చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
733 ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయస్థానాలు 413 ప్రత్యేక పోస్కో కోర్టులు
- 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోలలో ఈ కోర్టులు పని చేస్తున్నాయి
Posted On:
22 DEC 2022 1:25PM by PIB Hyderabad
ఫాస్ట్ ట్రాక్ కోర్టుల (ఎఫ్‌టీసీల) ఏర్పాటు మరియు దాని వ్యవహారాలతో సహా ఈ తరహా కోర్టులను ఏర్పాటుకు సంబంధించిన అంశం రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకి వస్తుందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి శ్రీ కిరణ్ రిజిజూ అన్నారు. మంత్రి ఈరోజు రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇస్తూ అవసరం, వనరులను బట్టి ఇలాంటి కోర్టుల ఏర్పాటు హైకోర్టు సంప్రదింపులతో ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. హైకోర్టులు అందించిన సమాచారం ప్రకారం 2017 తర్వాత మరో 242 ఎఫ్టీసీలు ఏర్పాటు చేయబడ్డాయి (31.12.2017 నాటికి 596 ఎఫ్టీసీలు ఉన్నాయి. ఈ సంఖ్య 31.10.2022 నాటికి 838లకు పెరిగింది). గౌరవ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఆదేశాలను అనుసరిస్తూ అత్యాచార కేసులు మరియు పోక్సో చట్టానికి సంబంధించిన కేసుల సత్వర విచారణ, పరిష్కారానికి 31 రాష్ట్రాలు/యూటీలలో 389 ప్రత్యేకమైన పోస్కో కోర్టులతో సహా 1023 ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టుల (ఎఫ్.టి.ఎస్.సి) ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం అక్టోబర్, 2019లో కేంద్ర ప్రాయోజిత పథకాన్ని ప్రారంభించింది. క్రిమినల్ లా (సవరణ) చట్టం 2018 మరియు 25.7.2019 నాటి సుయో మోటో 1/2019 మేరకు ఈ చర్య చేపట్టడం జరిగింది. తొలత ఈ పథకం ఏడాది కాలానికి మాత్రమే ఉంది. ఇప్పుడు ఇది 31.03.2023 వరకు కొనసాగించబడింది. హైకోర్టుల నుండి అందిన సమాచారం ప్రకారం, 413 ప్రత్యేక పోక్సో కోర్టులతో సహా 733 ఎఫ్‌టీఎస్‌సీలు 28 రాష్ట్రాలు/యుటీలలో పని చేస్తున్నాయి. పథకం ప్రారంభించినప్పటి నుండి ఆయా కోర్టులు మొత్తం 1,24,000 కేసులను పరిష్కరించాయి. 31.10.2022 నాటికి 1,93,814 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
******
(Release ID: 1885991)