సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వందేభారతం నృత్య ఉత్సవ్ 2023 గ్రాండ్ ఫినాలే జాతీయ స్థాయి పోటీకి ఎంపికైన 980 మంది నృత్యకారులు


ఫైనలిస్టుల నుండి ఎంపికైన 500 మంది డ్యాన్సర్లు 2023 రిపబ్లిక్ డే సందర్భంగా 'నారీ శక్తి' థీమ్‌పై గొప్ప సాంస్కృతిక ప్రదర్శనను ప్రదర్శిస్తారు.

Posted On: 20 DEC 2022 1:06PM by PIB Hyderabad

ముఖ్యాంశాలు:
గ్రాండ్ ఫినాలే కార్యక్రమానికి 20 డిసెంబర్, 2022 సాయంత్రం మరో వేడుక కూడా జరుగుతుంది. దీనికి లోక్‌సభ స్పీకర్‌ శ్రీ ఓమ్ బిర్లాతో పాటు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మరియు ఈశాన్య ప్రాంత మంత్రి శ్రీ జి.కిషన్‌రెడ్డి హాజరవుతారు;
వందే భారతం నృత్య ఉత్సవ్ 2023 అనేది రిపబ్లిక్ డే సెలబ్రేషన్ 2023 ఆధ్వర్యంలో రక్షణ మంత్రిత్వ శాఖ తరపున సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న నృత్య పోటీ కార్యక్రమం.


సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వందే భారతం నృత్య ఉత్సవ్ 2023 యొక్క రెండు రోజుల జాతీయ స్థాయి పోటీని (గ్రాండ్ ఫైనల్) నిర్వహించింది. డిసెంబర్ 19న న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో మొదటిరోజు పోటీ జరిగింది. మరో పోటీని డిసెంబర్ 20వ తేదీన నిర్వహిస్తున్నారు. ఈ  జాతీయ స్థాయి పోటీ (గ్రాండ్ ఫినాలే)లో పాల్గొనేందుకు 980 మంది నృత్యకారులు ఎంపికయ్యారు.

image.png

image.png

సంగ్రైన్ డ్యాన్స్ అకాడమీ, సంగ్రెయిన్ గొడుగు నృత్యం (త్రిపుర)

 

 

image.png

శ్రద్ధ మరియు అదితి, భారత నాట్యం(కర్ణాటక)

 

గ్రాండ్ ఫినాలే 20 డిసెంబర్, 2022 సాయంత్రం ఓ ప్రత్యేక ఫంక్షన్‌ను కలిగి ఉంటుంది. దీనికి లోక్‌సభ స్పీకర్‌ శ్రీ ఓమ్ బిర్లాతో పాటు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మరియు ఈశాన్య ప్రాంత మంత్రి శ్రీ జి.కిషన్‌రెడ్డి; సాంస్కృతిక మరియు పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్; సాంస్కృతిక మరియు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ మీనాక్షి లేఖి మరియు రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ భట్ హాజరవుతారు.

image.png

 

గేడి లోక్ నృత్య (ఛత్తీస్‌గఢ్)

 

image.png

 

మనీషా నృత్యాలయ, క్లాసికల్ (మహారాష్ట్ర)

 

 
వందే భారతం నృత్య ఉత్సవ్ 2023 అనేది 2023 రిపబ్లిక్ డే వేడుకల ఆధ్వర్యంలో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మరియు రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నృత్య పోటీ కార్యక్రమం. ఈ పోటీ 3 దశల్లో అంటే రాష్ట్ర-యూటీ స్థాయి, జోన్ స్థాయి మరియు జాతీయ స్థాయిలో జరుగుతుంది,

 

     image.png

స్వాతి అగర్వాల్ & గ్రూప్, క్లాసికల్, (రాజస్థాన్)

 

image.png

అచ్ డ్యాన్స్ గ్రూప్, జుమూర్, (ఒడిస్సా)


ఫోక్/ట్రైబల్, క్లాసికల్ మరియు కాంటెంపరరీ/ఫ్యూజన్ శైలులలో 17-30 సంవత్సరాల మధ్య వయస్సు గల వారి నుండి 15 అక్టోబర్ 2022 నుండి నవంబర్ 10వ తేదీ వరకు ఎంట్రీలు కోరబడ్డాయి. రాష్ట్ర-యూటీ స్థాయి మరియు జోనల్ స్థాయి పోటీలను 17 నవంబర్ నుండి 10 డిసెంబర్ 2022 వరకు సాంస్కృతిక మంత్రిత్వ శాఖలోని ఏడు జోనల్ సాంస్కృతిక కేంద్రాలు నిర్వహించాయి.

ఫైనలిస్టుల నుండి ఎంపిక చేయబడిన 500 మంది నృత్యకారులు 2023 గణతంత్ర దినోత్సవం సందర్భంగా 'నారీ శక్తి' థీమ్‌పై గొప్ప సాంస్కృతిక ప్రదర్శనను ప్రదర్శిస్తారు. ఇందుకోసం  ప్రఖ్యాత కొరియోగ్రాఫర్‌లు, స్వరకర్తలు, రచయితలు మరియు సృజనాత్మక డిజైనర్‌లతో కూడిన సృజనాత్మక బృందం సాంస్కృతిక ప్రదర్శనను రూపొందించడానికి నిమగ్నమై ఉంది.


 

*******


(Release ID: 1885112) Visitor Counter : 139