వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

సెంట్రల్ పూల్ లో తగినన్ని ఆహారధాన్యాలు: కేంద్రం


అదనపు నిల్వ అవసరం 138 లక్షల మెట్రిక్ టన్నులు కాగా 2023 జనవరి 1 నాటికి 159 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమల అందుబాటు

2022 డిసెంబర్ 12 నాటికి సెంట్రల్ పూల్ లో 182 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమల అందుబాటు

Posted On: 15 DEC 2022 10:38AM by PIB Hyderabad

ఎన్ ఎఫ్ ఎస్ ఏ తదితర సంక్షేమ పథకాల అవసరాలతోబాటు పిఎం జి కె ఎవై  అదనపు కేటాయింపులకు కూడా సరిపడేమతగా భారత్ ప్రభుత్వం దగ్గర  సెంట్రల్ పూల్  కింద ఆహార ధాన్యాల నిల్వలున్నాయి. 2023 జనవరి 1 నాటికి దాదాపు 159 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు అందుబాటులో ఉంటాయి. మామూలుగా జనవరి 1 నాటికి 138 లక్షల మెట్రిక్ టన్నులు నిల్వ ఉంటే చాలు. 2022 డిసెంబర్ 12 నాటికి దాదాపు 182 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు సెంట్రల్ పూల్ కింద నిల్వ ఉన్నాయి.

 

గోధుల ధర పరిస్థితి  భారత్ ప్రభుత్వానికి తెలుసు. అందుకే ప్రతివారం గోధుమతో బాటు ఇతర ధాన్యాల పరిస్థితిని సమీక్షిస్తోంది.  అవసరమైన చోట దిద్దుబాటు చర్యలు తీసుకుంటోంది. మరింత పెరగకుండా ధరల నియంత్రణకు తీసుకోవాల్సిన అన్నీ చర్యలూ ప్రభుత్వం తీసుకుంటోంది.  2022 మే 13 నుంచి ఎగుమతులమీద నియంత్రణలు విధించింది.  పైహా ఎన్ ఎఫ ఎస్ ఏ కింద, పి ఎం జి కె ఏ వై కింద చేసే కేటాయింపులను కూడా బియ్యానికి  తగిన విధంగా సవరించింది. దీనివలన తగినన్ని గోధుమ నిల్వలు సంక్షేమ పథకాలకు సరిపడేలా సెంట్రల్ పూల్ లో అందుబాటులో ఉంటాయి.

ఈ సంవత్సరం భారత ప్రభుత్వం గోధుమల కనీస మద్దతు ధరను  క్వింటాలుకు రూ. 2125  కు పెంచింది. అంతకు ముందు అది రూ.2015 గా ఉంది.  ఇలా క్వింటాలుకు రూ. 110 చొప్పున పెంచటానికి తోడు వాతావరణం కూడా అనుకూలించటం వల్ల గోధుమల ఉత్పత్తి, సేకరణ కూడా సాధారణ  స్థాయిలో కొనసాగే అవకాశాలున్నాయి.  2023 ఏప్రిల్ లో వచ్చే సీజన్ గోధుమ సేకరణ మొదలవుతుంది.  ప్రాథమిక అంచనాల ప్రకారం నీరుటితో పోల్చినప్పుడు గోధుమ సాగు విస్తీర్ణం ఈ ఏడాది పెరిగింది. 

దేశ వ్యాప్తంగా అన్నీ సంక్షేమ పథకాలకూ అవసరమైన ధాన్యం అందుబాటులో ఉండేలా భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అదే సమయం లో ధరలు కూడా నియంత్రణలో ఉంటాయి.

నిరుడు గోధుమల సేకరణ కాస్త తక్కువగా ఉండటానికి కారణం ఉత్పత్తి తక్కువగా ఉండటంతోబాటు రైతులు కనీస మద్దతు ధరకంటే ఎక్కువకు అమ్ముకోవటం. అయినప్పటికీ తగిన నిల్వలు సెంట్రల్ పూల్ లో అందుబాటులో ఉన్నాయి. ఇది వచ్చే పంట సీజన్ దాకా సరిపోతుంది. 

***



(Release ID: 1883831) Visitor Counter : 130