హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షతన ఈ రోజు కోల్‌కతాలో జరిగిన 25వ ఈశాన్య ప్రాంత మండలి సమావేశం


గత 8 సంవత్సరాల కాలంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో ప్రాంతీయ మండళ్లు 1000కి పైగా అంశాలు చర్చించి 93% అంశాలు పరిష్కరించి ఘన విజయం సాధించాయి.

2006 - 2013 మధ్య కాలంలో ఆరుసార్లు జోనల్ కౌన్సిల్‌ సమావేశాలు జరిగాయి (సగటున సంవత్సరానికి ఒక సమావేశం కంటే తక్కువ)
2014 నుంచి ఇంతవరకు కోవిడ్-19 ప్రభావం ఉన్నపటికీ మొత్తం 23 కౌన్సిల్ సమావేశాలు నిర్వహణ (నేటి సమావేశం తో సహా) (సంవత్సరానికి సగటున 3 సమావేశాలు)

అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు మరియు శాఖల సహకారంతో సమావేశాల సంఖ్య పెరిగి సమస్యలు వేగంగా పరిష్కారం అవుతున్నాయి. సమావేశాల నిర్వహణ లో అంతర్-రాష్ట్ర మండలి సచివాలయం క్రియాశీలక పాత్ర పోషిస్తోంది.

ఈశాన్య ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్రం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది.

ఈశాన్య ప్రాంత అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్న శ్రీ నరేంద్ర మోదీ గతి శక్తి పథకంలో ఈశాన్య రాష్ట్రాలకు పెద్ద పీట వేశారు.

రానున్న 25 సంవత్సరాల అమృత కాలంలో తూర్పు ప్రాంతం భారతదేశ అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది

సానుకూల వాతావర

Posted On: 17 DEC 2022 4:43PM by PIB Hyderabad

కేంద్ర హోం , సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షతన ఈ రోజు  కోల్‌కతాలో  ఈశాన్య ప్రాంత మండలి  25 సమావేశం జరిగింది. పశ్చిమ బెంగాల్ఝార్ఖండ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులుబీహార్ ఉప ముఖ్యమంత్రిఒడిశా రాష్ట్ర మంత్రిహోం శాఖరాష్ట్రాల సీనియర్ అధికారులు సమావేశానికి హాజరయ్యారు. 

సమావేశాన్ని ప్రారంభించిన  అనంతరం మాట్లాడిన శ్రీ అమిత్ షా గత 8 సంవత్సరాల కాలంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో  దేశంలో ప్రాంతీయ మండళ్లు 1000కి పైగా అంశాలు చర్చించి 93% అంశాలు పరిష్కరించి ఘన విజయం సాధించాయని అన్నారు. 2006 - 2013 మధ్య కాలంలో ఆరుసార్లు   జోనల్ కౌన్సిల్‌ సమావేశాలు  (సగటున సంవత్సరానికి ఒక సమావేశం  కంటే తక్కువ) మాత్రమే జరిగాయని పేర్కొన్న శ్రీ షా 2014 నుంచి ఇంతవరకు కోవిడ్-19 ప్రభావం ఉన్నపటికీ  మొత్తం 23 కౌన్సిల్  సమావేశాలు   (నేటి సమావేశం తో సహా)  (సంవత్సరానికి సగటున 3 సమావేశాలు) జరిగాయని వివరించారు.అన్ని రాష్ట్ర ప్రభుత్వాలుకేంద్ర మంత్రిత్వ శాఖలు శాఖల సహకారంతో సమావేశాల సంఖ్య పెరిగిందనిసమస్యలు వేగంగా పరిష్కారం అవుతున్నాయని అన్నారు.  సమావేశాల నిర్వహణ లో  అంతర్-రాష్ట్ర మండలి సచివాలయం క్రియాశీలక పాత్ర పోషిస్తోంది అని శ్రీ షా తెలిపారు.

ఈశాన్య ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్రం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని శ్రీ షా తెలిపారు. ఈశాన్య ప్రాంత అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్న శ్రీ నరేంద్ర మోదీ గతి శక్తి పథకంలో ఈశాన్య రాష్ట్రాలకు పెద్ద పీట  వేశారని అన్నారు. రానున్న 25 సంవత్సరాల అమృత కాలంలో తూర్పు ప్రాంతం భారతదేశ అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అని కేంద్ర హోం శాఖ మంత్రి అన్నారు. సుహృద్భావసానుకూల వాతావరణంలో  25వ తూర్పు జోనల్ కౌన్సిల్ సమావేశం జరిగిందని తెలిపిన శ్రీ షా అనేక అంశాలపై ఏకాభిప్రాయం కుదిరిందని  మిగిలిన సమస్యలను   సంప్రదింపుల ద్వారా పరిష్కరిస్తామని అన్నారు. 

ఈశాన్య ప్రాంతంలో వామపక్ష తీవ్రవాద సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యిందని శ్రీ అమిత్ షా వెల్లడించారు. తీవ్రవాద సమస్య తిరిగి తలెత్తకుండా చూడడానికి అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరగాలని అన్నారు. అభివృద్ధి లో  దేశం ఇతర ప్రాంతాలతో ఈశాన్య ప్రాంతం పోటీ పది సమానంగా అభివృద్ధి చెందాలని అన్నారు.  మాదకద్రవ్యాల నివారణకు జిల్లా స్థాయిలో ఎన్‌సిఓఆర్‌డి యంత్రాంగం ఏర్పాటు చేసి తరచూ సమావేశాలు నిర్వహించాలని శ్రీ షా సూచించారు.  దేశంలో  మాదకద్రవ్యాల నిర్మూలనకు సాగుతున్న కార్యక్రమ కీలక దశలో ఉందని తెలిపిన శ్రీ షా కృత్రిమ మేధస్సు  సహాయంతో కార్యక్రమాన్ని మరింత వేగంగా పటిష్టంగా అమలు చేస్తామని తెలిపారు.



(Release ID: 1884647) Visitor Counter : 219