ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఎబిడిఎం) అమలు చేయడానికి ఆసుపత్రులు, ల్యాబ్ లు మరియు డిజిటల్ హెల్త్ సొల్యూషన్ ప్రొవైడర్ లకు రూ.4 కోట్ల వరకు ప్రోత్సాహకాలను అందించనున్న ఎన్ హెచ్ ఎ

Posted On: 22 DEC 2022 11:01AM by PIB Hyderabad
డిజిటల్ ఆరోగ్య రంగం భాగస్వాములకు ప్రోత్సాహకాలు అందించేందుకు  నేషనల్ హెల్త్ అథారిటీ (ఎన్ హెచ్ ఎ) డిజిటల్ హెల్త్ ఇన్సెంటివ్ స్కీమ్ (డిహెచ్ఐఎస్) ను ప్రకటించింది. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఎబిడిఎం) కింద దేశంలో డిజిటల్ ఆరోగ్య కార్యకలాపాలు మరింత ఎక్కువగా చూడాలన్న లక్ష్యంతో ఈ పథకం రూపొందింది. ఈ పథకం కింద  ఆసుపత్రులు మరియు డయాగ్నొస్టిక్ ల్యాబ్ లకు మరియు ఆసుపత్రి / ఆరోగ్య నిర్వహణ సమాచార వ్యవస్థ (హెచ్ ఎంఐఎస్) మరియు ప్రయోగశాల నిర్వహణ సమాచార వ్యవస్థ (ఎల్ ఎంఐఎస్) వంటి డిజిటల్ ఆరోగ్య పరిష్కారాలు  అందించేవారికి కూడా ప్రోత్సాహకాలు అందించబడతాయి.
రూపొందించిన డిజిటల్ ఆరోగ్య రికార్డుల సంఖ్య ఆధారంగా డిహెచ్ఐఎస్ కింద, అర్హత కలిగిన ఆరోగ్య సౌకర్యాలు మరియు డిజిటల్ సొల్యూషన్స్ సంస్థలు 4 కోట్ల రూపాయల వరకు ఆర్థిక ప్రోత్సాహకాలను సంపాదించగలవు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్   హెల్త్ ఫెసిలిటీ రిజిస్ట్రీ (HFR)లో నమోదు చేసుకుని పథకం కింద పేర్కొన్న అర్హత ప్రమాణాలు అమలు చేసి ఆరోగ్య సౌకర్యాలు (ఆస్పత్రులు మరియు డయాగ్నొస్టిక్ ల్యాబ్ లు) పథకం కింద ప్రోత్సాహకాలు పొందవచ్చు.
పథకం వివరాలను జాతీయ ఆరోగ్య సంస్థ  సీఈఓ డాక్టర్ ఆర్ ఎస్ శర్మ వివరించారు.  "ఈ పథకం వల్ల రోగి-కేంద్రీకృత ఆరోగ్య సంరక్షణ అందించడానికి ఎబిడిఎంలో చేరడానికి మరిన్ని ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు మరియు డిజిటల్ సాఫ్ట్ వేర్ కంపెనీలు ముందుకు వస్తాయి. ఈ ఆర్థిక ప్రోత్సాహక పథకం వల్ల  డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ మరింత బలపడుతుంది.  ప్రోత్సాహక పథకం పరిధిలోకి  పరిష్కార (హెచ్ఎంఐఎస్ / ఎల్ఎంఐఎస్) ప్రొవైడర్లు కూడా వస్తారు. ప్రోత్సాహక పరిధిలోకి వచ్చే సంస్థలు మెరుగైన  ఆరోగ్య సౌకర్యాలు కలిగిఉంటాయి. దీనివల్ల  డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది.  యుపిఐ, టిబి కేసుల ప్రకటన , జనని సురక్ష యోజన వంటి ఇతర  కార్యక్రమాలు త్వరగా అమలు జరిగే అంశంలో  ప్రోత్సాహకాలు తగిన ప్రోత్సాహం అందించాయి' అని డాక్టర్ శర్మ పేర్కొన్నారు. .
1. ఈ క్రింది సంస్థలకు ప్రోత్సాహకాలు అందించడం జరుగుతుంది.
     (1) 10 లేదా అంతకంటే ఎక్కువ పడకలు ఉన్న ఆరోగ్య కేంద్రాలు
      (2) ప్రయోగశాల/రేడియాలజీ డయాగ్నోస్టిక్ కేంద్రాలు 
       (3) డిజిటల్ సొల్యూషన్ కంపెనీలు (ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఆధారిత డిజిటల్ పరిష్కారాలు  అందించే సంస్థలు)
2. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతా అనుసంధానం అయిన   లావాదేవీల సంఖ్య ఆధారంగా ప్రోత్సాహకాలు అందుతాయి.

