రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
మహారాష్ట్రలోని ఇగత్‌పురి, నాసిక్‌లో రూ. 1800 కోట్ల విలువైన 8 జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేసిన శ్రీ నితిన్ గడ్కరీ
Posted On:
18 DEC 2022 7:45PM by PIB Hyderabad
కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ మహారాష్ట్రలోని ఇగత్‌పురి, నాసిక్‌లో రూ. 1800 కోట్ల విలువైన 226 కి.మీ పొడవు గల 8 జాతీయ రహదారుల ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేశారు. కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ సహాయ మంత్రి డాక్టర్. భారతీ పవార్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సుభాష్ భామ్రే, శ్రీ హేమంత్ గాడ్సే, ఎమ్మెల్యేలు ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ హైవే ప్రాజెక్ట్లతో పలు జిల్లాలో మేటి రవాణా అందుబాటులోకి రానుంది. ప్రయాణం సురక్షితంగా మారుతుంది. ఇంధనం, సమయం ఆదా అవుతుంది. అలాగే కాలుష్యం కూడా తగ్గుతుంది. ఈ ప్రాజెక్టుల వల్ల వ్యవసాయం, హస్తకళల ఉత్పత్తులు స్థానిక మార్కెట్లకు చేరుకోవడం సులభతరం అవుతుంది, గ్రామీణ ప్రాంతాలను నగరాలతో మరింత చేరులోకి తీసుకురావడానికి సహాయపడుతుంది, అలాగే కొత్త పరిశ్రమలు వాటి ద్వారా కొత్త ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయి.
*******
(Release ID: 1884718)
Visitor Counter : 158