సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
2014 నుంచి ఈశాన్య భారతంలో శాంతియుగం; పౌరుల మరణాల్లో 80% తగ్గుదల, 6000 మిలిటెంట్ల లొంగుబాటు: శ్రీ ఠాకూర్
చాలా ప్రాంతాల్లో వెనక్కి తీసుకున్న ఎ ఎఫ్ ఎస్ పి ఎ, శాంతి ఒప్పందాలపై సంతకాలు: మంత్రి
ప్రమాదంలో ఉన్న భారతీయుల ప్రాణాలు ప్రభుత్వానికి అత్యంత ప్రధానం, వందే భారత్ లో 1.83 కోట్ల పౌరులను కాపాడాం
తీవ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచాన్ని సమాయత్తం చేస్తున్న భారత్, ఆశ్రయమిస్తున్న పొరుగుదేశం
Posted On:
19 DEC 2022 1:17PM by PIB Hyderabad
తీవ్రవాదాన్ని ఎంత మాత్రమూ సహించే ప్రసక్తే లేదన్న భారతదేశం ఆ విధానం మీద దృష్టి సారించిందని కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. ఈ రోజు ఆయన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో సుదీర్ఘమైన ప్రకటన విడుదల చేశారు. చట్టపరంగా యూఏపీఏ ను బలోపేతం చేయటం మీద ఒకవైపు ప్రభుత్వం పనిచేస్తోందని, మరోవైపు అమలు పరంగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ ఐ ఎ) సమర్థంగా పనిచేయటానికి సవరణ చట్టం చేసామాని చెప్పారు. ఈ చర్యలన్నీ కలసికట్టుగా తీవ్రవాద పర్యావరణాన్ని బలహీనపరుస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
తీవ్రవాదాన్ని అంతమొందించాల్సిన అవసరాన్ని అంతర్జాతీయ వేదికల మీద భారతదేశం బలంగా చెప్పిందని మంత్రి గుర్తు చేశారు. తీవ్రవాదం మీద పోరుకు ప్రపంచ దేశాలన్నీ ఏకం కావాల్సిన అవసరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నొక్కి చెబుతూ వస్తున్నారన్నారు. ఢిల్లీలో జరిగిన 90 వ ఇంటర్ పోల్ జనరల్ అసెంబ్లీలో 2000 మందికి పైగా విదేశీ ప్రతినిధులు పాల్గొనగా తీవ్రవాద కార్యకలాపాల మీద అంతర్జాతీయ చర్యలకు పూనుకోవాలన్న తీర్మాణంతో ముగియటాన్ని ఆయన ప్రస్తావించారు.
“తీవ్రవాద నిర్మూలన పట్ల ప్రభుత్వ పట్టుదల పదే పదే నిరూపితమవుతోంది. సర్జికల్ దాడి మొదలు బాలకోట్ దాడి దాకా అది చూశాం. మన సాయుధ దళాల చర్యల వలన జమ్ము కాశ్మీర్ లో తీవ్రవాద కార్యకలాపాలు తగ్గాయి. అదే విధంగా తీవ్రవాద కార్యకలాపాలకు నిధులందటాన్ని దాదాపు 94% తగ్గించగలిగాం” అన్నారు.
ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి నెలకొల్పటానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను కూడా మంత్రి సుదీర్ఘంగా ప్రస్తావించారు. ఈశాన్య భారతంలో 2014 నుంచి శాంతియుగం మొదలైందనితీవ్రవాద చొరబాట్లు 80 శాతం తగ్గగా పౌరుల మరణాలు 89 శాతం తగ్గాయన్నారు. దీనికి తోడు 2014 తరువాత దాదాపు 6 వేలమందికి పైగా తీవ్రవాడులు లొంగిపోయారన్నారు.
తీవ్రవాదాన్ని అదుపు చేయటానికి సాయుధ దాడులకు మించి చేయటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అప్పుడే ప్రజలకు శాంతియుతమైన జీవితాన్ని అందించినట్టవుతుందన్నారు. శాంతి ఒప్పందాలు చేసుకోవటం ద్వారా కూడా ప్రభుత్వం ఎంతో ముందడుగు వేసిందని గుర్తు చేశారు. ఈ విషయానికున్న ప్రాధాన్యాన్ని వివరిస్తూ ప్రభుత్వం సంతకాలు చేసిన వివిధ శాంతి ఒప్పందాలను ప్రస్తావించారు.
2020 జనవరిలో బోడో ఒప్పందం
2020 జనవరిలో బ్రూ రియాంగ్ ఒప్పందం
2019 ఆగస్టులో ఎన్ ఎల్ ఎఫ టి – త్రిపుర ఒప్పందం
2021 సెప్టెంబర్ లో కర్బి ఆంగ్లాంగ్ ఒప్పందం
2022 మార్చిలో అస్సాం-మేఘాలయ అంతర్రాష్ట్ర సరిహద్దు ఒప్పందం
కొన్నేళ్ళుగా ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను కూడా మంత్రి ప్రస్తావించారు. కష్టాల్లో ఉన్న భారతీయులను కాపాడటం ప్రభుత్వానికి అత్యంత ప్రాధానమని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా చేపట్టిన చర్యలను ఏకరవుపెట్టారు.
22,500 మంది పౌరులను 2022 ఫిబ్రవరి-మార్చి మధ్య ‘ఆపరేషన్ గంగ’ కింద కాపాడారు
670 మంది భారతీయులను ఆపరేషన్ దేవిశక్తి కింద ఆఫ్ఘనిస్తాన్ నుంచి కాపాడారు
కోవిడ్ -19 సంక్షోభ సమయంలో ‘వందే భారత్ మిషన్’ కింద 2021-22 లో కోటీ 83 లక్షలమందిని భారత్ కు తీసుకు రావటం అతిపెద్ద సహాయక చర్య
చైనా లోని వూహాన్ నుంచి 654 మందిని భారత్ కాపాడి తెచ్చింది.
కేవలం భారతీయులనే కాకుండా కష్టాల్లో ఉన్న ఇతరదేశాలవారికి కూడా సాయం అందించింది. 2016 లో ‘ఆపరేషన్ సంకట్ మోచన’ కింద దక్షిణ సూడాన్ నుంచి ఇద్దరు నేపాలీయులతో సహా 155 మందిని తీసుకొచ్చింది. 5000 మంది భారతీయులను ‘ఆపరేషన్ మైత్రి’ కింద నేపాల్ నుంచి తీసుకురాగా 170 మంది విదేశీయులు కూడా వారిలో ఉన్నారు. ‘ఆపరేషన్ రాహత్’ కింద 6710 మందిని యెమెన్ నుంచి తీసుకురాగా, వారిలో 1962 మంది విదేశీయులు. కష్టకాలంలో అందరినీ ఆడుకునే దేశంగా భారత్ కు ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చిందని మంత్రి వ్యాఖ్యానించారు.
***
(Release ID: 1884898)
Visitor Counter : 166
Read this release in:
Urdu
,
Marathi
,
Hindi
,
Punjabi
,
Kannada
,
Gujarati
,
Assamese
,
Odia
,
English
,
Bengali
,
Tamil
,
Malayalam