ప్రధాన మంత్రి కార్యాలయం
పండిట్ మదన్ మోహన్ మాలవీయ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నివాళి
Posted On:
25 DEC 2022 8:50AM by PIB Hyderabad
పండిట్ మదన్ మోహన్ మాలవీయ జయంతి నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన నివాళి అర్పించారు. విద్యా రంగాన్ని సుసంపన్నం చేయడంలో ఆ మహనీయుడు చేసిన కృషి చిరస్మరణీయమని శ్రీ మోదీ గుర్తుచేసుకున్నారు.
ఈ మేరకు ఒక ట్వీట్‌ద్వారా ఇచ్చిన సందేశంలో:
“భరతమాత ప్రియపుత్రుడైన మహామన పండిట్ మదన్ మోహన్ మాలవీయ జయంతి సందర్భంగా ఆయనకు నా నివాళి. దేశంలో విద్యారంగం శ్రేయస్సు కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. ఈ దిశగా ఆయన చేసిన అవిరళ కృషి ఎప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచిపోతుంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
********
DS/ST
(Release ID: 1886470)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam