ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తో ఉత్తరప్రదేశ్,ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల కోసం సెంట్రల్ టీబీ డివిజన్ మధ్య కుదిరిన చారిత్రాత్మక అవగాహన ఒప్పందం పట్ల హర్షం వ్యక్తం చేసిన డాక్టర్ మన్సుఖ్ మాండవీయ శ్రీ హర్దీప్ సింగ్ పూరి


2025 నాటికి భారతదేశంలో క్షయవ్యాధిని అంతం చేయాలన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ లక్ష్యాన్ని సాధించడానికి ఒప్పందం సహకరిస్తుంది... డాక్టర్ మాండవీయ

భారతదేశంలో పటిష్ట ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ను అభివృద్ధి చేయాలన్న ప్రధానమంత్రి ఆకాంక్షకు అనుగుణంగా ఒప్పందం ... శ్రీ హర్దీప్ సింగ్ పూరి

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 10% జనాభా కలిగి ఉన్న 75 జిల్లాల పరిధిలో మూడేళ్లపాటు సంవత్సరానికి ఒకసారి క్రియాశీల కేసులు గుర్తించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సహకారం అందిస్తుంది

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆకాంక్షిత జిల్లాలు, ఛత్తీస్ గఢ్ లోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో తక్కువ ఖర్చుతో అత్యాధునిక రోగనిర్ధారణ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రవేశపెడుతుంది.
2022 లో దేశంలో 18% తగిన టీబీ కేసులు

Posted On: 28 DEC 2022 3:08PM by PIB Hyderabad

దేశంలో క్షయ వ్యాధి వ్యాప్తిని అరికట్టి, వ్యాధిని పూర్తిగా నిర్మూలించడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా  ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తో ఉత్తరప్రదేశ్,ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల కోసం సెంట్రల్ టీబీ డివిజన్ మధ్య  చారిత్రాత్మక అవగాహన ఒప్పందం కుదిరింది.  తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్ఆర్) లో భాగంగా ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ టిబి డివిజన్ (సిటిడి) మరియు ఉత్తర ప్రదేశ్ మరియు  ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలలో    క్షయ నిర్మూలన ప్రాజెక్టు అమలు చేయడానికి చేపట్టడానికి  ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అవగాహన ఒప్పందం (ఎంఓయు) కుదుర్చుకుంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ, పెట్రోలియం, సహజవాయువు, గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ. హర్దీప్ సింగ్ పూరి సమక్షంలో ఒప్పందంపై సంతకాలు జరిగాయి. 

దేశంలో నమోదవుతున్న క్షయవ్యాధి కేసుల్లో ఎక్కువ శాతం పెద్ద రాష్ట్రాలు అయిన ఉత్తర ప్రదేశ్ మరియు ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో నమోదవుతున్నాయి. 

 

 క్షయవ్యాధి కి కారణమవుతున్న వివిధ అంశాలను గుర్తించి, వివిధ దశల్లో వ్యాధిని గుర్తించడానికి అనువుగా టీబీ నిర్మూలన కార్యక్రమం రూపొందింది. సిఎస్ఆర్ లో భాగంగా ఐఒసిఎల్ కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. వ్యాధిని ముందుగా గుర్తించి, వ్యాధి సోకిన ఇళ్ల వద్ద అత్యాధునిక పరికరాలతో రోగ నిర్ధారణ పరీక్షలు చేసి టీబీ నిర్మూలన కార్యక్రమం అమలు చేయడానికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తన వంతు సహకారం అందిస్తుంది.వ్యాధిని ముందుగా గుర్తించడంతో పాటు  . ఉత్తర ప్రదేశ్ మరియు ఛత్తీస్ గఢ్ ప్రజలందరికి  ఉచిత అధిక-నాణ్యత టిబి చికిత్స, సంరక్షణ  సేవలు అందించడం లక్ష్యంగా కార్యక్రమం అమలు జరుగుతుంది. 

ఒప్పందంలో భాగంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కార్యక్రమాన్ని అమలు చేయడానికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 75 జిల్లాలో దాదాపు 64 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుంది. కార్యక్రమం కింద మూడేళ్లపాటు సంవత్సరానికి ఒకసారి క్రియాశీల కేసులు గుర్తించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు  ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సహకారం అందిస్తుంది. దీనితో పాటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యాధునిక సౌకర్యాలు కలిగిన 18 వాహనాలను ఇండియన్ కార్పొరేషన్ అందిస్తుంది. మారుమూల ప్రాంతాలు, రవాణా సౌకర్యాలు తక్కువగా ఉండే గ్రామీణ ప్రాంతాలకు సులువుగా వెళ్లి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించి, వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించడానికి ఈ చర్య సహకరిస్తుంది.  తక్కువ  ఖర్చుతో  వినూత్న మాలిక్యులర్ డయాగ్నోస్టిక్ యంత్రాన్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సమకూరుస్తుంది. మాలిక్యులర్ డయాగ్నోస్టిక్ సేవల ద్వారా  ఉత్తరప్రదేశ్ గ్రామీణ ప్రాంతాలు, ఛత్తీస్ గఢ్ లోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో టిబి డయాగ్నోస్టిక్ సేవలు   అవసరమైన వారికి అందుబాటులోకి వస్తాయి. వీటిని ఎక్కువ మంది ప్రజలు వినియోగించుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టనున్న 18 సంచార వైద్య వాహనాలలో  ట్రూనాట్ యంత్రాలను  ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తుంది.  యుపిలోని మొత్తం 8 ఆకాంక్షాత్మక జిల్లాల్లో పనిచేస్తున్న క్షయవ్యాధి యూనిట్లు,  (బహ్రైచ్, బల్రాంపూర్, చందౌలీ, చిత్రకూట్, ఫతేపూర్, శ్రావస్తి, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సిద్ధార్థనగర్, సోన్‌భద్ర) మరియు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ (CHC)లలో 100  ట్రూనాట్ యంత్రాలను  ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అందిస్తుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో   మొత్తం 18 రాష్ట్ర ప్రధాన కార్యాలయాలు మరియు 8 ఆకాంక్షాత్మక జిల్లాలకు చేతితో తీసుకుని వెళ్ళడానికి వీలుగా ఉండే   ఎక్స్‌రే యూనిట్లను లో అందిస్తుంది. ఛత్తీస్‌గఢ్‌లోని 5 డివిజన్లలో కూడా ఎక్స్‌రే యూనిట్లు సరఫరా చేస్తుంది. 

ఒప్పందం పట్ల హర్షం వ్యక్తం చేసిన డాక్టర్ మాండవీయ క్షయవ్యాధి నివారణ కోసం జరుగుతున్న ప్రయత్నాలకు ఒప్పందం సహకరిస్తుందని అన్నారు. ' పరిపూర్ణ పరిపాలన విధానంలో భాగంగా రెండు మంత్రిత్వ శాఖలు అవగాహనతో పనిచేస్తున్నాయి. సుస్థిర అభివృద్ధి లక్ష్య సాధనకు అయిదు సంవత్సరాలకు ముందుగా దేశంలో క్షయవ్యాధి నిర్మూలన జరగాలి అన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విధించిన లక్ష్యం చేరుకోవడానికి ఒప్పందం సహకరిస్తుంది' అని డాక్టర్ మాండవీయ అన్నారు. క్షయ వ్యాధి సోకిన వారిని ముందుగా గుర్తించి  తగిన సమయానికి తగిన చికిత్స అందించడానికి ఒప్పందం సహకరిస్తున్నాదని మంత్రి అన్నారు. 


2025 నాటికి దేశంలో  క్షయవ్యాధి ని నిర్మూలించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్న డాక్టర్ మాండవీయ ఈ దిశలో చర్యలు అమలు జరుగుతున్నాయని అన్నారు.దీనిలో భాగంగా  ఇటీవల రాష్ట్రపతి  నిక్షయ్  2.0 కార్యక్రమాన్ని ప్రారంభించారని అన్నారు.  " ప్రారంభించిన 15 రోజుల్లో భారతదేశంలోగుర్తించిన అర్హత  పొందిన 12 లక్షల మంది టిబి రోగులకు పోషకాహార కిట్‌లు మరియు ఇతర సహాయాన్ని అందించే నిక్షయ్ కార్యకర్తలు అందించారు" అని ఆయన చెప్పారు. 

కార్యక్రమంలో పాల్గొనడానికి ముందుకు వచ్చిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కి  శ్రీ హర్దీప్ సింగ్ పూరి కృతజ్జ్ఞతలు  తెలిపారు. ' దేశంలో ఆరోగ్య రంగాన్ని పటిష్టం చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలకు ఆయిల్ రంగం సహకరించడానికి సిద్ధంగా ఉందని తెలియజేయడానికి ఈ ఒప్పందం ఒక నిదర్శనం ' అని మంత్రి అన్నారు.  సిఎస్ఆర్ బాధ్యత నెరవేర్చడానికి పెట్రోలియం మంత్రిత్వ శాఖ సిద్ధంగా ఉందని అన్నారు. 

 

కార్యక్రమంలో పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ  కార్యదర్శి శ్రీ పంకజ్ జైన్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్,  ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీమతి రోలీ సింగ్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ విశాల్ చౌహాన్, పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీమతి సుజాతా శర్మ, సెంట్రల్ టీబీ డివిజన్ డీడీజీ డాక్టర్ రాజేంద్ర పి జోషి, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర టీబీ అధికారి డాక్టర్ శైలేంద్ర భట్నాగర్, ఛత్తీస్ గఢ్ టీబీ అధికారి డాక్టర్ ధర్మేంద్ర, పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

 

****



(Release ID: 1887098) Visitor Counter : 115