పర్యటక మంత్రిత్వ శాఖ

మహిళా శ్రామిక శక్తి కి అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న వాటిలో పర్యాటక రంగం ఒకటి: శ్రీ జి. కిషన్ రెడ్డి

Posted On: 22 DEC 2022 3:41PM by PIB Hyderabad

ప్రధాన అంశాలు:

 

మహిళా ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించడానికి మహిళా ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడానికి ప్రభుత్వం వివిధ నియంత్రణ , స్వచ్ఛంద చర్యల ద్వారా పారిశ్రామిక యాజమాన్యాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది.

 

పర్యాటక శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి ఈ రోజు రాజ్యసభ లో ఒక లిఖిత పూర్వక సమాధానంలో ఈ విషయాన్ని తెలిపారు.

 

పర్యాటక రంగం లో పనిచేసే వారు అధికంగా అసంఘటిత, సీజనల్ గా, వేర్వేరు చోట్ల పనిచేసేవారు కావడం వల్ల పర్యాటక పరిశ్రమ శ్రామిక శక్తి వివిధ సవాళ్లను ఎదుర్కొంటోంది. పర్యాటక పరిశ్రమ మహిళా ఉద్యోగులకు అతిపెద్ద ఉపాధి కల్పన రంగాలలో ఒకటి. మహిళా ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించడానికి మహిళా ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణాన్ని అందించడానికి ప్రభుత్వం వివిధ నియంత్రణ , స్వచ్ఛంద చర్యల ద్వారా పరిశ్రమ వాటాదారులతో నిమగ్నమైంది.

 

భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖల నిర్వహణ చట్టాలలోని వివిధ నిబంధనలు మహిళా ఉద్యోగులకు భద్రత, సమాన అవకాశాలు, అనుకూలమైన పనివాతావరణాన్ని కల్పిస్తాయి. వీటిలో ఇవి ఉన్నాయి:

 

(i) ది కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ, 2020

 

(ii) వేతనాల కోడ్ 2019

 

  1. ప్రసూతి ప్రయోజన చట్టం, 1961 (2017 లో సవరణ)

 

(iv) పని ప్రదేశం వద్ద మహిళలపై లైంగిక వేధింపుల (నివారణ, నిషేధం , పరిష్కార) చట్టం, 2013

 

*******



(Release ID: 1885983) Visitor Counter : 121