఐఎన్ఎస్ నేతాజీ సుభాష్ లో ప్రధాన మంత్రి

దేశం లో సహకారాత్మక సమాఖ్య వాదాని కి ప్రోత్సాహాన్ని ఇచ్చేటటువంటి మరొక చర్య లో భాగం గా, ప్రధాన మంత్రి కోల్ కాతా లో 2022 డిసెంబర్ 30 తేదీ నాడు నేశనల్ గంగ కౌన్సిల్ (ఎన్ జిసి) తాలూకు రెండో సమావేశాని కి అధ్యక్షత వహించనున్నారు. జల శక్తి శాఖ కేంద్ర మంత్రి తో పాటు కౌన్సిల్ లో సభ్యులైన ఇతర కేంద్ర మంత్రులు, అలాగే ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్, బిహార్, ఝార్ ఖండ్, ఇంకా పశ్చమ బంగాల్ ల ముఖ్యమంత్రులు ఈ సమావేశం లో పాలుపంచుకోనున్నారు. గంగ నది పునరుద్ధరణ మరియు ఆ నది యొక్క ఉప నదుల లో కాలుష్యం నివారణ ప్రధానమైన పర్యవేక్షణ ల పూర్తి బాధ్యత ను నేశనల్ గంగ కౌన్సిల్ కు అప్పగించడమైంది.

నేశనల్ మిశన్ ఫర్ క్లీన్ గంగ (ఎన్ఎమ్ సిజి) లో భాగం గా 990 కోట్ల రూపాయల కు పై చిలుకు వ్యయం తో అభివృద్ధి పరచిన 7 మురికినీటి సంబంధి మౌలిక సదుపాయాల పథకాల (20 మురికినీటి శుద్ధి ప్లాంటు లు, ఇంకా 612 కి.మీ. నెట్ వర్క్ దీనిలో భాగం గా ఉన్నాయి) ను కూడా ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టుల తో నబాద్వీప్, కఛార్ పాడా, హలిశర్, బజ్-బజ్, బైరక్ పోర్, చందన్ నగర్, బాంస్ బేరియా, ఉతరాపాడా కాట్ రుంగ్, బైద్యాబాతి, భద్రేశ్వర్, నైహాటీ, గారులియా, తీతాగఢ్ మరియు పానీహాటీ ల పురపాలక సంఘాల కు ప్రయోజనం సిద్ధించనుంది. ఈ ప్రాజెక్టు లు పశ్చిమ బంగాల్ లో మొత్తం 200 ఎమ్ఎల్ డి మురికినీటి శుద్ధి సామర్థ్యాని కి దన్నుగా నిలువనున్నాయి.

నేశనల్ మిశన్ ఫార్ క్లీన్ గంగ లో భాగం గా 1585 కోట్ల రూపాయల అంచనా వ్యయం తో అభివృద్ధి చేయబోయే 5 మురికినీటి సంబంధి మౌలిక సదుపాయాల పథకాల (వీటిలో 8 మురుగునీటి పారుదల ప్లాంటులు మరియు 80 కిమీ నెట్ వర్క్ కలిసి ఉంటాయి) కు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు లు పశ్చిమ బంగాల్ లో 190 ఎమ్ఎల్ డి సామర్థ్యం తో కూడిన నూతన సీవర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ సామర్థ్యాన్ని జత చేయగలవు. ఈ ప్రాజెక్టుల తో ఉత్తర బైరక్ పోర్, హుగలీ-చిన్ సురా, కోల్ కాతా కెఎమ్ సి ఏరియా - గార్డన్ రీచ్, ఇంకా ఆది గంగ (టాలీ నాలా) లకు మరియు మహేస్ తాలా పట్టణానికి ప్రయోజనం చేకూరనుంది.