 

ఆరోగ్య సంరక్షణ సౌకర్యం

ప్రాథమిక స్థాయి ప్రమాణాలు   

ప్రోత్సాహకాలు

ఆసుపత్రులు

ఒక్క మంచానికి నెలకు 50 లావాదేవీలు

 ప్రాథమిక  స్థాయికి మించి జరిగే ప్రతి  లావాదేవీకి రూ. 20

 

రోగనిర్ధారణ సౌకర్యాలు / ప్రయోగశాలలు

నెలకు 500 లావాదేవీలు

ప్రాథమిక  స్థాయికి మించి జరిగే ప్రతి  లావాదేవీకి రూ. 15 

3.   డిజిటల్ సొల్యూషన్ కంపెనీలకు (DSCలు) వారి డిజిటల్ సొల్యూషన్‌లను ఉపయోగించి అర్హత కలిగిన ఆరోగ్య సదుపాయాల ద్వారా పొందిన ప్రోత్సాహక మొత్తంలో 25% ప్రోత్సాహకం ఇవ్వబడుతుంది.

4.   ప్రత్యక్ష ప్రోత్సాహకాలు పొందడానికి  (క్లినిక్‌లు/చిన్న ఆసుపత్రులు/హెల్త్ లాకర్లు/టెలీకన్సల్టేషన్ ప్లాట్‌ఫారమ్‌లు మొదలైనవి) అర్హత లేని సౌకర్యాల ద్వారా జరిగే  ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతా   లావాదేవీల కోసం  డిజిటల్ సొల్యూషన్ కంపెనీలకు ప్రోత్సాహకం అందించబడుతుంది.

డిజిటల్ సొల్యూషన్ (HMIS మరియు LMIS) కంపెనీలకు ఖర్చు ప్రోత్సాహకాలు

ఆసుపత్రులు/ల్యాబ్‌లు తమ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి చేసే ప్రతి లావాదేవీకి మరియు ఈ పాలసీ కింద ప్రోత్సాహకాలను పొందుతాయి

 అర్హత ఉన్న సౌకర్యాల ద్వారా అందుకున్న సంబంధిత ప్రోత్సాహక మొత్తంలో 25%

ఇతర లావాదేవీల కోసం (హెల్త్ లాకర్స్టెలికన్సల్టేషన్ ప్లాట్‌ఫారమ్‌లుచిన్న క్లినిక్‌లు మొదలైన వాటితో సహా) లావాదేవీలు నెలకు 200 కంటే ఎక్కువ ఉంటే

రూ.  ప్రతి లావాదేవీకి రూ.  5

 

ప్రభుత్వ రంగ సంస్థలకు అందించే ప్రోత్సాహకాలు రోగి కళ్యాణ్ సమితి నిధులకు జమ చేయడం జరుగుతుంది. 2023 జనవరి 1 నుంచి ఆరు నెలల కాలానికి  ప్రోత్సాహక పథకం అమలు చేయడానికి 50 కోట్లు అవసరం ఉంటాయని అంచనా వేయడం జరిగింది. 

పథకం వివరాలు మరింత వివరంగా ప్రజలకు తెలియజేయడానికి 2022 డిసెంబర్ 22 నుంచి వెబినార్లు నిర్వహించాలని జాతీయ ఆరోగ్య సంస్థ నిర్ణయించింది. వెబినార్ నిర్వహణ, దీనికి సంబంధించిన లింక్ 

 https://abdm.gov.in/ dhis వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి . డిజిటల్ హెల్త్ ఇన్సెంటివ్ స్కీమ్ పూర్తి వివరాలు :  https://abdm.gov.in:8081/ uploads/Digital_Health_ Incentive_Scheme_550e710e09. pdf లో అందుబాటులో ఉన్నాయి . 

 
***
 

(Release ID: 1885981) Visitor Counter : 216