యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
ఎస్ఎఐకి చెందిన పాటియాలా, సోనిపట్ కేంద్రాలను సందర్శించి రూ. 85 కోట్లు విలువైన అనేక మౌలికసదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించిన కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్
ఈ ప్రతిష్ఠాత్మక కేంద్రాలలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు మెరుగైన వసతి సౌకర్యాలుః శ్రీ అనురాగ్ ఠాకూర్
Posted On:
17 DEC 2022 2:53PM by PIB Hyderabad
300 పడకల ఆసుపత్రి నిర్మాణ వ్యయం రూ. 26.77 కోట్లు
భారతదేశ లెజెండరీ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్‌చంద్,స్ప్రింటర్ పిటి ఉషకు అంకితం చేసిన రూ. 5.25 కోట్ల పునరుద్ధరించి, ఆధునీకరించిన హాస్టళ్ళను కూడా మంత్రి ప్రారంభించారు.
కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ శనివారంనాడు పాటియాలాలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్ఎఐ)కి చెందిన నేతాజీ సుభాస్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్ఎస్ఎన్ఐఎస్) లో రూ. 26.77 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన 300 పడకల ఆసుపత్రిని ప్రారంభించారు.
భారతదేశానికి చెందిన ప్రతిష్ఠాత్మక హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్, స్ప్రింటర్ పిటి ఉషకు రూ. 5.25 కోట్ల వ్యయంతో పునరుద్ధరించి, ఆధునీకరించి, అంకితం చేసిన హాస్టళ్ళను కూడా మంత్రి ప్రారంభించారు.
ప్రారంభోత్సవం సందర్భంగా ప్రసంగిస్తూ, క్రీడాకారులకు సాధ్యమైనంత ఉత్తమ సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని శ్రీ ఠాకూర్ చెప్పారు. అన్ని విధానాలలోనూ క్రీడాకారులను కేంద్రంగా ఉంచాల్సిన ప్రాముఖ్యత గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీజీ ఎప్పుడూ నొక్కివక్కాణిస్తుంటారని అన్నారు. 300 పడకల హాస్టల్‌ను ప్రారంభించడం, పాత హాస్టళ్ళ ఆధునీకరణ అనేది ఈ దిశగా మరొక అడుగు. తద్వారా ప్రతిష్ఠాత్మక కేంద్రాలలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులుగు మెరుగైన వసతి సౌకర్యాలు ఉంటాయని పేర్కొన్నారు.
స్పోర్ట్స్ పెర్ఫార్మెన్స్ అనాలసిస్ కోర్సును కూడా శ్రీ ఠాకూర్ ప్రారంభించారు. ఇది ఎన్ఎస్ఎన్ఐఎస్ పాటియాలాలో అందిస్తున్న అకడమిక్ కోర్సులకు తొలిసారి దీనిని అదనంగా చేర్చారు. ఈ కోర్సుకు సంబంధించిన తొలి బ్యాచ్ విద్యార్ధులతో ముచ్చటిస్తూ, క్రీడా శాస్త్రాన్ని, క్రీడల రాణింపు విశ్లేషణను ప్రదేశపెట్టడమనేది ఒక క్రీడాకారుడి వాస్తవ సంభావ్యతను అంచనా వేసేందుకు అత్యంత ముఖ్యమని, ఇది అంతర్జాతీయ పోటీదారుల మొత్తం రాణింపును మెరుగుపరచడంలో ఇది ఎంతో ఉపయోగపడుతుందని శ్రీ ఠాకూర్ చెప్పారు.
తన పర్యటన సందర్భంగా, దాదాపు 400 మంది క్రీడాకారులతో, శిక్షకులతో ముచ్చటించి, క్రీడలపై దృష్టిపెట్టడాన్ని కొనసాగిస్తూ దేశానికి గర్వకారణం కావలసిందిగా వారికి ప్రేరణను ఇచ్చారు. ఆయన క్రీడాకారుల నుంచి వారికి సెంటర్లలో అందుబాటులో ఉన్న సౌకర్యాల గురించి, ప్రస్తుతం ఉన్న ఏర్పాట్లలో వారికి కావలసిన మెరుగుదల గురించి ఇన్‌పుట్లు కోరారు.
అనేక సంవత్సరాలుగా ఎస్ఎఐ పాటియాలా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు, ఒలింపిక్ మెడళ్ళు సహా దేశంలోనూ, అనేకమంది ప్రముఖ క్రీడాకారులను తయారు చేసింది.
జాతీయ స్థాయి పోటీలలో ఎస్ఎఐ పాటియాలా క్రీడాకారులు 2021వ సంవత్సరంలో ఆరు విభాగాలలో మొత్తం 72 మెడళ్ళను గెలుచుకుంది. ఇక 2022వ సంవత్సరంలో మెడళ్ళ ట్యాలీ మొత్తం 195కు పెరిగింది.
అంతర్జాతీయ స్థాయిలో కామన్‌వెల్త్ ఛాంపియన్‌షిప్‌లు, యూరోపియన్ ఓపెన్ & జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లు సహా ఎస్ఎఐ పాటియాలా క్రీడాకారులు 19 మెడళ్ళను గెలుచుకుంది.
అనంతరం, సహాయ మంత్రి శ్రీ నిశిత్ ప్రమాణిక్‌తో కలిసి సోనిపట్‌లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్ఎఐ) నేషనల్ రీజియనల్ సెంటర్ (ఎన్ఆర్‌సి)ని, సందర్శించి, రూ. 48 కోట్ల వ్యయంతో నూతన ఇంటిగ్రేటెడ్ హై ఫెర్ఫార్మెన్స్ సెంటర్ (హెచ్‌పిసి)కు పునాదిరాయి వేశారు.
తమ పర్యటనల సందర్భంగా, మంత్రులు నూతనంగా మెరుగుపరిచిన సింథటిక్ మాకీ ఫీల్డ్‌ను ప్రారంభించారు.దీనిని దాదాపు రూ. 5 కోట్ల వ్యయంతో పునరుద్ధరించి, ఆధునీకరించారు.
***
(Release ID: 1884654)
Visitor Counter : 166