సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్త ప్రచారం ప్రశాసన్ గాంవ్ కి ఓర్ అన్న సుపరిపాలన వారోత్సవం 2022ను 19 డిసెంబర్ 2022న ప్రారంభించనున్న కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
ఐదురోజుల ప్రశాసన్ గాంవ్ కి ఓర్ ప్రచారం సందర్భంగా దేశంలోని జిల్లా కలెక్టర్లచే ఆన్‌లైన్ సేవాల బట్వాడాకు జోడించేందుకు 3,120 నూతన సేవలను గుర్తింపు
డిసెంబర్ 10-18,2022 వరకు నిర్వహించిన సుపరిపాలనా వారోత్సవం 2022 సన్నాహక దశలో సేవల బట్వాడాలో పరిష్కరించేందుకు 81,27,944 దరఖాస్తులను, రాష్ట్ర గ్రీవెన్స్ పోర్టళ్ళపై పరిష్కరించేందుకు 19,48,122 ప్రజా సమస్యలను కూడా జిల్లా కలెక్టర్లు గుర్తించారు
23 డిసెంబర్ 2022న నిర్వహించనున్న జిల్లా స్థాయి వర్క్‌షాప్‌లలో చర్చించేందుకు 373 సుపరిపాలనా పద్ధతుల గుర్తింపు
Posted On:
18 DEC 2022 4:38PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లు గుర్తించిన 3,120 సేవలను ఐదురోజుల ప్రశాసన్ గావ్ కి ఓర్ కేంపెయిన్ సందర్భంగా ఆన్‌లైన్ సేవా బట్వాడాకు జోడించనున్నారు. ఈ ప్రచారాన్ని కేంద్ర సిబ్బంది, ప్రజా సమస్యలు, పింఛన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సోమవారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ప్రారంభించనున్నారు.
డిసెంబర్ 10-18, 2022 వరకు జరిగిన సుపరిపాలనా వారోత్సవాలు 2022 సన్నాహక దశ సందర్భంగా సేవల బట్వాడా కోసం దాఖలు చేసిన 81,27, 944 ని పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్లు గుర్తించడంతో పాటుగా 19,48,122 ప్రజా సమస్యలను రాష్ట్ర గ్రీవెన్స్ పోర్టల్ పై పరిష్కరించేందుకు గుర్తించారు.
డిసెంబర్ 23, 2022న జరుగనున్న జిల్లా స్థాయి వర్క్‌షాప్‌లలో చర్చల కోసం 373 ఉత్తమమైన సుపరిపాలనా పద్ధతులను గుర్తించినట్టు డిఎఆర్‌పిజి కార్యదర్శి శ్రీ వి.శ్రీనివాస్ చెప్పారు. అలాగే, ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించిన 43 విజయ గాథలను కూడా 19 డిసెంబర్ నుంచి 25 డిసెంబర్ 2022వరకు జరుగనున్న సుశాసన్ సప్తాహ్ అన్న సుపరిపాలనా వారోత్సవం-2022లో పంచుకోనున్నారు.
దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలు, తాలూకాలలో సుశాసన్ సప్తాహ్ విజయవంతమయ్యేందుకు ప్రధానమంత్రి తన శుభాకాంక్షలను తెలిపారు. తన సందేశంలో, ఈ ఏడాది కూడా ప్రశాసన్ గాంవ్ కి ఓర్ ప్రచారం అన్నది సుపరిపాలనా వారోత్సవంలో భాగంగా కొనసాగడం నాకు ఆనందకరంగా ఉందన్నారు. మేం ప్రజా సమస్యల పరిష్కారం, ఆన్‌లైన్ సేవలు, సేవా బట్వాడా అప్లికేషన్ల నిర్వహణ, సుపరిపాలనా పద్ధతులు సహా పలు పౌరులు కేంద్రంగా చొరవలను చేపట్టామన్నారు. మా దార్శనికత సేవా బట్వాడా యంత్రాంగాల విస్త్రతిని పెంచి వాటిని మరింత సమర్ధవంతం చేయడమన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా ప్రచారం, సేవల బట్వాడాను మెరుగుపరచడం అన్నవి దేశంలోని అన్ని జిల్లాల్లో, రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో నిర్వహిస్తారు. దాదాపు 700మంది జిల్లా కలెక్టర్లు ఈ ప్రచారంలో పాలుపంచుకోనుండగా, అధికారులు తాలూకా, పంచాయతి సమితి కేంద్ర కార్యాలయాలను సందర్శించనున్నారు.
మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సుపరిపాలనా వారోత్సవాలు 2022 పోర్టల్, డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.పిజిపోర్టల్. జిఒవి.ఐఎన్/ జిజిడబ్ల్యు22 (www.pgportal.gov.in/GGW22)ను ప్రారంభించనున్నారు. ఇందులో జిల్లా కలెక్టర్లు పురోగతిని అప్‌లోడ్ చేయడమే కాక, సుపరిపాలనా పద్ధతులను, వీడియో క్లిప్‌లను అప్‌లోడ్ చేస్తారు. దేశ సమస్యా పరిష్కార వేదికలు ఏకీకృతంగా పని చేయడానికి సుశాసన్ సప్తాహ్ సాక్షిగా ఉండనుంది. అంటే, సిపిజిఆర్ఎఎంఎస్‌పై అందుకున్న సమస్యలను, రాష్ట్ర పోర్టళ్ళపై అందుకున్న సమస్యలతో పాటుగా పరిష్కరిస్తారు. అమృత్ కాల్ సమయంలో ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు, సేవల బట్వాడాను మెరుగుపరిచేందుకు, తాలూకా స్థాయి వరకు జాతీయ ప్రచారాన్ని నిర్వహించడం ఇది రెండవసారి. ప్రశాసన్ గాంవ్ కి ఓర్ అభియాన్ అన్నది భవిష్యత్ తరాలకు స్ఫూర్తిని ఇచ్చేందుకు సుపరిపాలనను ఒక జాతీయ స్థాయి ఉద్యమంగా సృష్టిస్తుంది.
2022లో ప్రజా సమస్యల పరిష్కారంలో దేశం సాధించిన ప్రగతిని ప్రతిఫలింప చేసేందుకు సిపిజిఆర్ఎఎంఎస్ 2022కు వార్షిక నివేదికను ఈ సందర్భంగా విడుదల చేయనున్నారు.
సుపరిపాలన వారోత్సవం 2022కు సన్నాహక దశను 10 నుంచి 18 డిసెంబర్, 2022 వరకు నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు 19 నుంచి 25 డిసెంబర్ 2022 వరకు పరిష్కరించేందుకు దిగువన పేర్కొన్న లక్ష్యాలను డెడికేటెడ్ పోర్టల్‌పై గుర్తించారు.
సేవల బట్వాడా కింద పరిష్కరించవలసిన దరఖాస్తులు
|
81,27,944
|
రాష్ట్ర గ్రీవెన్స్ పోర్టళ్ళపై పరిష్కరించవలసిన సమస్యలు
|
19,16,142
|
సిపిజిఆర్ఎఎంఎస్ పై పరిష్కరించిన సమస్యలు
|
31,980
|
ఆన్‌లైన్ సేవల బట్వాడా కింద జోడించిన నూతన సేవల సంఖ్య
|
3120
|
ఉత్తమ సుపరిపాలనా పద్ధతులు
|
373
|
ప్రజా సమస్యల పరిష్కారంపై విజయగాథలు
|
43
|
సేవా బట్వాడా దరఖాసుల వర్గంలో - మధ్య ప్రదేశ్ జిల్లాల్లో 55,72,862 సమస్యలను గుర్తించిన లక్ష్యం కాగా, పంజాబ్‌లోని జిల్లాల్లో గుర్తించిన లక్ష్యం 21,96,987.ప్రజా సమస్యల పరిష్కార వర్గంలో మధ్య ప్రదేశ్ జిల్లాల్లో గుర్తించిన లక్ష్యం 16,67, 296 సమస్యలు కాగా, తమిళనాడు జిల్లాల్లో పరిష్కారానికి గుర్తించిన సమస్యలు 1,38, 621.
జిల్లా స్థాయి ఆవిష్కరణలపై వర్క్‌షాప్‌ను జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ప్రతి జిల్లాలోనూ 23 డిసెంబర్ 2022న జరుగుతుంది. ఈ వర్క్‌షాప్ జిల్లా స్థాయి ఆవిష్కరణలపై దృష్టి పెడుతుంది. డిసెంబర్ 23, 2022న జరుగనున్న జిల్లా స్థాయి వర్క్ షాప్‌లలో ప్రెజెంటేషన్ల కోసం 373 జిల్లా స్థాయి ఆవిష్కరణలను గుర్తించారు.. వ్యవస్థల డిజిటల్ పరివర్తన, పౌరుల డిజిటల్ సాధికారతను లక్ష్యంగా పెట్టుకుని చేసిన ఆవిష్కరణలపై దృష్టి.
రెండవ సుశాసన్ సప్తా్ భారతదేశంలోని ప్రతి స్థాయిలో సుపరిపాలను ముందుకు తీసుకువెళ్ళేందుకు తోడ్పడుతుంది.
***
(Release ID: 1884712)
Visitor Counter : 192