సుమారు 100 కోట్ల రూపాయల అంచనా వ్యయం తో జోకా, డాయమండ్ హార్బర్ రోడ్, కోల్ కాతా ప్రాంతం లో అభివృద్ధి పరచినటువంటి డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ -నేశనల్ ఇన్స్ టీట్యూట్ ఆఫ్ వాటర్ ఎండ్ సేనీటేశన్ (డిఎస్ పిఎమ్-ఎన్ఐడబ్ల్యుఎఎస్) ను ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. ఈ సంస్థ భారతదేశం లో జలం, పారిశుధ్యం, ఇంకా స్వస్థత (డబ్ల్యుఎఎస్ హెచ్) అంశాల పై పర్యవేక్షణ ను చేపట్టే అత్యున్నత సంస్థ గా సేవల ను అందించనుంది. అంతేకాకుండా, ఇది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మరియు స్థానిక ప్రభుత్వాల కు సమాచారం మరియు జ్ఞానం తాలూకు కేంద్ర స్థలం గా కూడా ఉంటుంది.

హావ్ డా రైల్ వే స్టేశన్ లో ప్రధాన మంత్రి

హావ్ డా ను న్యూ జల్ పాయిగుడి తో కలిపే వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు ప్రధాన మంత్రి హావ్ డా రైల్ వే స్టేశన్ లో ప్రారంభ సూచక ఆకుపచ్చటి జెండా ను చూపెట్టనున్నారు. ఈ అత్యధునాతనమైనటువంటి సెమీ హై స్పీడ్ రైలుబండి లో ప్రయాణికుల కు అత్యాధునిక సదుపాయాల ను సమకూర్చడం జరిగింది. ఈ రైలుబండి రాక, పోక లు జరిపేటప్పడు మార్గమధ్యం లో మాల్ దా టౌన్, బార్ సోయి మరియు కిశన్ గంజ్ స్టేశన్ లలో ఆగుతుంది.

ప్రధాన మంత్రి జోకా-ఎస్ ప్లేనెడ్ మెట్రో ప్రాజెక్టు (పర్పల్ లైన్) లో భాగం గా ఉన్న జోకా-తారాతలా మార్గాన్ని ప్రారంభించనున్నారు. 6.5 కిలో మీటర్ ల మేరకు ఏర్పాటు చేసిన ఈ మార్గం లో మొత్తం ఆరు స్టేశన్ లను 2475 కోట్ల రూపాయల కు పైగా ఖర్చు తో నిర్మించడం జరిగింది. ఆ ఆరు స్టేశన్ ల పేరు లు.. జోకా, ఠాకుర్ పుకుర్, సఖర్ బాజార్, బేహలా చౌరస్తా, బేహలా బాజార్ మరియు తారాతలా గా ఉన్నాయి. కోల్ కాతా నగరం లో దక్షిణ దిక్కున ఉన్నటువంటి సర్ సునా, డాక్ ఘర్, ముచీపాడా లతో పాటుగా దక్షిణ 24 పరగణా ల ప్రయాణికుల కు ఈ ప్రాజెక్టు ప్రారంభం అయిన తరువాత చాలా మేలు కలుగనుంది.

ప్రధాన మంత్రి తన కార్యక్రమాల లో భాగం గా నాలుగు రైల్ వే ప్రాజెక్టుల ను దేశ ప్రజల కు అంకితం చేయనున్నారు. వీటిలో బోన్ చీ-శక్తిగఢ్ మూడో మార్గాన్ని 405 కోట్ల రూపాయల ఖర్చు తో అభివృద్ధి పరచడమైంది; డాన్ కునీ-చందన్ పుర్ నాలుగో లైన్ ప్రాజెక్టు ను 565 కోట్ల రూపాయల ఖర్చు తో అభివృద్ధి పరచడమైంది; నిమితియా- న్యూ ఫరక్కా డబల్ లైన్ ను 254 కోట్ల రూపాయల ఖర్చు తో అభివృద్ధి పరచడమైంది; అలాగే అంబారీ ఫరక్కా-న్యూ మాయానగరీ- గుమానీహాట్ డబ్లింగ్ ప్రాజెక్టు ను 1080 కోట్ల రూపాయల కు పైగా వ్యయం తో అభివృద్ధి పరచడం జరిగింది. 335 కోట్ల రూపాయల కు పైగా ఖర్చు తో అభివృద్ధి చేయనున్న న్యూ జల్ పాయిగుడీ రైల్ వే స్టేశన్ పనుల కు కూడా ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు.

 

***



(Release ID: 1887287) Visitor Counter : 111