ప్రధాన మంత్రి కార్యాలయం

‘వీర్బాల్ దివస్’ సందర్భం లో డిసెంబర్ 26వ తేదీ న మేజర్ ధ్యాన్ చంద్ నేశనల్స్టేడియమ్ లో ఏర్పాటు అయ్యే ఒక చరిత్రాత్మక కార్యక్రమం లో పాల్గొననున్న ప్రధాన మంత్రి


దాదాపుగా మూడు వందల మంది బాల కీర్తనకారులు ఆలాపించే ‘శబ్ద్ కీర్తన్’ కు  ప్రధాన మంత్రి హాజరు అవుతారు

సుమారు మూడువేల మంది విద్యార్థుల మార్చ్ పాస్ట్  కు ప్రారంభసూచకం గా జెండా ను ప్రధాన మంత్రి చూపెడతారు

Posted On: 24 DEC 2022 7:21PM by PIB Hyderabad

‘వీర్ బాల్ దివస్’ సందర్భం లో 2022 డిసెంబర్ 26 వ తేదీ న మధ్యాహ్నం 12.30 గంటల కు న్యూ ఢిల్లీ లోని మేజర్ ధ్యాన్ చంద్ నేశనల్ స్టేడియమ్ లో ఒక చరిత్రాత్మకమైన కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకోనున్నారు.
ఈ కార్యక్రమం లో ప్రధాన మంత్రి సుమారు మూడు వందల మంది బాల కీర్తన కారులు పాల్గొనే శబ్ద్ కీర్తన్ లో సైతం పాలుపంచుకొంటారు. ఈ మహత్వపూర్ణమైనటువంటి సందర్భం లో ప్రధాన మంత్రి దిల్లీ లో దాదాపు గా మూడు వేల మంది బాలలు పాల్గొనే మార్చ్ పాస్ట్ కు జెండా ను చూపెట్టి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.


సాహిబ్ జాదా ల అనుకరణీయ సాహసానికి సంబంధించిన కథ ను గురించి పౌరుల కు ప్రత్యేకించి చిన్న పిల్లల కు తెలియజెప్పేందుకు, వారికి బోధన ను ఇచ్చేందుకు ముఖాముఖి కార్యక్రమాల ను, స్వచ్ఛందం గా వివిధ వర్గాల వారు పాల్గొనే కార్యక్రమాల ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది.
ఇందులో భాగం గా వ్యాసరచన పోటీ లు, క్విజ్ పోటీ లు, ఇతర కార్యక్రమాల ను దేశవ్యాప్తం గా గల పాఠశాలల్లో, కళాశాలల్లో నిర్వహించడం జరుగుతుంది. రైల్ వే స్టేశన్ లు, పెట్రోల్ పంపు లు, విమానాశ్రయాలు వంటి సార్వజనిక ప్రదేశాల లో డిజిటల్ ఎగ్జిబిశన్ లను
ఏర్పాటు చేయడం జరుగుతుంది. దేశం అంతటా ఏర్పాటు చేసే ఈ తరహా కార్యక్రమాలలో పాల్గొనే ప్రముఖులు సాహిబ్ జాదా ల జీవన గాథ ను గురించి, వారు చేసిన త్యాగం గురించి వివరిస్తారు.


ప్రధాన మంత్రి 2022 జనవరి 9 వ తేదీ న శ్రీ గురు గోబింద్ సింహ్ జీ యొక్క ప్రకాశ్ పర్వ్ రోజు ను గురించి ఒక ప్రకటన ను చేస్తూ, ఏటా డిసెంబర్ 26 వ తేదీ ని ‘వీర్ బాల్ దివస్’ గా పాటించడం జరుగుతుంది అని పేర్కొన్నారు. శ్రీ గురు గోబింద్ సింహ్ యొక్క పుత్రులు సాహిబ్ జాదా లు బాబా జోరావర్ సింహ్ జీ, బాబా ఫతేహ్ సింహ్ జీ ల యొక్క అమరత్వాని కి గుర్తు గా ఈ ‘వీర్ బాల్ దివస్ ’ ను పాటించడం జరుగుతుంది.

 

***

 


 



(Release ID: 1886438) Visitor Counter : 157