హోం మంత్రిత్వ శాఖ

వీర్ బాల్ దివ‌స్ సంద‌ర్భంగా గురు గోబింద్ సింగ్‌, సాహిబ్‌జాదాలు, మాతా గుజ్రిల‌కు నివాళులు అర్పించిన కేంద్ర హోం, స‌హ‌కార‌శాఖ మంత్రి శ్రీ అమిత్ షా


మాతృభూమిని, మతాన్ని కాపాడేందుకు చిన్న వ‌య‌సులోనే అత్యంత సాహ‌సంతో శ‌త్రువుల‌ను ఎదుర్కొన్న గురు గోబింద్ సింగ్‌కు చెందిన సాహిబ్‌జాదాలు

వారి వీర‌త్వం, ధైర్య‌సాహ‌సాలు మ‌న వార‌స‌త్వం, దీనిని మ‌న‌సులో ఉంచుకునే మోదీ ప్ర‌భుత్వం వీర్ బాల్ దివ‌స్‌ను జ‌రుపుతోంది

సాహిబ్‌జాదాలు, మాతా గుజిరి, గురు గోబింద్ సింగ్ వీర‌త్వానికి, త్యాగాల‌కు నివాళులు

Posted On: 26 DEC 2022 1:19PM by PIB Hyderabad

 వీర్ బాల్ దివ‌స్ సంద‌ర్భంగా గురు గోబింద్ సింగ్‌కు, సాహిబ్‌జాదాస్‌, మాతా గుజిరికి కేంద్ర హోం, స‌హ‌కార మంత్రి శ్రీ అమిత్‌షా నివాళులు అర్పించారు. 
మాతృభూమిని, మ‌తాన్ని ప‌రిర‌క్షించేందుకు చిన్న వ‌య‌సులోనే గురు గోబింద్ సింగ్‌కు చెందిన సాహిబ్‌జాదాలు అత్యంత సాహ‌సంతో శ‌త్రువుల‌ను ఎదుర్కొన్నార‌ని శ్రీ అమిత్ షా త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. వారి ధైర్య‌సాహ‌సాలు, వీర‌త్వం మ‌న వార‌స‌త్వం  అన్న విష‌యాన్ని సంస్మ‌రించుకుంటూ మోదీ ప్ర‌భుత్వం వీర్ బాల్ దివ‌స్‌ను జ‌రుపుతోంది. సాహిబ్‌జాదాలు, మాతా గుజిరి, గురు గోబింద్ సింగ్ లు ప్ర‌ద‌ర్శించిన సాహ‌సానికి, త్యాగాల‌కు నేను నివాళుల‌ర్పిస్తున్నాను అని ఆయ‌న త‌న ట్వీట్ లో పేర్కొన్నారు. 

***


 



(Release ID: 1886685) Visitor Counter : 145